Home Cinema Rajamouli: ఆస్కార్ కోసం ఎవ్వరికీ తెలియకుండా రాజమౌళి చేస్తున్న పని ఇదా?

Rajamouli: ఆస్కార్ కోసం ఎవ్వరికీ తెలియకుండా రాజమౌళి చేస్తున్న పని ఇదా?

Rajamouli spending more money for Askar Awards: రాజమౌళి అంటే ఇప్పుడు ఒక పెద్ద బ్రాండ్. రాజమౌళి సినిమాకి టైటిల్ తో పని లేదు. నెక్స్ట్ రాజమౌళి సినిమా అంటూ మాట్లాడుకుంటారు తప్ప ఆ సినిమా టైటిల్ కి ఇంపార్టెన్స్ ఇవ్వడం ఎప్పుడో మానేశారు. అందుకే ముల్టీ స్టార్స్ తో సినిమా తీసినా కూడా, ఆర్ఆర్ఆర్ అనే సింపుల్ టైటిల్ కూడా సినీ అభిమానులు సొంతం చేసుకున్నారు. రాజమౌళి సినిమా బడ్జెట్స్ (Rajamouli spending more money for Askar Awards) రోజు రోజుకి పెరుగుతూనే ఉన్నాయి. సినిమా బడ్జెట్ అంతగా పెరిగే కొద్దీ అంతగా లాభాలు కూడా వస్తాయి గాని, కాకపోతే సినిమా ఖచ్చితంగా హిట్ అయ్యి తీరాలి. లేకపోతే ఎంత పెద్ద బడ్జెట్ తో సినిమా చేస్తామో అంత నష్టం వచ్చే అవకాశం కూడా ఉంటాది. అయితే రాజమౌళి మాత్రం ఇప్పటి వరకు పక్కా ప్లాన్ గానే ఒక్కొక్క స్టెప్ వేసుకుంటూ ముందుకు వెళ్ళాడు. ఈరోజు తెలుగు సినిమా ఇండస్ట్రీని ఒక ఊపు ఊపుతున్నాడు.

See also  Trivikram: పూజా హెగ్డే ని మహేష్ మూవీ నుండి తొలగించడానికి కారణం త్రివిక్రమ్ కు ఆ హీరోయిన్ పై ఉన్న ప్రేమతోనేనా.?

rajamouli-spending-more-money-for-askar-awards

ఈ దర్శకుడి సినిమాలో పేరుకే హీరోలు ఉంటారు. కానీ ఆ సినిమాకి అసలు హీరో మాత్రం రాజమౌళినే. అందుకే అతని సినిమాకి ఎంత బడ్జెట్ అయినా నిర్మాతలు ధైర్యంగా ముందుకు పోతూ ఉంటారు. అయితే మనిషికి ఒక స్థాయి వచ్చేవరకు తన ఆలోచనలు ఒకలా ఉంటె.. తాను అనుకున్న స్థాయి కంటే కొంచెం ఎక్కువ వెళ్తే అక్కడ నుంచి ఆలోచనలు మారుతూ ఉంటాయి. రాజమౌళి సినిమాలకి జాతీయ స్థాయిలోనే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో కూడా మంచి గుర్తింపు వచ్చాయి. అలాగే ఇప్పుడు రీసెంట్ గా వచ్చిన ఆర్ఆర్ఆర్ (Rajamouli spending more money for Askar Awards )సినిమాకి ఆస్కార్ అవార్డు వస్తుందా లేదా అనేది పెద్ద ప్రశ్న అందరిలో. ఎవరికి ఎలాంటి నమ్మకం, అనుమానం ఉన్నా రాజమౌళి కి మాత్రం ఈ సినిమాకి కచ్ఛితంగా ఆస్కార్ వస్తాదని నమ్మకంతో ఉన్నాడంట.

See also  Chiranjeevi - Venkatesh: చిరంజీవి - వెంకటేష్ కలిసి నటించాలనుకున్న ఆ ఆగిపోయిన చిత్రమిదేనా.?

rajamouli-spending-more-money-for-askar-awards

ఇంకొక విచిత్రం ఏమిటంటే ఈ సినిమాకి సంబందించి అవార్డు వేడుకలలో ఎక్కడా కూడా నిర్మాత దానయ్య కనవబడటం లేదు. అంతర్జాతీయ లెవల్ లో అవార్డు కోసం ఈ సినిమా పోటీ పడుతుంటే నిర్మాత దానయ్య మాత్రం ఎక్కడా అలికిడి చేయడం లేదు. దీనితో అందరిలో ఏవేవో అనుమానాలు మొదలయ్యి, అనేక కామెంట్స్ చేస్తున్నారు. ఈ సినిమాకి ఆస్కార్ అవార్డు దక్కించుకోవడం కోసం ఇప్పటికే రాజమౌళి టీం చాలా డబ్బు ఖర్చుపెడతుందంట. ఇంతకుముందు రాజమౌళి సినిమా తీసేవరకే దాన్ని ఒక యజ్ఞం లా తీసి, సక్సెస్ ని ఎంజాయ్ చేసేవాడంతే. కానీ ఇప్పుడు ప్రెస్టేజ్ అనేది మొదలయినట్టు కనిపిస్తుంది. అందుకే ఆర్ఆర్ఆర్ సినిమాకి ఎలాగైనా ఆస్కార్ రావాలని డబ్బుని విపరీతంగా ఖర్చు పెడతున్నాడంట.

See also  Umair Sandus: తారక్ మరొక్కసారి ఆ అమ్మాయితో అలా చేస్తూ భార్యకు అడ్డంగా దొరికిపోయాడంటూ ట్వీట్..

rajamouli-spending-more-money-for-askar-awards

అంత ఖర్చుని భరించలేక దానయ్య చేతులు ఎత్తేశాడట. అందుకే ఎక్కడా సౌండ్ లేకుండా నిశ్శబ్దంగా ఉన్నాడంట. ఇంటర్నేషనల్ లెవల్ లో సినిమాని ఇప్పుడు ప్రమోట్ చెయ్యడం వలన వచ్చే లాభం ఏమి లేదని, రాజమౌళి గొప్ప కోసం అంత డబ్బు ఖర్చు చేయలేనని దానయ్య చేతులెత్తేసాడట. దానితో రాజమౌళి తానే సొంతంగా డబ్బులు ఖర్చు చేస్తూ సినిమాని ప్రమోట్ చేస్తున్నాడంట. ఇప్పటికే ఈ సినిమాకి ఆస్కార్ అవార్డు కోసం దగ్గర దగ్గర 80 కోట్లు ఖర్చు చేసారంట. ఈ అనుమానాల్లో ఎన్ని నిజాలు ఉన్నాయో తెలీదు కానీ, ఆర్ఆర్ఆర్ సి ఆస్కార్ అవార్డు వస్తే మాత్రం తెలుగు సినిమా ఇండస్ట్రీ మరోసారి గర్వంగా ప్రపంచం వైపు చూస్తాది.