NTR – Pawan Kalyan: ఎప్పుడైతే ఈ సోషల్ మీడియా వచ్చిందో ఒక హీరో అభిమానులు మరొక హీరో అభిమానులపై నిత్యం ఎన్నో రకాల యుద్ధాలు సోషల్ మీడియా వేదికగా నిత్యం వైరల్ అవుతూ ఉంటాయి. కానీ స్టార్ హీరోలు అభిమానులు ఇలా సోషల్ మీడియా వేదికగా ఫైటింగ్ లు జరుగుతాయి కానీ వాళ్ళని అభిమానించే హీరోలు మాత్రం నిజ జీవితం లో ఒకరికొకరు ఎంతో అన్యోన్యంగా.. సోదర భావంతో ఎంతో మంచి స్నేహ బంధంతో కలిసి మెలిసి ఉంటారు. అలాంటి హీరోలలో ఒకరు జూనియర్ ఎన్టీఆర్.. నందమూరి వారసునిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన జూనియర్ ఎన్టీఆర్ కి ప్రస్తుతం ఉన్న టాలీవుడ్ లో ప్రతి ఒక్క తన తోటి స్టార్ హీరోలు అందరితో మంచి స్నేహ మరియు సోదర భావం ఉంది.
అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ను అందరి హీరోలతో పోలిస్తే సాధారణంగా ఇతర హీరోలతో మాట్లాడటం చాలా అరుదు. కానీ జూనియర్ ఎన్టీఆర్ తో మాత్రం ఇప్పటికీ ఎన్నో సందర్భాల్లో కలిసినప్పుడు చాలా ఫ్రెండ్లీగా.. ఎంతో సరదాగా.. ఉత్సాహంతో మాట్లాడుతుంటాడు. దానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో ఇప్పటికీ వైరల్ అవుతూనే ఉంటున్నాయి. ఇక ఇండస్ట్రీలో ఒకానొక సమయంలో వీరిద్దరూ ఒకరికి ఒకరి కోసం ఒకరు నిలబడ్డ రోజులు ఉన్నాయట. అదేంటంటే.. ఎన్టీఆర్ దమ్ము సినిమా షూటింగ్ కోసం బుక్ చేసుకున్న లోకేషన్ కూడా ఎన్టీఆర్ కి అప్పట్లో పవన్ కళ్యాణ్ ఇచ్చేసిన సందర్భాలు ఉన్నాయట.. ఆర్టిస్టులకు డేట్స్ ఉండవని..
దయచేసి మీ షూటింగ్ బు రెండు, మూడు రోజుల పాటు వాయిదా వేసుకోవాలని పవన్ కళ్యాణ్ కోరగా అందుకు అందరూ ఒప్పుకున్నారట. ఇదే కాక పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన నా అత్తారింటికి దారేది చిత్రం ఆ రోజుల్లో విడుదలకు ముందుగానే మొత్తం చిత్రం హెచ్ డీ క్వాలిటీ ప్రింట్ తో బయటకి వచ్చిన సంగతి తెలిసిందే.. ఇక ఈ విషయం పట్ల ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోలు అందరూ ఈ సినిమా కోసం ఎంతగానో సపోర్టుగా నిలబడ్డారనేది అందరికీ తెలిసిందే.. కానీ జూనియర్ ఎన్టీఆర్ మాత్రం అందరికంటే ఎక్కువగా ఈ చిత్రం విషయం లో అండగా ఓ విషయంలో నిలబడ్డాడట.. ఆ విషయం ఏంటంటే.? ఈ చిత్ర నిర్మాత బివిఎస్ఎన్ ప్రసాద్ గారితో ఎన్టీఆర్ గారు చెబుతూ..
ఈ చిత్రాన్ని మీరు విడుదల చేసేయండి. మీకు ఒకవేళ నష్టం వాటిల్లితే నేను మీకోసం ఓ చిత్రాన్ని ఉచితంగా చేస్తానని నిర్మాతకు చెప్పాడట. అలా పవన్ కళ్యాణ్ తో (NTR – Pawan Kalyan) పాటు ఎన్టీఆర్ కూడా భరోసా ఇవ్వడంతో.. ఈ సినిమాని ధైర్యంగా విడుదల చేశారు నిర్మాత ప్రసాద్ గారు.. కానీ అంచనాలు తారుమారు చేస్తూ.. ఈ చిత్రం సూపర్ హిట్ బ్లాక్ బాస్టర్ గా నిలిచి అప్పట్లోనే 75 కోట్ల రూపాయల షేర్ వసూళ్లను రాబట్టి సంచలనం క్రియేట్ చేసింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి కెరియర్ లోనే అతి పెద్ద విజయాన్ని ఇచ్చింది ఈ చిత్రం. వీళ్ళు అందరే కాక పవన్ కళ్యాణ్ అభిమానులే కాక తెలుగు ప్రేక్షకులు కూడా అండగా నిలబడి ఈ చిత్రానికి ఘన విజయాన్ని అందించారు.