Jailer : ఆగస్టు 10వ తేదీన సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నటించిన జైలర్ సినిమా ఎంతో గ్రాండ్ గా రిలీజ్ అయింది. గత కొంతకాలంగా రజనీకాంత్ కి సూపర్ హిట్స్ అనేవి తగలడం లేదు. దానితో అభిమానులు అందరూ ( Jailer first day collection ) జైలర్ సినిమాపై ఎన్నో ఆశలు పెట్టుకుని ఎదురుచూస్తున్నారు. అలాంటి క్రమంలో రిలీజ్ అయిన జైలర్ సినిమా అనుకున్న అంచనాలకు తగ్గట్టుగానే అందర్నీ సంతృప్తి పరిచింది. ఈ సినిమాలో రజనీకాంత్ నటన ఎక్కడకో తీసుకొని వెళ్ళింది. ఎన్నో ఏళ్ల క్రితం రజనీకాంత్ ని చూసిన ఆనందం మళ్ళీ కలిగింది. నిజంగా ఆయన ఆ పాత్రకి ఎంతో న్యాయం చేసాడని అర్థమవుతుంది.
మొదట్లో ఈ సినిమాపై ఎవరికి పెద్ద అంచనాలు లేవుగాని.. ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత కొంచెం అంచనాలు పెరిగాయి. ఆ తర్వాత సినిమా రిలీజ్ అయిన మొదటి రోజునే విపరీతమైన కలెక్షన్స్ వచ్చాయి. ఇక టాక్ కూడా మంచి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఇన్నాళ్లకు బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు రజినీకాంత్ అని ఆయన ( Jailer first day collection ) అభిమానులైతే పొంగిపోతున్నారు. ఇక తమిళనాడు, కర్ణాటక ఇలా కొన్ని రాష్ట్రాల్లో.. కొన్ని కంపెనీలు అయితే రజనీకాంత్ సినిమా రోజు వాళ్ళ కంపెనీలో వర్కర్స్ కి సెలవు ప్రకటించి.. తిరిగి టికెట్లు కూడా ఫ్రీగా ఇచ్చారు. రజనీకాంత్ అంటే ఎంతటి అభిమానం ఇక్కడే తెలుస్తుంది.
పైగా జైలర్ సినిమాలో ఎన్నో భాషల్లో స్టార్ హీరోస్ ఆ సినిమాలో చిన్న చిన్న పాత్రలు నటించారు. వాళ్ళందరూ రజనీకాంత్ మీద ఉన్న అభిమానంతోనే అందులో అంత ఇష్టంగా నటించారన్న విషయం స్పష్టంగా కనిపిస్తుంది. ఇక ఈ సినిమా ( Jailer first day collection ) ఫస్ట్ డే కలెక్షన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. అల్ ఓవర్ ఇండియాలో మొదటి రోజు 52 కోట్లు వసూలు చేసింది జైలర్ సినిమా. ఈ కలెక్షన్ చూస్తుంటే.. తమిళంలో ఈ ఏడాదికి అతిపెద్ద ఓపెనర్ టైటిల్ సినిమాగా పేరు దక్కించుకుంటుంది అని అంటున్నారు. తమిళనాడు మొత్తం 23 కోట్లు వసూలు చేయగా కర్ణాటకలో 11 కోట్లు వసూలు చేసింది.
ఇక ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో కలిపి 10 కోట్లు వసూలు చేసింది. కేరళ నుంచి 5 కోట్లు కలెక్షన్స్ వచ్చాయి. ఇక ఓవర్సీస్ మార్కెట్లో కూడా ఈ సినిమా బానే కలెక్షన్స్ రాబట్టింది. యూఎస్ఏ లో 1. 45 మిలియన్ డాలర్ల పైగా కలెక్షన్ తీసుకొని ( Jailer first day collection ) వచ్చింది. సినిమాకి ఎప్పుడైతే మంచి టాక్ వచ్చిందో.. మొదటి రోజు అంత కలెక్షన్ వచ్చిందంటే ఇంక రేపు, ఎల్లుండి హాలిడేస్ కాబట్టి ఇంకా భారీ కలెక్షన్స్ వచ్చే అవకాశం ఉందని అందరూ అంటున్నారు. ఏదేమైనా నెల్సన్ దిలీప్, రజనీకాంత్ ఇద్దరు కూడా మంచి సక్సెస్ ని సాధించారు. తెలుగు రాష్ట్రంలో కూడా మెగాస్టార్ చిరంజీవి సినిమా భోళాశంకర్ ని ఢీ కొని దీనికే మంచి టాక్ తెచ్చుకుంది..