Rakul Singh: ఎస్ ప్రెసెంట్ సోషల్ మీడియా అంతట హాట్ టాపిక్ గా చాలా వైరల్ అవుతున్న విషయం ఏంటంటే అది రకుల్ ప్రీత్ సింగ్ పెళ్లి గురించి జరుగుతున్న ప్రచారమే.. ఇక ఈ అమ్మడు ఇటు బాలీవుడ్ అటు టాలీవుడ్ అని తేడా లేకుండా సినిమాలు చేస్తూ అన్ని రకాల ఇండస్ట్రీ ప్రేక్షకులకి పరిచయమైంది. అయితే మన టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది మాత్రం కెరటం అనే చిత్రం ద్వారా కానీ ఈ చిత్రం ఆశించిన స్థాయిలో ఫలితం ఇవ్వలేదు. దాంతో చేసేదేమీ లేక ఈ అమ్మడు బాలీవుడ్ ఇండస్ట్రీకి పట్టాలెక్కేసింది. ఇక అక్కడ కూడా ఆశించిన స్థాయిలో అవకాశాలు లభించకపోవడంతో మళ్లీ తెలుగు ట్రాక్ ఎక్కేసింది అలా వెంకటాద్రి ఎక్స్ప్రెస్ చిత్రంలో నటించి సూపర్ హిట్ కొట్టింది.
ఆ తర్వాత తెలుగులో మరెన్నో సినిమాల్లో రాణిస్తూ మంచి మంచి హిట్ సినిమాలు చేస్తూ ముందుకు సాగింది. ప్రస్తుతం ఆమెకు టాలీవుడ్ లో కూడా అవకాశాలు లేకపోవడంతో మళ్లీ బాలీవుడ్ పట్టాలెక్కేసింది. కాగా ఇప్పుడు బాలీవుడ్ లో ప్రస్తుతం కొన్ని సినిమాల్లో నటిస్తున్నప్పటికీ ఆమెకు అంతగా గుర్తింపు అయితే లభించడం లేదు. కానీ ఆమె లైఫ్ లోని కొన్ని పర్సనల్ విషయాలు కారణంగా నిరంతరం బాలీవుడ్ లో వైరల్ గా మారుతూనే వస్తుంది. ఎందుకంటే ఈ అమ్మడు బాలీవుడ్ నిర్మాత, నటుడైన జాకీ భాగ్నాని తో చాలా కాలంగా రిలేషన్షిప్ మైంటైన్ చేస్తోంది.
ఇక వీళ్లిద్దరూ ప్రేమలో ఉన్నారని త్వరలోనే పెళ్లి చేసుకుంటారని ఇప్పటికే కుప్పలు తెప్పలుగా ఎన్నో రకాల వార్తలయితే వ్యాపించాయి. అయితే తాజాగా వీరి పెళ్లి వార్తల పై స్వయంగా రకుల్ ప్రీత్ సింగ్ స్పందించి కొన్ని సంచలనమైన వ్యాఖ్యలు చేసింది. అందులో భాగంగా ఆమె మాట్లాడుతూ.. మేము మా ప్రేమ విషయాన్ని దాచడానికి ఇంకా మేము చిన్నపిల్లలం అనుకుంటున్నారా? ఈ విషయాన్ని బహిర్గతం చేయడానికి మాకు ఎలాంటి భయం లేదు.. దీనిని నిర్భయంగా మేమే బయటపెట్టాం. మా ప్రేమ విషయాన్ని ఒప్పుకున్నా చాలా మంది నోటికొచ్చినట్లు రాతలు రాస్తున్నారు. మేము సీక్రెట్ గా పెళ్లి చేసుకున్నామని వార్తలని వైరల్ చేస్తున్నారు.
పోయిన సంవత్సరం కూడా ఆగస్టులో ఇలాగే ఏది పడితే అది రాసి సీక్రెట్ గా మా పెళ్లి చేసుకున్నామని వార్తలు వైరల్ చేశారు. అది కాకుండా ఈ ఏడాది ఫిబ్రవరిలో మళ్లీ సీక్రెట్ గా పెళ్లి చేసుకున్నామని వార్తలను వైరల్ చేశారు. ఇలా ఇప్పటికే సోషల్ మీడియా వేదికగా మా ఇద్దరికీ ఇప్పటికే రెండు సార్లు సీక్రెట్ గా పెళ్లి చేసేసారు. ఇలాంటి వార్తలు చూసినప్పుడల్లా నాకు తెగ నవ్వొచ్చేస్తుంది అంటూ రకుల్ ప్రీత్ సింగ్ తన పెళ్లి వ్యాఖ్యలపై ఘాటుగానే స్పందించింది. కాగా రకుల్ ప్రీత్ సింగ్ (Rakul Singh) ప్రస్తుతం విశ్వ నటుడు కమలహాసన్ హీరోగా నటిస్తున్న భారతీయుడు 2 చిత్రంలో హీరోయిన్ గా నటిస్తుంది. ఆ తర్వాత పెళ్ళి గురించి ఆలోచిస్తుందేమో చూడాలి.