Home Cinema Mrunal Thakur : అదేగాని జరక్కపోతే నా పేరు మార్చుకుంటానంటున్న మృణాల్ ఠాకూర్..

Mrunal Thakur : అదేగాని జరక్కపోతే నా పేరు మార్చుకుంటానంటున్న మృణాల్ ఠాకూర్..

mrunal-thakur-speech-at-the-hi-nanna-movie-pre-release-event

Mrunal Thakur : నాని హీరోగా, మృణాల్ ఠాకూర్ హీరోయిన్గా, శౌర్యువ్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న సినిమా హాయ్ నాన్న. ఈ సినిమా టీజర్, ట్రైలర్,పాటలు అన్నీ కూడా అందరిని ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా ఈ సినిమాలో నాని, కూతురు పాత్రలో వేసిన కియారా వీళ్ళిద్దరి నటన అద్భుతంగా ఉంటుందని.. వీళ్ళిద్దరూ కలిసి ( Mrunal Thakur speech at the Hi Nanna ) నటించిన ప్రతి సీన్ సెంటిమెంటుతో ఒక రకమైన ఆనందకరమైన ఫీలింగ్ ని ఇస్తుందని ట్రైలర్లోనే కనిపించింది. ఇంక సినిమాకి వెళ్తే ఇంకెంత హ్యాపీగా, రిలాక్స్డ్ గా, ఒక మోరల్ గా అనిపిస్తుంది అని అందరూ ఆడియన్స్ ఎదురుచూస్తున్నారు. ఇక ఈ సినిమాలో హీరోయిన్గా నటించిన మృనాల్ ఠాకూర్ అంటే మనందరికీ ఎంత ఇష్టమో కొత్తగా చెప్పుకోవాల్సిన పనిలేదు.

Mrunal-Thakur-speech-Hi-Nanna-event

సీతారామమ్ సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీ వాళ్లకి పరిచయమైన మృణాల్ ఠాకూర్ ఆమె నటనతో.. మొదటి సినిమాతోనే అందరి మనసుల్లో ఒక స్థానాన్ని సంపాదించుకుంది. ఇప్పుడు మళ్ళీ హాయ్ నాన్న సినిమాతో నానితో కలిసి మన ముందుకు వస్తుంది. ఈ సినిమాలో కూడా ఈమె నటన ఎంతో చక్కగా ఉంటుందని.. సినిమా ఖచ్చితంగా ( Mrunal Thakur speech at the Hi Nanna ) బ్లాక్ బస్టర్ హీట్ అవుతుందని అందరూ ఆశిస్తున్నారు. హాయ్ నాన్న సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ఈరోజు విశాఖపట్నంలో జరిగింది. ఈ విశాఖపట్నంలో జరుగుతున్న హాయి నాన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ కి హీరో నాని, హీరోయిన్ మృణాల్ ఠాకూర్, దర్శకుడు శౌర్యువ్ ఇంకా అనేకమంది ప్రముఖులు రావడం జరిగింది.

See also  Ram Charan : పుట్టిన 24 గంటల్లో పెళ్లి సంబంధం అంటూ అల్లుడితో వచ్చేసారా.. రామ్ చరణ్ ఉపాసన రియాక్షన్!

Mrunal-Thakur-speech-Hi-Nanna

ఈవెంట్ వేడుకకి యాంకర్ సుమ హోస్టుగా చేయడం జరిగింది. ఆమె యాంకరింగ్ లో మొదటగా హీరోయిన్ మృణాల్ ఠాకూర్ ని స్టేజి మీద పిలవగా ఆమె మాటలు మొదలుపెట్టింది. మృణాల్ ఠాగూర్ మాట్లాడుతూ ఉంటే అభిమానులను ( Mrunal Thakur speech at the Hi Nanna ) ఆనందంతో విజిల్స్ వేస్తూనే ఉన్నారు. విశాఖపట్నంలో ఆమె అభిమానులందరినీ పలకరించి.. సీతారామంతో తనని ఆదరించినందుకు, ఇప్పుడు హాయ్ నాన్న సినిమాలో కూడా తనను ఆదరిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందని చెప్పింది. ఈ సినిమా ద్వారా తనకొక మంచి ఫ్రెండ్ దొరికిందని చెప్పింది. ఇంతకీ ఆ ఫ్రెండ్ ఎవరు అంటే.. బేబీ కియారా. ఈ చిన్నారి చాలా బాగా అద్భుతంగా నటించిందని, ఆమె ఫ్యూచర్లో కచ్చితంగా ఒక పెద్ద స్టార్ అవుతుందని చెప్పుకొచ్చింది.

See also  Ram Charan : చిరంజీవి లేని టైం లో రామ్ చరణ్ అలాంటి మాటలు అన్నాడట.. దీనికి అభిమానులు..

Mrunal-Thakur-speech-Hi-Nanna-pre-release

అలాగే డిసెంబర్ 7వ తారీఖున రిలీజ్ అవుతున్న ఈ సినిమాని కచ్చితంగా చూడమని, ఈ సినిమాలో ప్రతి పాట కూడా చాలా అద్భుతంగా ఉందని చెప్పుకొచ్చింది.అంతేకాకుండా ఈ సినిమా షూటింగ్ టైంలో తన తోటి నటులతో కూడా చాలా ఎంజాయ్ చేశానని చెప్పింది. అలాగే ఈ సినిమాలో ప్రతి మూమెంట్ ని చాలా ఎంజాయ్ చేస్తారని చెప్పింది. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హీట్ అవుతుంది అని చెప్పకు వచ్చింది. నాని ఎంతో అద్భుతంగా ఈ సినిమాలో నటించాడని చెప్పకు వచ్చింది. నేను చాలా ఫ్రీగా, చాలా ఎంజాయ్ చేస్తు నటించడానికి కారణం నాని అని కూడా చెప్పింది. అంతేకాకుండా ఈ సినిమాలో నానికి కియారాకి తండ్రి కూతుర్లకు ఉన్న ఒక బాండింగ్ చాలా బాగా కనిపిస్తుందని.. వీళ్లిద్దరి ప్రేమని చూసి మీరు అందులో వాళ్ళ ప్రేమలో మీరు పడకపోతే నా పేరు మార్చుకుంటాను అని మృణాల్ ఠాకూర్ చెప్పడంతో.. అక్కడ అందరూ హర్షద్వనులు వినిపించారు.