Home Cinema RGV: తండ్రి చనిపోతే కూడా చూడటానికి వేళ్ళని వర్మ.. అందుకేనా..

RGV: తండ్రి చనిపోతే కూడా చూడటానికి వేళ్ళని వర్మ.. అందుకేనా..

RGV: ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ గర్వించదగ్గ దర్శకులలో ఒకరు రామ్ గోపాల్ వర్మ. అక్కినేని నాగార్జున హీరో గా నటించిన ‘శివ’ చిత్రం ద్వారా దర్శకుడిగా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన రామ్ గోపాల్ వర్మ, ఆ సినిమా ఇండస్ట్రీ హిట్ అవ్వడం తో ఆయనకీ క్రేజ్ మామూలు రేంజ్ లో లేదు. ఎందుకంటే ఆ సినిమాని ఆయన న్యారేషన్ చేసిన విధానం, పెట్టిన షాట్ యాంగిల్స్ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ దర్శకులకు ఒక టెక్స్ట్ బుక్ లాగ పని చేస్తుంది. ఆ సినిమా నుండే అప్ కమింగ్ డైరెక్టర్స్ ఎన్నో విషయాలను నేర్చుకోవచ్చు. ఈ సినిమా తర్వాత రామ్ గోపాల్ వర్మ వరుసగా ఎన్నో సూపర్ హిట్ సినిమాలకు దర్శకత్వం వహించాడు.

See also  Pawan Kalyan : పవన్ కళ్యాణ్ ని ఆరోపిస్తూ పచ్చి నిజాలను బయటపెట్టిన దర్శకుడు!

ram-gopal-varma

ఎంతో మంది స్టార్ హీరోస్ తో పని చేసాడు, టాలీవుడ్ నుండి బాలీవుడ్ కి వెళ్లి అక్కడ కూడా తన సత్తా చాటాడు. అప్పట్లో ఈ రేంజ్ ప్రభంజనం సృష్టించిన రామ్ గోపాల్ వర్మ(RGV), ఇప్పుడు ఎలా మారిపోయాడో మన కళ్లారా చూస్తున్నాము. ఎల్లప్పుడూ కాంట్రవర్సీ తో సావాసం చేస్తూ, కాంట్రవర్సీ మీదనే సినిమాలు తీస్తూ కాలం గడిపేస్తున్నాడు. ఒకానొక దశలో ఆయన బూతు సినిమాలు కూడా తీసిన సందర్భాలు చాలానే ఉన్నాయి. ఎలాంటి డైరెక్టర్ ఎలా అయిపోయాడు అని ఆయన అభిమానులు బాధపడుతూ ఉంటారు.

See also  Samantha : సమంత పబ్లిక్ గా నాగ చైతన్యకి అలాంటి లెటర్ రాసింది..

rgv

ఇక రీసెంట్ గా ఆయన చావు పుట్టుకలు గురించి చేసిన కొన్ని కామెంట్స్ చూస్తే ఇతని ఆలోచనలు ఇంత దారుణంగా ఉన్నాయి ఏంటి అని అనుకుంటారు. ఒకరోజు ఆయన స్నేహితుడు తన తల్లి చనిపోయిందని రామ్ గోపాల్ వర్మ కి మెసేజి చేసాడట. ఆ మెసేజి ని చూసి కూడా రామ్ గోపాల్ వర్మ సమాధానం చెప్పలేదట. ఆ తర్వాత పది రోజులకు రామ్ గోపాల్ వర్మ కి ఆ స్నేహితుడు ఫోన్ చేసి, తల్లి చనిపోయిందంటే కనీసం రెస్పాన్స్ కూడా ఇవ్వలేదు, ఏమి మనిషివి రా నువ్వు అని అన్నాడట. దానికి రామ్ గోపాల్ వర్మ సమాధానం ఇస్తూ ‘నాకు చావు అంటేనే ఇష్టం లేదు, అందుకే ఎవరు చనిపోయిన నేను వెళ్ళను’ అని చెప్పుకొచ్చాడట.

See also  Naga Chaitanya birthday : నాగచైతన్య పుట్టిన రోజు సందర్భంగా సమంత ఎం చేసిందంటే..

rgv-with-daughter

రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో కూడా ఇదే చెప్పుకొచ్చాడు, నేను నా తండ్రి చనిపోయినపుడు కూడా ఆయనని చివరి చూపు చూడలేదు, ఎందుకంటే అక్కడికి వెళ్లిన తర్వాత అందరూ ఏడుస్తూ ఉండడం రామ్ గోపాల్ వర్మ కి ఇష్టం లేదట. తండ్రి చనిపోయిన తర్వాత తన ఇంట్లో ఆయన ఫోటోలను కూడా తీసేశాడట. ఎందుకంటే ఆ ఫోటోలను చూస్తే నాన్న ఇక బ్రతికిలేడు అనే విషయం గుర్తు వస్తుంది, అది నాకు ఇష్టం లేదు అని అన్నాడు.