Home Cinema Rakul Preet : కొత్త కార్ కొన్న రకుల్.. ఆ హీరోనే గిఫ్ట్ ఇచ్చాడా..

Rakul Preet : కొత్త కార్ కొన్న రకుల్.. ఆ హీరోనే గిఫ్ట్ ఇచ్చాడా..

Rakul Preet : సౌత్ ఇండియా లో బిగ్గెస్ట్ ఫ్యాన్ బేస్ ఉన్న హీరోయిన్స్ లో ఒకరు రకుల్ ప్రీత్ సింగ్. ‘కెరటం’ అనే చిత్రం ద్వారా వెండితెర అరంగేట్రం చేసిన ఆమె , ఆ తర్వాత ‘వెంకటాద్రి ఎక్స్ ప్రెస్’ సినిమాతో సూపర్ హిట్ ని అందుకుంది(Rakul Preet Buys Car). ఏ ముహూర్తం లో ఆమె ఈ సినిమా చేసిందో తెలియదు కానీ, ఈ చిత్రం తర్వాత ఆమె రేంజ్ పూర్తిగా మారిపోయింది. వరుసగా స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలు రావడం, పెద్దగా సక్సెస్ రేట్ లేకపోయినా కూడా స్టార్ హీరోయిన్ అవ్వడం ఈమె విషయం లోనే జరిగింది. అందంతో పాటుగా మంచి యాక్టింగ్ టాలెంట్ ఉండడం వల్లే ఆమె తక్కువ టైం లో స్టార్ గా ఎదిగింది అని అనుకోవచ్చు.

See also  Singer Sunitha : మనసులో మాటని నిర్భయంగా చెప్పేసిన సునీత..

actress-rakul

కేవలం తెలుగులో మాత్రమే కాదు, ఈమెకి తమిళం లో కూడా మంచి ఇమేజి ఉంది, ఆ తర్వాత బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి అక్కడ కూడా ఫేమస్ అయ్యింది. అలా అన్నీ భాషల్లో నటించి పాన్ ఇండియన్ స్టార్ గా పేరు తెచ్చుకున్న రకుల్ ప్రీత్ సింగ్ కి పాపం గత కొంత కాలం నుండి సరైన హిట్ లేదు. చేసిన ప్రతీ సినిమా అట్టర్ ఫ్లాప్ అయిపోతుంది. అందం కూడా ఇంతకుముందు రేంజ్ లో లేదనే చెప్పాలి. ఇదంతా పక్కన పెడితే రకుల్ ప్రీత్ సింగ్ కి జాకీ భగ్నానీ అనే లవర్ ఉన్నాడు అనే సంగతి మన అందరికీ తెలిసిందే. ఇతనితో కలిసి తిరిగిన ఫోటోలను రకుల్ ప్రీత్ సింగ్ గతం లో చాలానే షేర్ చేసింది.

See also  Tamannaah : ఆ విషయంలో లబోదిబోమంటూ.. అందరినీ ఆశ్చర్యపరిచిన తమన్నా!

rakul-preet-singh

అయితే ఇప్పుడు ఆయనకీ తెలియకుండా ఈమె రహస్యం గా ఒక ప్రముఖ కోలీవుడ్ హీరో తో ప్రేమాయణం నడుపుతున్నట్టుగా రీసెంట్ వినిపిస్తున్న వార్త. అతనితో ఈమె ప్రస్తుతం డేటింగ్ కూడా చేస్తుందట. రీసెంట్ గానే రకుల్ ప్రీత్ సింగ్ ఒక బెంజ్ కార్ లేటెస్ట్ మోడల్ ని కొన్నట్టుగా సోషల్ మీడియా లో ఒక పోస్ట్ పెట్టింది(Rakul Preet Buys Car). కానీ వాస్తవానికి ఈ కార్ ఆమె కొన్నది కాదు, ఆమె ప్రస్తుతం రిలేషన్ లో ఉంటున్న స్టార్ హీరో తీసిచ్చిన కార్ అట. ఈ కార్ విలువ మూడు కోట్ల రూపాయలకు పైగానే ఉంటుందట. ఇదే ఇప్పుడు కోలీవుడ్ లో సెన్సేషనల్ గా మారిన హాట్ టాపిక్. అయితే ఆ కార్ గిఫ్ట్ గా ఇచ్చింది ఎవరు ఏమిటి అనేది మాత్రం బయటకి రాలేదు.

See also  NTR - Pawan Kalyan: ఆ రోజు ఎన్టీఆర్ ఆ హామీ ఇవ్వకుంటే పవన్ కళ్యాణ్ సినిమా విడుదలయ్యేదా.?

actress-rakul-preet-singh

రకుల్ ప్రీత్ సింగ్ ఎపుడు ఫిట్ గా ఉండాలని కోరుకుంటుంది. తనకు మన ఇండస్ట్రీ లో ఫిట్నెస్ ఫ్రీక్ అని మరో పేరు కూడా ఉందని మీకు తెలుసా. సినిమా అవకాశాలు లేకపోయినా రకుల్ అంత రాయల్ జీవితాన్ని ఎలా గడుపుతుంది అని చాలా మంది అనుకుంటూ ఉంటారు. దానికి కారణం ఆమెకు ఉన్న బిజినెస్లు. రకుల్ ప్రీత్ కి హైదరాబాద్ లో పలు చోట్ల జిం సెంటర్ లు ఉన్నాయి. వాటిపైన అమ్ముడు బాగానే సంపాదించుకుంటుంది. అవి ఉన్నాయి కాబట్టే తను సినిమాలు లేకపోయినా లగ్జరీ జీవితాన్ని గడపగలుగుతుంది.