Naresh New Wife Pavitra: తెలుగు సినిమా పరిశ్రమలో ప్రస్తుతం ఒకే ఒక సంచలన వార్త ఆ సంగతి మన అందరికి తెలిసిందే.. అదే సెన్సేషనల్ కపుల్ గా గుర్తింపు పొందిన పవిత్ర నరేష్ ల జంట.. ఇక వీళ్ల గురించి పొద్దున లేచినప్పటి నుండి రాత్రి పడుకునే దాకా ఒకటే ఇటు సోషల్ మీడియాలో రచ్చ రచ్చ మరి అదే విధంగా ప్రధాన మీడియాలోనూ వీళ్ళ గురించి రచ్చ.. వీళ్లిద్దరి గురించి ఓ రేంజ్ లో చర్చలు సాగుతున్నాయి అంటే అర్థమవుతుంది ఎంత వైరల్ అవుతుందో వీళ్ళ ప్రేమ, పెళ్లి వ్యవహారం.. ఇక ఇటీవలే వీళ్ళిద్దరూ కలిసి నటించిన తాజా చిత్రం మళ్ళీ పెళ్లి విడుదలకు సిద్ధంగా ఉన్నది. ఇక ఈ చిత్రానికి దర్శకత్వం వహించింది ఎమ్మెస్ రాజు గారు కాగా స్వయంగా ఈ చిత్రాన్ని నరేష్ నిర్మించాడు.
ఇక ఈ చిత్రంలో కీలక పాత్రలో పోషించిన వారు దివంగత నటుడు శరత్ బాబు, అన్నపూర్ణ, అనన్య నాగళ్ళ, వనిత, విజయ్ కుమార్ మొదలైన వారు.. ఇక ఈ చిత్రాన్ని మే 26వ తారీకున తెలుగు, కన్నడ, భాషలో గ్రాండ్ గా విడుదల చేయబోతున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ ద్వారా మళ్లీ పెళ్లి చిత్రంపై ఎన్నో అంచనాలు ఏర్పడ్డాయి. ఇక మరో వైపు నరేష్, పవిత్ర వీళ్ళిద్దరూ వరుస ఇంటర్వ్యూలు, వరుస ప్రెస్ మీట్ లలో పాల్గొంటూ ఈ చిత్రంపై మరింత ఆసక్తి లేపుతూ హైప్ క్రియేట్ చేస్తున్నారు. ఇక పవిత్ర-నరేష్ లు గత నాలుగు సంవత్సరాల నుండి సహజీవనం చేస్తున్నారు. ఇప్పటికే వీళ్లిద్దరూ సహజీవనం చేస్తున్నట్లు ఈ విషయాన్ని అధికారికంగా కూడా వెల్లడించారు.
మొదట ఆలయం అనే చిత్రం తో ఏర్పడ్డ విల్లిద్దరి పరిచయం ఆ తరువాత హ్యాపీ వెడ్డింగ్ సినిమా సమయంలో స్నేహంగా మారి ఆ తరువాత సమ్మోహనం సినిమా షూటింగ్స్ సమయంలో ఒకరినొకరు ప్రేమించుకోవడం, ప్రపోజ్ చేసుకోవడం కూడా జరిగాయి. దాంతో ఇద్దరు సహజీవనం మొదలు పెట్టారు. ఇక ఇప్పుడు వీళ్ళిద్దరూ వివాహం చేసుకోబోతున్నట్లు దానికి సంబంధించిన కార్యక్రమాలకు కూడా వీళ్ళిద్దరూ ముస్తాబయ్యారు. అయితే ఇక్కడ సంచలనమైన విషయం ఏంటంటే.. ఇది నరేష్ కి నాలుగో పెళ్లి కాగా పవిత్రకు మూడో పెళ్లి.. అయినప్పటికీ వీళ్లిద్దరూ కొత్త జంట లాగా.. యంగ్ కపుల్ లాగా నానా హంగామా చేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. (Naresh New Wife Pavitra)
వీరిద్దరికి వయస్సు ఎంత అనేది మరిచిపోయి మరి పబ్లిక్ గా లిప్ లాక్ తో రెచ్చిపోతున్నారు. కాగా ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు పవిత్ర-నరేష్ లు.. ఇక ఆ ఇంటర్వ్యూలో భాగంగా రిపోర్టర్ పెళ్లి తర్వాత మీరు పిల్లల్ని కంటారా అని నరేష్ ని ప్రశ్నించగా.. షాకింగ్ సమాధానం తెలిపాడు. ఇప్పటి వరకు పిల్లల గురించి ఆలోచించలేదని పెళ్లి తర్వాత ఆ విషయం గురించి ఆలోచిస్తానని నరేష్ జవాబు తెలిపాడు. ఇదే కాకుండా ఇక స్వచ్ఛమైన ప్రేమకు వయసుతో సంబంధం లేదు.. అది పిల్లల విషయంలోనూ వర్తిస్తుంది. వివాహమనంతరం పిల్లల్ని కూడా కనాలనిపిస్తే కంటమంటూ నరేష్ బదులిచ్చాడు. దాంతో ఆయన మాట్లాడిన ఈ మాటలు నెట్టింట తెగ వైరల్ అవుతూ ఉన్నాయి.