Home Cinema Pawan Kalyan : దరిద్రానికే దరిచేరుతానంటున్న పవన్ కళ్యాణ్.. ఫైర్ అవుతున్న ఫ్యాన్స్ !

Pawan Kalyan : దరిద్రానికే దరిచేరుతానంటున్న పవన్ కళ్యాణ్.. ఫైర్ అవుతున్న ఫ్యాన్స్ !

Pawan Kalyan : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొంతకాలం సినిమాలకు గ్యాప్ ఇవ్వడం.. రాజకీయాల మీద ఎక్కువ ఫోకస్ పెట్టడం చేసిన సంగతి మనకు తెలిసినదే. కానీ, గత కొంతకాలంగా పవన్ కళ్యాణ్ సినిమాలపై బాగా శ్రద్ధ పెడుతున్నారు. ఇప్పుడు కూడా ఆయన వరుస సినిమాలు చేయడంలో బిజీగా ఉన్నారు. దీనితో ఆయన అభిమానులు చాలా ఆనందంగా ఉన్నారు. ఇటీవల పవన్ కళ్యాణ్ నటించిన ( Pawan Kalyan selects flop actress Priyanka Arul Mohan for his next film ) బీమ్లానాయక్, వకీల్ సాబ్ మంచి టాక్ తెచ్చుకున్నాయి. వకీల్ సాబ్ సినిమాకి అయితే.. అసలు అమితాబ్ నటన పవన్ కళ్యాణ్ చేయగలడా అని అందరిలో ఒక రకమైన అనుమానం ఉండేది. ఎందుకంటే అమితాబ్ నటనకి, పవన్ కళ్యాణ్ నటనకి అసలు పొంతన ఉండదు.

See also  Nithya Menen: ఆ కోలీవుడ్ స్టార్ హీరో నిత్యా మీనన్ పై కన్నేసి కోరిక తీర్చాలంటూ టార్చర్.

pawan-kalyan-selects-flop-actress-priyanka-arul-mohan-for-his-next-film

వాళ్లిద్దరూ ఒక్కొక్కరూ ఒక్కొక్క కోణంలో నటిస్తారు. అమితాబ్ డి సైలంట్ నటన అయితే..పవన్ కళ్యాణ్ డి వైలెంట్ నటన. అలాంటిది దర్శకుడు ఈ రెండిని ఎలా చూపిస్తాడు అని అనుకున్నారు. కానీ వకీల్ సాబ్ సినిమా చూసినంత సేపు అది అమితాబ్ నటించిన సినిమా అని గుర్తుకురాలేదు. పవన్ కళ్యాణ్ కి ( Pawan Kalyan selects flop actress Priyanka Arul Mohan for his next film ) తగ్గట్టు గా ఒకొక్క సీన్ రాసుకుని బాగానే తీశారు. ఇక బీమ్లానాయక్ సినిమా కూడా బాగానే ఉంది. కాకపోతే రెండు సినిమాలు కూడా ఇతర భాషలో వచ్చిన సినిమాలే.. పవన్ కళ్యాణ్ గత కొంత కాలంగా ఈ ఫార్ములాని ఎక్కువగా ఫాలో అవుతున్నట్టు కనిపిస్తుంది. ఎందుకు ఇతర భాషల్లో హిట్ కొట్టిన వాటినే రీమేక్ చేస్తున్నారు అనుకుంటే..

See also  Upasana: రామ్ చరణ్ ఉపాసనలు ఇన్నేళ్ళు పిల్లలు కనకుండా ఉండడానికి అసలు కారణం ఇదేనట..

pawan-kalyan-selects-flop-actress-priyanka-arul-mohan-for-his-next-film

హిట్ అవ్వడానికి కొంతవరకు గ్యారంటీ ఉంటాదనే ఆలోచన కనిపిస్తుంది. అయితే సినిమా హిట్ అవ్వాలంటే అదొక్కటే ఫార్ములా చాలదు, దానికి చాలా కలిసి రావాలి. ఏది ఏమైనా హిట్ ఫ్లాప్ తో అసలు పవన్ కళ్యాణ్ క్రేజ్ కి ఎటువంటి సంబంధం ఉండదు. నిర్మాతలు, సినిమా కొనుక్కునే వాళ్లకు మాత్రమే నష్టం. వాళ్ళ కోసమే పవన్ అలోచించి ఆచి తూచి అడుగువేసే మనిషి ఆయన. ఇదిలా ఉంటె పవన్ కళ్యాణ్ క్రిష్ దర్శకత్వంలో హరిహర వీరమల్లు, సముద్రఖని దర్శకత్వంలో తన మేనల్లుడు సాయితేజతో కలిసి వినోదయ సితం, హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఈ సినిమాల రిలీజ్ కోసం ఆయన అభిమానులు ఎంతో ఆత్రంగా ఎదురుచూస్తున్నారు.

See also  Balakrishna : బాలక్రిష్ణని.. సూపర్ స్టార్ ఆ విషయంలో తిట్టాడా పొగిడాగా మీరు చెప్పగలరా?

pawan-kalyan-selects-flop-actress-priyanka-arul-mohan-for-his-next-film

అయితే ఒక వార్త మాత్రం పవన్ అభిమానులను చాలా బాధ పెడుతుంది. అదేమిటంటే.. సాహో డైరెక్ట‌ర్ సుజీత్ ద‌ర్శ‌క‌త్వంలో మ‌రో సినిమా ఒప్పుకున్న సంగతి తెలిసిందే. ఈసినిమాలో హీరోయిన్ గా ప్రియాంకా ఆరుళ్ మోహన్ ను ఒప్పుకున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈమె ఇప్పటికి రెండు సినిమాలు చేసింది. నానితో గ్యాంగ్ లీడర్ మరియు శర్వానంద్ తో శ్రీకారం. ఈ రెండు సినిమాలు అట్టర్ ఫ్లాప్ అయ్యాయి. ఇలాంటి ఫ్లాప్ హీరోయిన్ ని పవన్ కళ్యాణ్ పక్కన ఎందుకు పెడుతున్నారు? ఆ దరిద్రం మా అన్నకి పట్టుకుని సినిమాలు ఫ్లాప్ అవుతాయంటూ ఫైర్ అవ్వడమే కాకుండా.. అసలు పవన్ కళ్యాణ్ ఎందుకు ఆమెను దరి చేరుస్తున్నాడంటూ అభిమానులు వాపోతున్నారు..