Home Cinema Hi Nanna : హాయ్ నాన్న లో ఆ బోల్డ్ సీన్స్ గురించి సూపర్ సీక్రెట్...

Hi Nanna : హాయ్ నాన్న లో ఆ బోల్డ్ సీన్స్ గురించి సూపర్ సీక్రెట్ బయట పెట్టిన నాని..

nani-gave-a-bold-answer-to-anchor-about-hi-nanna-movie-scenes

Hi Nanna : డిసెంబర్ 7వ తేదీన నాని హీరోగా, మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా, శౌర్యవ్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం హాయ్ నాన్న. ఈ టైటిల్ లోనే సినిమాకి మూల కథ ఏమిటో అందరికీ అర్థం అవుతుంది. తండ్రి కూతుర్ల ( Nani about Hi Nanna movie scenes ) మధ్యన ఉండే సెంటిమెంట్ ఈ సినిమా అని అర్థమవుతుంది. అలాగే ఈ సినిమా టీజర్, ట్రైలర్ చూస్తే సినిమాలో ఎలాంటి సెంటిమెంట్ ఉంటుందో, కుటుంబ కథా చిత్రంగా అందరూ కలిసి వెళ్లి చూడొచ్చని అర్థమవుతుంది. అయితే ఈ సినిమాలో పాటలకు కూడా మంచి స్పందన వచ్చింది. మ్యూజిక్ అద్భుతంగా ఉందని పేరు వచ్చింది. అయితే ఈ సినిమాపై నాని విపరీతమైన అంచనాలను అయితే పెట్టుకున్నాడు.

Nani-comments-about-those-scenes-in-Hi-Nanna-movie

డిసెంబర్ 7వ తేదీన రిలీజ్ అవుతున్న ఈ సినిమాపై ఎన్నో అంచనాలతో ఈ సినిమా ప్రమోషన్ కోసం నాని విపరీతంగా కష్టపడ్డాడు. ఎన్నో ఇంటర్వ్యూలు ఇచ్చి.. ఎన్నో రకాలుగా సినిమాని ప్రమోట్ చేశాడు. అయితే డిసెంబర్ ఒకటో తేదీన ( Nani about Hi Nanna movie scenes ) రిలీజ్ అయిన అనిమల్ సినిమాపై అందరి దృష్టిపడింది. కాకపోతే ఆ సినిమా చాలా వైలెంట్ అండ్ రొమాంటిక్ సినిమా అని తెలిసింది కనుక అది పిల్లలు వెళ్ళడానికి లేకుండా ఏ సెర్టిఫికెట్ ఇచ్చారు. అయితే నాని సినిమా మాత్రం సెంటిమెంట్తో కూడిన సినిమాని తెలుసు. పైగా ఈ సినిమాకి క్లీన్ యు సర్టిఫికెట్ వచ్చింది. కుటుంబం అంతా కలిసి చక్కగా చూడదగ్గ సినిమా.

See also  Vishnu Priya: దానికోసమే విష్ణు ప్రియను పెట్టుకున్నది - సంచలనమైన కామెంట్స్ చేసిన డైరెక్టర్.

Nani-comments-on-Hi-Nanna-movie

అయితే నాని ఈ సినిమా రిలీజ్ సందర్భంగా ఒక ఇంటర్వ్యూ ఇస్తుండగా.. యాంకర్ ఒక ప్రశ్న అడిగింది. ఈ సినిమాకి క్లీన్ యూ సర్టిఫికెట్ ఇచ్చారు కదా.. అంటే ఈ సినిమాలో లిప్ లాక్ సీన్స్ లేవా? ఒకవేళ ఉంటే అవి రిమూవ్ చేసేసారా? అని డైరెక్టుగా అడిగేసింది. దాంతో నాని సమాధానం చెబుతూ.. కిస్ చేయడంలో ఉన్న తప్పేమిటి? ( Nani about Hi Nanna movie scenes ) ఆ సీన్స్ ఉంటే ఎందుకు పిల్లలు చూడకూడదు? నా కొడుకు ఎదురుగానే నేను నా భార్యని కిస్ చేస్తాను. ముద్దు పెట్టుకోవడాన్ని ఎందుకు అంత సీన్ చేస్తున్నారు. అది కూడా ప్రేమని వ్యక్తపరచడమే. ఆ పాత్రలో నేను ఆ అమ్మాయిని ప్రేమిస్తున్నాను కాబట్టి అలా కిస్ చేస్తానంతే.. దాన్ని ఒక బూతుగా చూడాల్సిన అవసరం లేదు. కిస్ చేయడం అనేది పెద్ద ఇష్యూ కాదు, దాన్ని ఇష్యులా చూడకండి అని చెప్పాడు.

See also  Allu Arjun - Sneha Reddy: స్నేహారెడ్డి ఆ ఒప్పందానికి అంగీకరించి అల్లు అర్జున్‌ని పెళ్లి చేసుకుంటుందా?

Nani-comments-those-scenes-in-Hi-Nanna-movie

అయితే ముద్దు పెట్టుకోవడంపై ఇలా సంచలన కామెంట్లు చేసిన నాని గురించి, సోషల్ మీడియాలో ఆ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. తన కొడుకు ముందే తన భార్యను ముద్దు పెట్టుకుంటానని అందులో తప్పు లేదని.. సినిమాలో పాత్ర ఇంకొక పాత్రను ప్రేమిస్తే ఆ ప్రేమని ఎక్స్ప్రెస్ చేయడం మాత్రమే ముద్దు పెట్టుకోవడం అని.. దానిలో కూడా తప్పులేదని నాని చెప్పడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఇదిలా ఉంటే యూ సర్టిఫికెట్ ఇవ్వడంతో ఆ సినిమాలో కిస్ సీన్స్ తీసేసారేమో అని కొంతమంది ఆడియన్స్ అనుకోగా.. ఇప్పుడు నాని చెప్పిన ఈ మాటలతో.. సినిమాలో అన్ని ఉన్నాయని.. ఏమి తీసేయలేదని క్లారిటీ వచ్చింది. మొత్తానికి ప్రేమికుల మనసుని కూడా హత్తుకునేలా ఉన్న సీన్స్ ని తీయలేదని.. అవి అలాగే ఉన్నాయని సూపర్ సీక్రెట్ ని బయటపెట్టాడు నాని. మరి రేపు రిలీజ్ కాబోతున్న ఈ సినిమా ఎలా ఉంటుంది అనేది ప్రేక్షకుల రివ్యూ ద్వారా తెలుస్తుంది.