Rakesh Master : సినిమా రంగం అంటే కేవలం నటీనటులు మాత్రమే కాకుండా టెక్నీషియన్స్, ఇంకా ఇతరులు ఎంతోమంది ఉంటారు. అంతమంది సమూహం కలిపితేనే ఒక సినిమా సక్సెస్ కి దారితీస్తుంది. అలాగే అందులో ఎవరైనా కాలం చెల్లితే మిగిలిన వాళ్ళందరికీ కూడా గుండెల్లో బాధగానే ఉంటుంది. అలాగే సినీ ( Rakesh Master friend comments ) అభిమానులకు కూడా ఆ ట్యాలెంట్ ఉన్న వ్యక్తి వెళ్లిపోయాడు అంటే ఎంతో నిరాశగా కొన్ని రోజులు అనిపిస్తుంది. కొరియోగ్రాఫర్ రాకేష్ మాస్టర్ అనారోగ్య కారణంగా.. ఇటీవల మరణించిన సంగతి మనందరికీ తెలిసిందే. ఈ వార్త తెలిసిన దగ్గర నుంచి టాలీవుడ్లో అందరూ ఎంతో బాధగా ఉన్నారు. సడన్గా అతనికి ఇలా జరగడం అందరికీ షాకింగ్ గానే ఉంది.మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్ వలన రాకేష్ మాస్టర్ చనిపోయారని గాంధీ హాస్పిటల్ లో డాక్టర్స్ చెప్పడం జరిగింది.
అలాగే ఆయన అంత్యక్రియలకు ఎంతోమంది సినీ ప్రముఖులు, సినీ కొరియోగ్రాఫర్లు వచ్చి ఎంతో బాధగా పాల్గొని.. ఆయన చివరి చూపులు చూసుకొని వెళ్లారు. వందలాది అభిమానుల నడుమ బోరబండలోని స్మశాన వాటికలో ఆయన కుమారుడు చరణ్ అంత్యక్రియలు చేయడం జరిగింది. రాకేష్ మాస్టర్ మరణం అనారోగ్య కారణంగా ( Rakesh Master friend comments ) జరిగిందని వైద్యులు చెబుతున్నప్పటికీ.. ఆయన సన్నిహితులు మాత్రం అది అనారోగ్యం వల్ల జరిగిన మరణం కాదని.. ఆయన మరణం పై అనేక అనుమానాలు ఉన్నాయని వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. రాకేష్ మాస్టర్ మరణం యాదృచ్ఛికంగా జరిగింది కాదని.. పక్కా ప్లాన్ గా ఆయన్ని చంపారని కొన్ని వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. దానిపై పోలీసు విచారణ చేసి ఆయన చావుకి న్యాయం చేయాలని అంటున్నారు.
తాజాగా రాకేష్ మాస్టర్ ఫ్రెండ్ రాఖీ భాయ్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. రాకేష్ మాస్టర్ మృతి విషయంలో ఆయన అనేక అనుమానాలను వ్యక్తం చేశారు. రాకేష్ మాస్టర్ చనిపోయారని తెలియగానే గాంధీ హాస్పిటల్ కి నేను వెళ్ళాను అంటూ రాఖీ బాయ్ చెప్పుకొచ్చారు. ముందు రోజు వరకు మాతో మాట్లాడిన మనిషి సడన్గా ( Rakesh Master friend comments ) చనిపోవడం ఏంటి అనేది అర్థం కాలేదని అన్నారు. ఆ రోజు రాకేష్ మాస్టర్ పెదవి పై గాయాలు ఉన్నాయని.. తనకు డౌట్ వచ్చి రాకేష్ మాస్టర్ ని ఆసుపత్రికి తీసుకువచ్చిన ఆయనను అడిగానని చెప్పాడు. రాకేష్ మాస్టారు ఆంధ్రాలో ఉన్నప్పుడు ఆయన మీద ఎవరో ఎటాక్ చేశారని రాఖీ బాయ్ చెప్పారు. ఎవరో ఫ్యాన్స్ సునిసిత్ మీద దాడి చేయడానికి వచ్చారని.. ఆయన నివాసం దగ్గర నానాహంగామా చేశారని..
ఆ విషయాన్ని రాకేష్ మాస్టర్ అతనితో చెప్పారని కూడా చెప్పాడు. బహుశా పర్సనల్ కక్షలతో ఇదంతా చేసి ఉంటారని అంటున్నారు. అలాగే ఆదివారం ఉదయం ఆయన రూమ్ లో చలనం లేకుండా పడి ఉన్నాడని వెంటనే ఆసుపత్రికి తీసుకువెళ్లారని చెప్పాఋ. అయితే రూంలో రాకేష్ మాస్టారు వస్తువులు కొన్ని లేవని తర్వాత తెలిసిందని.. అలాగే ఆయన ఫోన్ కూడా కనిపించడం లేదని చెప్పాడు. ఇవన్నీ చూస్తుంటే ఆయన మృతిపై అనేక అనుమానాలు ఉన్నాయని.. ఆంధ్రలో చంపితే అనుమానం వస్తుంది కాబట్టి ఇక్కడికి వచ్చిన తర్వాత.. ఇక్కడే అక్కడి నుంచి వచ్చి ఇక్కడ ప్లాన్ గా ఎవరైనా చేసి ఉంటారని రాఖీ బాయ్ అనుమానంగా ఉందంటూ చెప్పాడు. వీటిపై పోలీసులు విచారణ చేసి రాకేష్ మాస్టర్ మరణానికి న్యాయం చేయాలని ఆయన అన్న మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.