Animal movie : రన్బీర్ కపూర్ హీరోగా, రష్మిక మందన్న హీరోయిన్ గా, అనిల్ కపూర్, బాబీ డియోల్ కీలక పాత్రలో నటించగా.. సందీప్ వంగా దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న సినిమా యానిమల్. ఈ సినిమా పేరు వినగానే ( Animal movie song Nanna Nuv Naa Pranam ) అందరికీ కొంత ఆశ్చర్యంగా అనిపించింది. కానీ ఈ సినిమా ట్రైలర్ , మొదటి సాంగ్ రిలీజ్ అయిన తర్వాత ఈ సినిమాపై అంచనాల పెరిగాయి. ఈ సినిమాలో రష్మిక మందన్న, రణబీర్ కపూర్ మధ్య లిప్ లాక్ సీన్స్ యూత్ కి చాలా అట్రాక్ట్ గా నిలిచాయి. ఈ సినిమాలో రన్బీర్ కపూర్ పాత్ర ఎలాంటిది అనే దానిపై కొంత ట్విస్ట్ ఉంచారు.
అయితే ఈరోజు రిలీజ్ అయిన రెండవ సాంగ్ చూడగానే ఈ సినిమా కథ మొత్తం అర్థమవుతుంది. నాన్న నువ్వు నా ప్రాణం అంటూ ఒక పాటని రిలీజ్ చేశారు. ఈ పాటలో చాలా సెంటిమెంట్ సీన్స్ ఎక్కువగా ఉన్నాయి. ఈ పాటను చూసి ( Animal movie song Nanna Nuv Naa Pranam ) సినిమా స్టోరీని అనలైజ్ చేసుకుంటున్నారు ఆడియన్స్. రన్బీర్ కపూర్ కి చిన్నప్పటినుంచి వాళ్ళ తండ్రి అంటే చాలా ఇష్టమని.. కానీ అతను ఏదో ఒక కారణం వల్ల రన్బీర్ కపూర్ కి అంత దగ్గర అవడం లేదు అన్న విషయం అర్థమవుతుంది. దగ్గర అవ్వకపోయినప్పటికీ అనిల్ కపూర్ కి రన్బీర్ కపూర్ అంటే చాలా ఇష్టం అన్న విషయం తెలుస్తుంది.
ఆ తర్వాత రన్బీర్ కపూర్ మ్యారేజ్ ఏజ్ వచ్చేసరికి.. రష్మిక మందనాన్ని ప్రేమిస్తాడని.. ఆ ప్రేమకి అతని ఫాదర్ అనిల్ కపూర్ ఒప్పుకోడని.. దానితో రష్మిక మందనాన్ని తీసుకొని తండ్రి నుంచి దూరంగా వెళ్లిపోతాడు అన్న విషయం ( Animal movie song Nanna Nuv Naa Pranam ) ఈ పాటలో అర్థం అవుతుంది. ఆ తర్వాత రన్బీర్ కపూర్ కొంతకాలం తన పర్సనల్ లైఫ్ ఎంజాయ్ చేసి.. మళ్ళీ తండ్రి కి ఏదో కష్టం వచ్చింది అన్న విషయం తెలియగానే.. భార్యా , పిల్లలతో సహా తండ్రి దగ్గరికి వస్తాడని అర్థమవుతుంది. తండ్రిని ఎప్పుడూ స్ట్రాంగ్ గా చూసిన రన్బీర్ కపూర్ కి ఒక్కసారిగా కష్టాల్లో ఒంటరిగా చూసేసరికి కొడుగ్గా అతను సెంటిమెంట్ ని బాగా పండించాడు.
తన వయసు ఎక్కువ అయ్యే కొద్ది, వస్తున్న సమస్యలను ఎదుర్కొనే సామర్థ్యం తగ్గుతున్న కొద్ది, కొడుకుని చూడగానే అనిల్ కపూర్ కి చాలా ధైర్యం, కాన్ఫిడెన్స్ వస్తున్నట్టు ఆ పాటలో కనిపించింది. ఇక ముఖ్యంగా రన్బీర్ కపూర్ ముందున నడుస్తూ ఉంటే భుజం మీద చేయి వేసి వెనకాల అనిల్ కపూర్ నడుస్తూ మాట్లాడడం.. రన్బీర్ కపూర్ చాలా వినయంగా అలా నడుస్తూ అతని మాటలు వినడం పాటలో చూపించారు. అది నిజంగా ఆ సీన్ చాలా అద్భుతంగా ఉంది. ఇలా మొత్తం పాట చూస్తే తన తండ్రి సమస్యను రన్బీర్ కపూర్ తీరుస్తాడని అర్థమవుతుంది. తండ్రి, కొడుకులు మధ్య చివరకు వచ్చేసరికి మంచి అండర్స్టాండింగ్ ఉంటుందని తెలుస్తుంది. మరి సినిమా పూర్తి కథ ఏమిటి? అసలు కథ ఏమిటి? అనేది సినిమా చూస్తేనే తెలుస్తుంది. ఏదేమైనా పాటైతే అందర్నీ సెంటిమెంట్ గా ఆకట్టుకుంది.