Home Cinema Ram Pothineni: ఏంటి.? ఆ స్టార్ హీరో భార్య వల్లే రామ్ ఇప్పటి వరకు పెళ్లి...

Ram Pothineni: ఏంటి.? ఆ స్టార్ హీరో భార్య వల్లే రామ్ ఇప్పటి వరకు పెళ్లి చేసుకోకుండా ఉంటున్నాడా.?

Ram Pothineni: దేవదాస్ సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమంలో అడుగుపెట్టిన రామ్ పోతినేని తన మొదటి సినిమాతోనే సూపర్ డూపర్ బ్లాక్ బాస్టర్ హిట్ తన ఖాతాలో వేసుకున్నాడు. ఆ తర్వాత చిత్రాలు అంతగా విజయం సాధించలేకపోవడం వల్ల స్టార్ హోదా అయితే కాదు గాని మిడిల్ రేంజ్ లోవర్ లో మాత్రం ఇతగాడు ముందుంటాడు. అలా వరుస సినిమాలు చేస్తూ వస్తున్న రామ్ పొతినేని (Ram Pothineni Marriage) ఎనర్జిటిక్ హీరోగా పేరు సంపాదించుకున్నాడు. ఇక మన టాపిక్ విషయానికి వస్తే..సినీ ఇండస్ట్రీలోనే పెళ్లి కానీ పెద్దలు ఎంతోమంది ఉన్నారు పేరు మోపిన బడా స్టార్స్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ ఒక్కొక్కలు పెళ్లి పీటలు ఎక్కడానికి లైన్ కడుతూ లైఫ్ లో సెట్ అవుతున్నారు..

See also  Madhavi Latha: బాలకృష్ణ సినిమా పై మధివిలత చేసిన సంచలన కామెంట్స్ కి మీనింగ్ అదా?

ram-pothineni-is-unmarried-cause-of-the-star-heros-wife

కానీ మన ఇండస్ట్రీలో వయసుకి వచ్చినా పెళ్లి చేసుకోవాలనే ఆలోచన లేకుండా ఉండే హీరోలు ఉన్నారు. అలాంటి వాళ్లలో ప్రస్తుతం లిస్టులో ఉన్నది రామ్ పోతినేని..తనదైన నటనతో అందరిని మురిపిస్తూ సినిమా ఇండస్ట్రీలో తన స్టైల్, నటనతో తనకంటూ ఓ ప్రత్యేక ఇమేజ్ ని పొందాడు రామ్..ప్రస్తుతమైతే బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్నాడు. ఈ చిత్రం కచ్చితంగా రామ్ పోతినేనికి బ్లాక్ బస్టర్ హిట్ తెచ్చిపెడుతుందని ధీమాతో ఉన్నాడు. ఇక మన అసలు విషయానికి వస్తే.. రామ్ పోతినేని ఇప్పటివరకు పెళ్లి చేసుకోకుండా ఉందడానికి కారణం ఏంటనే ప్రశ్న ప్రస్తుతం సోషల్ మీడియాలో జనాలు చర్చించుకుంటున్న విషయం..

See also  Chiranjeevi: ఆ యాక్టర్ వల్ల చిరంజీవి పెళ్లి ఆగిపోయేంత పనయ్యింది. కానీ చివరకు పెళ్లి ఎలా అయ్యిందంటే.?

ram-pothineni-is-unmarried-cause-of-the-star-heros-wife

ఆ స్టార్ హీరో భార్య వల్లే రామ్ పెళ్లి (Ram Pothineni Marriage) చేసుకోవడం లేదా.? ఎందుకంటే..రామ్ కి అదృష్టం తెచ్చి పెట్టిన హీరోయిన్ జెనీలియా ని కొందరు కావాలనే టార్గెట్ చేస్తూ రామ్ పెళ్లి చేసుకోక పోవడానికి ఆమెనే కారకురాలు అని అంటున్నారు. ఇంతకు ఏమైంది.. ఈ ముచ్చట ఏందని.. మనం ఆరా తీస్తే అసలు విషయం వెలుగులోకి వచ్చింది. రామ్ పోతినేని జెనీలియా జంటగా కలిసి నటించిన చిత్రం రెడీ. ఈ సినిమా హీరో రామ్ జీవితంలో బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ గా నిలిచింది. ఇక ఈ చిత్రంలో వీళ్లిద్దరి రొమాన్స్ సూపర్ అని చెప్పాలి. ఇక ఆ టైం నుంచే ఈ చిత్రం తర్వాత వీళ్ళిద్దరూ చాలా మంచి ఫ్రెండ్స్ అయ్యారు.

See also  Prabhas : ప్రభాస్ పుట్టినరోజుకి ఆ ముగ్గురు హీరోయిన్స్ తో కలసి.. అసలు విషయం బయటపడింది..

ram-pothineni-is-unmarried-cause-of-the-star-heros-wife

జెనీలియాకు రితీష్ దేశ్ ముక్ తో పెళ్లి అయిన సంగతి తెలిసి కూడా ఆమెతో ఫ్రెండ్షిప్ చేస్తూ ఆమెను వదలడం లేదట.. దీంతో కొందరు పనికిమాలిన బడుద్దాయిలు రామ్ పోతినేనికి జెనీలియాకు మధ్య అక్రమ సంబంధం అంటగట్టి ఆ కారణం చేత రామ్ ఇంకా ఆమెను మర్చిపోలేక వేరే పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడట్లేదు అంటూ ట్రొలింగ్ రాయుళ్లు వైరల్ చేస్తున్నారు. దాంతో రామ్ ఫ్యాన్స్ తీవ్రంగా హర్ట్ అవుతూ ఆందోళన చెందుతున్నారు. దయచేసి మీరు ఇలాంటి తప్పుడు వార్తలను ప్రచారం చేయొద్దు అని అభిమానులు వాళ్లకు చెబుతూ రామ్, జెనీలియా చాలా మంచి స్నేహితులని చెప్తున్నారు.