Home Cinema Ram Charan : రామ్ చరణ్ తన మొదటి సంపాదనతో ఎవరి కోసం ఎం కొన్నాడంటే..

Ram Charan : రామ్ చరణ్ తన మొదటి సంపాదనతో ఎవరి కోసం ఎం కొన్నాడంటే..

ram-charan-bought-a-watch-for-him-with-his-first-remuneration

Ram Charan : ఆడవాళ్ళకైనా, మగవాళ్ళకైనా మొదటిసారిగా సంపాదించిన సంపాదన జీవితంలో చాలా విలువైంది. ఆ తర్వాత ఎంతైనా సంపాదించవచ్చు. మొదటిసారి ఎంత తక్కువైనా సంపాదించవచ్చు కానీ.. దాని విలువను వివిధ వాటితో పోల్చలేము. మొదటిసారి మనంతట మనం కష్టపడి సంపాదించుకున్న డబ్బులు ( Ram Charan first remuneration ) చేతిలోకి రాగానే ఆ కలిగే ఆనందం, మన మీద మనకు వచ్చే కాన్ఫిడెన్స్ నిజంగా ఎంతో సంతృప్తినిస్తుంది. అలాగే మనల్ని కని పెంచిన తల్లిదండ్రులకు, మన శ్రేయోభిలాషులకు, మనం మొదటిగా అందుకున్న సంపాదనతో వాళ్లకేవైనా కొన్నా, వాళ్లకు చెప్పిన వాళ్లకు ఆ విషయం తెలిసిన ఆనందంతో పొంగిపోతారు. ఇది సామాన్యుల జీవితంలో మాత్రమే కాదు సెలబ్రిటీస్ జీవితంలో అయినా అంతే. మెగాస్టార్ చిరంజీవి కొడుకు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా తన మొదటి సంపాదన చూసి ఇలాగే మురిసిపోయాడంట.

ram-charan-bought-a-watch-for-him-with-his-first-remuneration

మెగాస్టార్ చిరంజీవి ఏకైక తనయుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సినిమా ఇండస్ట్రీలో తన తండ్రి పేరుతో పరిచయం చేయగా.. ఇండస్ట్రీలో అడుగుపెట్టిన సంగతి మనందరికీ తెలిసిందే. చిరంజీవి కొడుకు అయినప్పటికీ.. రామ్ చరణ్ ( Ram Charan first remuneration ) ఎప్పుడు తన శ్రమలో, పట్టుదలతో నిర్లక్ష్యం అనేది చూపించలేదు. అవకాశం దొరకడమే అదృష్టం అన్నట్టుగా ప్రతి సినిమాలో తనదైన శైలిలో తాను కష్టపడుతూనే వచ్చాడు. అలా కాబట్టే ఈరోజు 100 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకునే స్థాయికి ఎదిగాడు రామ్ చరణ్. గ్లోబల్ స్థాయి హీరో అయ్యాడు.. అయితే రామ్ చరణ్ మొదటి సినిమా నటిస్తే కొంత రెమెంటేషన్ అయితే వస్తుంది కదా.. ఆ రెమెంటేషన్ తో ఏం చేశాడు అనేది ఎప్పటినుంచో ఆయన అభిమానులకు ఉండే చిన్న అనుమానం.

See also  Samantha: అమ్మ సమంత చైతు-సిద్దులకంటే ముందే ఆ స్టార్ హీరోతో ఏకంగా బెడ్ రూమ్ లో..

ram-charan-bought-a-watch-for-him-with-his-first-remuneration

దానిని అనుమానం కూడా అనాల్సిన అవసరం లేదు. వాళ్ళ హీరో గురించి తెలుసుకోవాలనిపించే ఒక చిన్న కుతూహలం. తన అభిమానుల మనసు ఎలా ఉంటుందో? వాళ్ళు ఏం తెలుసుకోవాలి అనుకుంటారో? తెలుసు అనుకుంటా రామ్ చరణ్ కి. అందుకే ఇటీవల ఒక ఇంటర్వ్యూలో తన మొదటి సంపాదన గురించి.. దాన్ని ఏం చేశానో అన్న విషయం గురించి క్లారిటీగా చెప్పుకొచ్చాడు రామ్ చరణ్. తన మొదటి సంపాదనతో ఏం చేశారు ( Ram Charan first remuneration ) అని ఇంటర్వ్యూలో అడగ్గా.. తన మొదటి సంపాదనతో వాచ్ కొనుక్కున్నాను అని చెప్పాడు. కాగా ఇదే విషయం ఇప్పుడు నెట్టింట్లో వైరల్ గా మారింది. అంతేకాకుండా తనకి హ్యాండ్ వాచెస్ అంటే చాలా ఇష్టమని, ఎక్కడి వెళ్లినా కూడా అదే కొనుక్కుంటాను అని చెప్పాడు. మొదటి సంపాదననే కాదు, ఎప్పుడు నాకు ఎవరు డబ్బులు ఇచ్చినా, నా దగ్గర డబ్బులు ఉంటే హ్యాండ్ వాచ్ ఎంత కాస్ట్లీ అయినా కోరుకునే పిచ్చి నాకు ఉందని చెప్పాడు.

See also  Malli Pelli : సెన్సేషనల్ రికార్డ్ క్రియేట్ చేసిన మళ్లీ పెళ్లి..

ram-charan-bought-a-watch-for-him-with-his-first-remuneration

అయితే తన ఫేవరెట్ వాచ్ ఏదని ప్రశ్నించగా.. ప్రస్తుతం పటేక్ అంటే ఇష్టమని చెప్పాడు. అయితే కరోనా టైం లో ఒక వాచ్ కొనుక్కున్నానని.. ఆ వాచి తనకు చాలా నచ్చిందని చెప్పాడు. ఆ పార్సల్ ఇంటికి వచ్చినప్పుడు నాకు చాలా సంతోషం వేసింది అని అన్నాడు. బెల్ట్ మిలిటరీ కలర్ లో ఉన్న ఆ వాచ్ తనకు ఎంతో ఇష్టమని గుర్తు చేసుకున్నాడు. అయితే ఇది చూసిన నెటిజనులు మొదటి సంపాదనతో నీకు నువ్వే వాచ్ కొనుక్కున్నవా? అయితే చిరంజీవికి గాని, సురేఖ గారికి గాని ఏమీ కొనలేదా? అని కొందరు అంటుంటే.. మరికొందరు రామ్ చరణ్ చాలా సింపుల్ గా ఉండే మనిషి.. వాళ్లకు చిన్న చిన్న వస్తువులు కాదు.. వాళ్ళకి ఎక్కువ ఆనందాన్ని కలిగి ఎన్నో వాటిని ఇచ్చి ఉంటాడు.. కేవలం తన మొదటి సంపాదనలో సింపుల్ గా ఒక వాచ్ కొనుక్కునే మెంటాలిటీ ఉన్న మనిషి మా హీరో అంటూ ఆయన అభిమానులు వాపోతున్నారు.