
Rashmika : పాన్ ఇండియా స్టార్ గా రష్మిక మందనకి పుష్ప సినిమాతో ఎంత పెద్ద స్టార్టమ్ వచ్చిందో మనందరికీ తెలిసిందే. గీత గోవిందం సినిమా నుంచి ఈమెపై ఉన్న క్రేజ్ మామూలు క్రేజ్ కాదు. అక్కడ నుంచి అలా పయనిస్తూ పుష్ప ( Rashmika revealed that she married ) సినిమాతో ఆమె హైప్ క్రియేట్ అయిపోయింది. అయితే ఈమె మీద ఎప్పుడు ఏదో ఒక వార్తలు వస్తూనే ఉంటాయి. రష్మిక ఎప్పుడు పెళ్లి చేసుకోబోతుంది? ఎవరిని ప్రేమిస్తుంది అని ఎన్నోసార్లు ఎన్నో వార్తలు వచ్చాయి. కానీ ఈసారి రష్మిక తన నోటితో తానే తనకి ఎప్పుడో పెళ్లయిపోయిందని చెప్పడం జరిగింది. ఇప్పుడు ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
రష్మిక మందన ఇండస్ట్రీకి వచ్చిన కొత్తల్లోనే రక్షిత్ శెట్టి అనే వ్యక్తిని ప్రేమించి.. అతనితో ఎంగేజ్మెంట్ కూడా చేసుకుంది. ఇంక అతనితో పెళ్లి జరుగుతుంది అనగా.. వాళ్ళిద్దరి మధ్యన మనస్పర్ధలు వచ్చి.. ఆ పెళ్లి అక్కడితో ఆగిపోయింది. అయితే ఇదంతా కేవలం రష్మిక వేణుస్వామి మాటలు విని ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేసుకుందని.. జాతకరీత్యా ( Rashmika revealed that she married ) అతనితో ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేసుకుంటేనే కలిసి వస్తుందని వేణుస్వామి చెప్పడం వలన రష్మిక అలా చేసిందని కూడా వార్తలు ఎన్నో వచ్చాయి. ఏదేమైనా మొత్తానికి ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ అయిన తర్వాత రష్మిక చాలా పెద్ద స్టార్ హీరోయిన్ అయింది. సాధారణంగా రష్మిక అనగానే అందరికీ విజయ్ దేవరకొండ గుర్తుకొస్తాడు.
వీళ్ళిద్దరి మధ్య ఉండే కెమిస్ట్రీ మరి మామూలుగా ఉండదు. వీళ్ళిద్దరూ ప్రేమలో ఉన్నారని, వీళ్ళిద్దరూ అనేక టూర్లకు కూడా వెళ్లారని ఎన్నో వార్తలు వచ్చాయి. కానీ ఎంతమంది ఎన్నన్నా వీళ్ళిద్దరూ మాత్రం మేమిద్దరం బెస్ట్ ఫ్రెండ్స్ అంతే.. మాకు ఎలాంటి ఎఫైర్ లేదంటూ చెప్తూనే వస్తున్నారు. వాళ్ళు ఎన్ని చెప్పినా వాళ్ళిద్దరూ కలిసి తిరిగేటప్పుడు, మాట్లాడుకునేటప్పుడు చుట్టూ ఉన్న వాళ్ళు వాళ్ళని అబ్జర్వ్ చేసినా.. అభిమానులైతే వీళ్ళిద్దరి మధ్య ( Rashmika revealed that she married ) ఖచ్చితంగా ఏదో నడుస్తుందని.. కచ్చితంగా పెళ్లి చేసుకుంటారని ఎదురుచూస్తున్నారు. అయితే రష్మిక మందన గత కొన్ని రోజులు ముందు బాలీవుడ్ హీరో టైగర్ ఫ్రాష్ తో కలిసి ఒక సినిమా ప్రమోషన్ లో పాల్గొన్నప్పుడు యాంకర్ ఆమెను కొన్ని ప్రశ్నలు అడగడం జరిగింది. మీ పెళ్లి ఎప్పుడు అని యాంకర్ అడగగా దానికి రష్మిక ఇలా సమాధానం ఇచ్చింది.
ఆ సమాధానంతో ఆమె ఫ్యాన్స్ అందరూ ఆశ్చర్యపోతున్నారు. నాకు ఎప్పుడో పెళ్లి అయిపోయింది. ఆ వ్యక్తి ఎవరో కాదు నరుటో తో అని చెప్పింది. నరుటో అంటే ఎవరో కాదు.. ఎంతో ఫేమస్ అయినటువంటి ఎనిమి సిరీస్ లోని ఒక పాత్ర పేరు. ఇక ఆ పాత్రకి చాలామంది అభిమానులు కూడా ఉంటారు. అయితే అందులో రష్మిక కూడా ఒక అభిమాని అయ్యి ఉండొచ్చు. అందుకే ఆమెనరుటో తో నాకు పెళ్లి అయిపోయిందని సరదాగా ఆన్సర్ ఇచ్చింది. అయితే దీనికి రష్మిక అభిమానులు అందరూ సరదాగా తన పెళ్లి గురించి అడిగితే.. దాటించేసింది గాని ఆమె కచ్చితంగా విజయ్ దేవరకొండ నే ప్రేమిస్తుందని.. అది స్కిప్ చేసేందుకే ఇలాంటి ఫన్నీ ఆన్సర్ ఇచ్చిందని అభిమానులు అంటున్నారు.