Nagababu : ఈ రోజుల్లో ఎక్కడ చూసినా భార్య భర్తలు విడిపోవడం, విడాకులు తీసుకోవడం చాలా సహజమైపోయింది. ఒక జంటను కలపడానికి ఎన్నో కష్టాలు పడి తల్లిదండ్రులు చిన్నప్పటినుంచి ప్లాన్ చేసుకొని వాళ్ళ పిల్లలకు ఎలాంటి వాళ్ళను చేయాలో ఆలోచించి.. ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు అన్నట్టు.. జీవితంలో ( Nagababu comments on divorce ) బిడ్డలకు పెళ్లి చేయడం అనేది ఒక పెద్ద బాధ్యతగా, కలగా బ్రతికేవారు. అలాంటిది ఇప్పుడు పెళ్లిళ్లు చేసుకోవడం, విడిపోవడం కూడా చాలా ఈజీగా అయిపోతున్నాయి. ముఖ్యంగా సెలబ్రిటీస్ జీవితాల్లో ఇది ఇంకా చాలా సర్వసాధారణమైపోయింది. దానికి కారణం ఏమిటో ఆలోచిస్తూనే ఉన్నారు అందరూ..
సినిమా ఇండస్ట్రీలో మెగా కుటుంబం అంటేనే ఒక గౌరవం, ఇష్టం అందరికీ. అలాంటి మెగా కుటుంబంలో గత కొంతకాలంగా పీడిస్తున్న సమస్య విడాకులు. మెగా కుటుంబంలో ఆడపిల్లలు పెళ్లిళ్లు చేసుకొని భర్తలను వదిలేస్తున్నారు. వీళ్ళు భర్తని వదిలేస్తున్నారా? లేక భర్తలు వీళ్ళని వదిలేస్తున్నారా? అనేది తెలీదు గానీ.. విడిపోవడం అయితే మాత్రం జరుగుతుంది. పోనీ దీనిమీద ఏదో సీక్రెట్ గా సైలెంట్ గా బతుకుతాము అంటే.. జనాలు ( Nagababu comments on divorce ) బ్రతకనివ్వడం లేదు. దాని గురించి ఎప్పటికప్పుడు ఏదో రకమైన కామెంట్స్ ఏదో రకమైన వార్తలు వస్తూనే ఉన్నాయి. అది కూడా చాలా సహజమే మరి.. సెలబ్రిటీస్ అంటే వాళ్లవి అన్ని గుట్టుగా ఉంచుకోవడం జరిగే పని కాదు.
ఇటీవల నిహారిక విడాకులు తీసుకున్నానని చెప్పడం జరిగింది. ఆమె పెళ్లయి ఏడాది కూడా పూర్తికాకముందే భర్త నుంచి ఎందుకు విడిపోతుంది అని అందరూ అనుకోవడం కూడా జరిగింది.
అయితే దీని మీద నాగబాబు ఎటువంటి కామెంట్స్ చేయకపోగా సైలెంట్ గా ఊరుకున్నారు. కానీ నాగబాబు ఇటీవల చేసిన ఒక కామెంట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నాగబాబు ఒక ఇంటర్వ్యూలో.. ఈ రోజుల్లో జరుగుతున్న విడాకుల గురించి మాట్లాడుతూ.. ఈరోజుల్లో ఎక్కువమంది అమ్మాయిలు విడాకులు తీసుకోవడానికి కారణం ఏమిటంటే.. ఇప్పటి జనరేషన్ లో వచ్చిన మార్పులు.. వాళ్ళు ఆలోచన విధానమే. దానివల్ల ( Nagababu comments on divorce ) విడాకులు తీసుకోవడం జరుగుతుంది. అబ్బాయిలు వాళ్లలో మార్పు తెచ్చుకోవడం లేదు. అమ్మాయిలు వాళ్లలో విపరీతమైన మార్పులు తెచ్చుకుంటున్నారు. వాళ్ళ ముందు జనరేషన్ వాళ్ళని మీరు ఎందుకు అడ్జస్ట్ అవుతున్నారు అని అడుగుతున్నారు. మమ్మల్ని ఎందుకు అడ్జస్ట్ అవ్వమంటున్నారు అంటున్నారు. అలా పెరుగుతూ ఉండటం వల్ల వాళ్లలో మార్పులు రావడం వలన కలిసి ఉండలేకపోతున్నారు.
పూర్వం మగాడు మాత్రమే డబ్బు సంపాదించేవాడు. ఇప్పుడు ఆడ మగ ఇద్దరూ సమానంగా సంపాదిస్తూ సమానమే కాకుండా ఆడవాళ్లు ఇంకా మగవాడి కంటే కొంచెం ఎక్కువ సంపాదించే రేంజ్ లో ఉండి మేము ఎందుకు వీళ్ళ ఆధిపత్యాన్ని ఒప్పుకోవాలి అని ఆడవాళ్లు అనుకుంటున్నారు. అలాగని ఫ్రీడమ్ తో ఉన్న భార్యలను ఎలా కంట్రోల్ లో పెట్టాలి అని మగాళ్లు అనుకోవడం వలన రెండు మనస్తత్వాలు సెట్ కాక విడిపోవాల్సిన పరిస్థితి వస్తుంది అని క్లియర్గా చెప్పవచ్చారు. ఇక దీనితో నెటిజనులంతా అయితే నిహారిక ఈ కారణంగానే వదిలేసిందా, శ్రీజ ఈ కారణంగానే భర్తకు దూరమైందా అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ఏదేమైనా నాగబాబు స్పెసిఫిక్ గా నా కూతురు అని చెప్పకపోయినా ఈరోజుల్లో ఉన్న ఆడపిల్లలందరి విషయాల్లో ఆయన చెప్పిందాంట్లో కొంతవరకు రీజన్ అయితే కరెక్టే అనిపిస్తుంది. మగాళ్లతో సమానంగా సంపాదిస్తూ.. సమానంగా ఎగురుతున్న ఆడవాళ్ళు వాళ్ళ ఫ్రీడమ్ ని వాళ్ళు కోరుకుంటున్నారు. దాని వలన ఒకరికి ఒకరు అడ్జస్ట్ అవ్వలేకపోతున్నారు.