Daksha Nagarkar: 2015లో విడుదలైన పీకే రావు పీకే రావు అనే చిత్రం ద్వారా తెలుగు ఇండస్ట్రీ లో అడుగుపెట్టిన ఈ కన్నడ బ్యూటీ (Daksha Nagarkar).. ఆ తర్వాత జాంబిరెడ్డి చిత్రంతో మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఆ తర్వాత బంగార్రాజు చిత్రంతో మన ముందు కు వచ్చిన ఈ అమ్మడు ప్రస్తుతం రవితేజ సినిమా రావణాసుర లో నటిస్తుంది. ఇక మనందరికీ తెలిసిన విషయమే.. అప్పట్లో బంగార్రాజు ఈవెంట్ జరుగుతున్న సమయంలో ఈమెకు చైతుకు నడుమ జరిగిన సంభాషణ అబ్బో అప్పట్లో నెట్టింట తెగ వైరల్ అయింది. వీళ్ళిద్దరూ చేసుకున్న ఆ కనుసైగల సంభాషణ సోషల్ మీడియాలో పెద్ద దుమారమే లేపింది.
దాంతో అప్పట్లో వీళ్ళిద్దరి మధ్య ఏదో నడుస్తుందని వార్తలు కూడా వచ్చాయి. కానీ ఇలాంటి రూమర్స్ కి దక్ష (Daksha Nagarkar) ఎలాంటి స్పందన తెలపలేదు. ఇక అప్పుడు జరిగిన ఆ విషయం గురించి ఈమె ఇటీవలే రావణాసుర ప్రమోషన్లో భాగంగా పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో చైతు నేను మంచి ఫ్రెండ్స్ అని మా ఇద్దరి నడుమ అలాంటిది ఏదీ లేదని క్లారిటీ తెలిపింది. కానీ నాగచైతన్యకు సంబంధించిన ఒక ఇంట్రెస్టింగ్ వార్తను బహిర్గతం చేసింది. అదేంటంటే.. నేను బంగార్రాజు సినిమాలో చేసే సమయంలో నాగచైతన్య ముద్దు పెట్టుకుని కౌగిలించుకునే సన్నివేశాలు ఉన్నాయన్న సంగతి మనందరికీ తెలుసు..
అయితే ఆ ముద్దు సీన్లో నటించిన తర్వాత నాగచైతన్య నా దగ్గరికి వచ్చి సారీ అని చెప్పాడు. ఇదే కాకుండా దక్ష నాగచైతన్య గురించి చెబుతూ నాగచైతన్య వెరీ స్వీట్ బాయ్.. నాగచైతన్య లాంటి అబ్బాయిని ఎవరైనా తమ జీవితంలోకి రావాలని కోరుకుంటారు. ఇంత మంచి స్వీట్ అండ్ సింపుల్ అబ్బాయిని లవర్ గా రావాలని జీవితంలో ఉండాలని ప్రతి అమ్మాయి కోరుకుంటుంది. నాగచైతన్య తో నటించే ప్రతి ఒక్క హీరోయిన్ ని ఎంతో కేరింగ్ తో చూసుకుంటాడు అంటూ వెల్లడించింది.. ఇక ఇదే కాకుండా.. చైతు ఎంతో కూల్ గా ఉంటాడు. షూటింగ్ టైంలో చాలా కూల్ గా ఉంటూ అందరితో మంచిగా మాట్లాడుతుంటాడని దక్ష నగార్కర్ కొన్ని షాకింగ్ విషయాలు చైతు గురించి చెబుతూ నా మనసులో తన మీదున్న అభిప్రాయాన్ని వివరిస్తున్నానంటూ తెలిపింది.
ఇక అసలు విషయం అడిగితే.. మీరు ఆ సినిమా ఈవెంట్లో ఒకరికొకరు చూసుకొని కను సైగలు ఎందుకు చేసుకున్నారు.? అన్న విషయం గురించి ప్రస్తావిస్తే.. దాని గురించి క్లారిటీ ఇవ్వకుండా.. నేను మళ్ళీ చైతుతో ఏదైనా సినిమా చేసినప్పుడు తప్పక ఆ విషయం అప్పుడు వివరిస్తానని తెలిపింది. ప్రస్తుతం రవితేజ నటిస్తున్న రావణాసుర చిత్రంలో దక్ష నటించింది. ఇక ఈ చిత్రం ఈ నెల ఏడవ తారీఖున విడుదలకు సిద్ధంగా ఉన్నది.