Ram Charan – Upasana : మెగా కుటుంబంలో మెగా హీరోల గురించి మాత్రమే కాకుండా.. వాళ్ళ కుటుంబాల గురించి.. అందులో ఉన్న ఒక్కొక్క హీరో జంట గురించి ఎన్నో వార్తలు ఎప్పుడు సోషల్ మీడియాలో చూస్తూనే ఉంటాం. ఎందుకంటే మెగా కుటుంబం నుంచి హీరోలు ఎక్కువగా ఉండటం వలన.. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎక్కువ మంది సినీ అభిమానులు ఆ కుటుంబం పై మనసు పెట్టుకునే ఉంటారు. అలాగే ఇటీవల ( Ram Charan told about Upasana ) మెగా కుటుంబంలో వరుసగా మంచి మంచి శుభ ఘడియలు చూస్తూనే వచ్చాం. వరుణ్ తేజ్, లావణ్య ఎంగేజ్మెంట్.. ఆ తర్వాత రామ్ చరణ్, ఉపాసనకి కూతురు పుట్టడం జరిగింది.రామ్ చరణ్ ఉపాసన పెళ్లి తర్వాత ఇన్నేళ్లకు వాళ్లకు ఒక సంతానం కలగడం ఆ ఇంట్లో పండగ వాతావరణం వెలసింది.
రామ్ చరణ్ తన కెరీర్లో ఎంత బాగా సక్సెస్ అయ్యాడో అలాగే ఉపాసన కూడా తన కెరీర్లో అంతే బాగా సక్సెస్ అయింది. ఉపాసన బిజినెస్ ఉమెన్ గా, వైద్య రంగంలో మంచి పొజిషన్లో, అలాగే అన్నిటికంటే ముఖ్యంగా ఉపాసనలో ఉన్న గొప్ప క్వాలిటీ. మంచితనం ( Ram Charan told about Upasana ) ఆమెకు చాలా మంచి పేరు ఉంది. ఆమె మనస్తత్వం వలన ఆమెకు చాలా మంచి గౌరవం కూడా ఉంది. ఎన్నో మంచి మంచి పనులను చేసి తన పాప్యులారిటీ ని రియల్ గా చక్కగా పెంచుకుంది. అయితే ఉపాసన ఎంత సెంటిమెంటల్ గా ఉంటుందో మనందరికీ తన ప్రెగ్నెంట్ టైం నుంచి మొన్న డెలివరీ వరకు.. పాపకు పేరు పెట్టేవరకు కూడా అన్నీ చూస్తే అర్థమవుతుంది.
అయితే ఇటీవల రామ్ చరణ్ ఒక ఇంటర్వ్యూలో ఉపాసన గురించి ఒక ఆసక్తికరమైన విషయాన్ని బయట పెట్టాడు. దానితో రామ్ చరణ్ అభిమానులు అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఆడవాళ్లకు గిఫ్ట్ ఇచ్చే దాని గురించి రాంచరణ్ మాట్లాడుతూ.. ఆడవాళ్లకు నచ్చే గిఫ్ట్ ఇవ్వడం చాలా కష్టమని, ఎంత కష్టపడినా కూడా వాళ్ళని మెప్పించలేమని చెప్పుకుంటూ వచ్చాడు. అలాగే ( Ram Charan told about Upasana ) తను ఒకసారి ఉపాసనకు గిఫ్ట్ ఇవ్వాలని నాలుగైదు గంటల పాటు తిరిగి తిరిగి చివరికి ఒక ఖరీదైన గిఫ్ట్ కొనుక్కొని వచ్చి ఉపాసనకు ఇచ్చాడంట. అది చూసిన ఉపాసన నిమిషాల్లో నచ్చలేదు నో అన్నదంట. అంతేకాకుండా దానికి రామ్ చరణ్ కి ఉపాసన ఒక చంప దెబ్బ కూడా ఇచ్చిందంట. అందుకే భార్యను మెప్పించే గిఫ్ట్ ఇవ్వడం భర్తకి పెద్ద టాస్క్ అని అన్నాడు.
దీంతో రామ్ చరణ్ అభిమానులు అందరూ చంప దెబ్బ తినేంత దారుణమైన గిఫ్ట్ ఏమిచ్చావు భయ్యా అంటూ సరదాగా కామెంట్స్ చేస్తున్నారు. ఏమో మరి ఉపాసనకు అంత ఇరిటేషన్ తెప్పించే గిఫ్ట్ ఏది ఇచ్చాడో రాంచరణ్ చెప్పలేదు కానీ.. ఉపాసనకు మాత్రం ఆ గిఫ్ట్ చూసి ఇరిటేషన్ వచ్చిందన్న విషయం మాత్రం చెప్పుకొచ్చాడు. ఎంత చక్కటి మంచి అండర్స్టాండింగ్.. ఒకరి మీద ఒకరికి అంత చనువు, ఇష్టం ఉన్న ఈ జంటకి.. ఇటీవల పుట్టిన పాప కి క్లిం కార అని పేరు పెట్టిన విషయం మనందరికీ తెలిసిందే. రామ్ చరణ్, ఉపాసన ఎంత బిజీగా ఉన్న సెలబ్రిటీస్ అయినా కూడా.. వాళ్ళ ఫ్యామిలీ లైఫ్ కి చాలా ప్రాముఖ్యత ఇచ్చే మనుషులని.. బాగా అర్థమవుతూనే ఉంది. ఎంతో సెంటిమెంట్ తో.. వాళ్ళ జీవన విధానాన్ని నడిపించుకుంటున్న ఈ బంగారం లాంటి జంట.. ఎప్పుడు ఇలాగే ఆనందంగా, చూడముచ్చటగా, పిల్లాపాపలతో ఉండాలని అందరం కోరుకుందాం..