Home Cinema Star Kids : మన స్టార్ కిడ్స్ ఈ వయసులో ఎలాంటి ఫైట్ కి సిద్దమవుతున్నారో...

Star Kids : మన స్టార్ కిడ్స్ ఈ వయసులో ఎలాంటి ఫైట్ కి సిద్దమవుతున్నారో తెలుసా?

our-tollywood-stars-kids-preparing-to-rule-the-industry-in-future

Star Kids : సినిమా ఇండస్ట్రీలో రోజు రోజుకి పోటీ పెరిగిపోతుంది. భాషతో సంబంధం లేకుండా సినిమాలో సత్తా ఉంటే అన్ని భాషల సినిమాల్ని అభిమానులు చేరదీస్తున్నారు. మంచి కంటెంట్ సినిమా ముందుకు వస్తే.. మంచి హిట్ నే ( Our Tollywood stars kids ) అందిస్తున్నారు. ఇలాంటి క్రమంలో ఇప్పటి హీరోలు, దర్శకులు ఎప్పటికప్పుడు వాళ్ళ టాలెంట్ ని అప్డేట్ చేసుకుంటూ.. ఇంకా పోటీ పడుతూ.. సినిమాలను సక్సెస్ చేసుకోవడానికి ఆరాటపడుతున్నారు. ఏ రంగంలోనైనా పోటీ ఉంటుంది కానీ సినిమా రంగంలో, రాజకీయ రంగంలో అది నిరంతర పోటీగానే ఉంటుంది. ఎప్పటికప్పుడు వాళ్ళని అభిమానించే వాళ్ళ ఆదరణ తగ్గకుండా ఉండేందుకు అప్డేట్ అవుతూనే ఉండాలి.

our-tollywood-stars-kids-preparing-to-rule-the-industry-in-future

ఒకప్పుడు వారసత్వం అంటే ఒక్కసారిగా వాళ్ళ పిల్లలను వాళ్ళు సినిమాల్లో పరిచయం చేసి.. అక్కడ నుంచి ఆ హీరో మీద ఉన్న అభిమానంతో.. వాళ్ళ వారసులకు అభిమానాన్ని ఇచ్చి అందలం ఎక్కించేవారు. కానీ ఇప్పుడు వారసులు మాత్రమే కాకుండా.. కొత్త హీరోల్ని, కొత్త దర్శకుల్ని అందరినీ ఆదరిస్తున్న క్రమంలో.. ఇప్పుడు ఎవరికి ( Our Tollywood stars kids ) వారు వాళ్ళ ప్రతిభని పెంచుకోక తప్పడం లేదు. ఎప్పటికప్పుడు వాళ్ళు అప్డేట్ అవ్వాల్సిన అవసరం చాలా వచ్చింది. అందుకే మన టాలీవుడ్ స్టార్స్ కిడ్స్.. ఇప్పటినుంచే వాళ్ళ టాలెంట్ నిరూపించుకోవాలని చూస్తున్నారు. ఇప్పటినుంచే అభిమానుల మనసుల్లో వాళ్ల స్థానాన్ని నిలుపుకోవడానికి కష్టపడుతున్నారు. ఈ ఏజ్ లో ఇలాంటి ఫైటికి ముందుకు రావడం అంటే నిజంగా నెక్స్ట్ తరం ఎంతగా కష్టపడాలని డిసైడ్ అవుతున్నారో అర్థమవుతుంది.

See also  Akkineni: అక్కినేని వారి పరువు గంగలో కలవబోతుంది.. దానికి కారణం వీళ్ళ ముగ్గురిలో ఎవరో తెలుసా?

our-tollywood-stars-kids-preparing-to-rule-the-industry-in-future

అల్లు అర్జున్ కూతురు అల్లు అర్హ శాకుంతలం సినిమాలో మొదటిసారిగా నటించి.. విపరీతమైన ఆదరణ పొందింది. అలాగే ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ సినిమా దేవరాలో కూడా అల్లు అర్హకి నటించే అవకాశం దొరికిందని అంటున్నారు. కచ్చితంగా అల్లు అర్జున్ కూతురు పెద్దయిన తర్వాత హీరోయిన్ అవుతుందని అందరూ అనుకుంటున్నారు. అలాగే ( Our Tollywood stars kids ) మహేష్ బాబు కూతురు సితార ఇటీవల ప్రముఖ పీఎంజే బ్రాండ్ జ్యువెలరీకి అంబాసిడర్ గా నటించి.. న్యూయార్క్ టైం స్క్వేర్ లో ప్రదర్శించబడిన రికార్డు సృష్టించింది. అలాగే ఇప్పుడు మహేష్ బాబు నటిస్తున్న ఎస్ఎస్ఎంబి 29 సినిమాలో అవకాశం దక్కింది. అలాగే జూనియర్ ఎన్టీఆర్ పిల్లలు అభయ్ రామ్, భార్గవరామ్..

See also  Akkineni Family: అక్కినేని ఫ్యామిలీ లో మూడు పెళ్లిళ్లపై క్లారిటీ..

our-tollywood-stars-kids-preparing-to-rule-the-industry-in-future

జూనియర్ ఎన్టీఆర్ కిడ్స్ అభయ్ రామ్, భార్గవ్ రామ్ ఇద్దరు కూడా సినిమా రంగంలో వాళ్ల టాలెంట్ నిరూపించుకోవడానికి సిద్ధంగా కనిపిస్తున్నారు. అందులో అభయ్ రామ్.. రాజమౌళి, మహేష్ బాబు కలిసి చేస్తున్న సినిమాలో నటించబోతున్నాడు. ఈ సినిమాలో మహేష్ బాబు కూతురు సితార, జూనియర్ ఎన్టీఆర్ కొడుకు అభయ్ రామ్ అక్క తమ్ముళ్లగా నటించబోతున్నట్టు చెప్తున్నారు. ఇలా రాజమౌళి ఇలాంటి దర్శకుడు చేతిలో వీళ్ళు ఇప్పుడే చెక్కబడితే.. ఇంక పెద్దయాక ఇంకేమవుతారో.. ఇక బాలకృష్ణ కొడుకు మోక్షజ్ఞ, అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొడుకు అకిరా నందన్ ఇద్దరు కూడా హీరోలుగా సినిమాలో ఎంట్రీ అయ్యేందుకు అన్ని వైపులా సిద్ధంగా ఉన్నారు. అతి తొందరలోనే వీళ్లిద్దరు సినిమాలు మనం చూస్తామని అంటున్నారు. ఇలా మన స్టార్స్ కిడ్స్ ఇప్పటినుంచే ట్యాలెంట్ ని ప్రూవ్ చేసుకుంటూ.. కెరీర్ తో ఫైట్ చేయడానికి ముందుకు వస్తున్నారు.

See also  Rakul Preet : కొత్త కార్ కొన్న రకుల్.. ఆ హీరోనే గిఫ్ట్ ఇచ్చాడా..