Home Cinema Kiara Advani: ముందు అన్నీఅయ్యాకే పెళ్లి.. మొన్ననే వివాహం అప్పుడే గర్భవతి ఐన నటి  కియారా..

Kiara Advani: ముందు అన్నీఅయ్యాకే పెళ్లి.. మొన్ననే వివాహం అప్పుడే గర్భవతి ఐన నటి  కియారా..

ram-charan-actress-kiara-advani-is-pregnant-just-after-a-week-of-her-marriage-with-sidharth-malhotra

Kiara Advani: తెలుగు చిత్ర పరిశ్రమలో రామ్ చరణ్ సరసన వినయ విధేయ రామ చిత్రంలో నటించిన కియారా. అదే కాకుండా ఆమె మహేష్ బాబు సరసన భరత్ అనే నేను చిత్రంలో నటించి అందరిని మెప్పించింది. ప్రస్తుతమైతే పాన్ ఇండియా రేంజ్ లో మంచి డిమాండ్ ఉన్న స్టార్ హీరోయిన్ గుర్తింపు పొందింది. వరుస సినిమాలతో దూసుకుపోతుంది.

ram-charan-actress-kiara-advani-is-pregnant-just-after-a-week-of-her-marriage-with-sidharth-malhotra

బాలీవుడ్ లో హిట్టు మీద ఇట్లు కొడుతూ వరుస క్రేజీ ఆఫర్లు తన సొంతం చేసుకుంటూ వెళుతుంది. అయితే ఇటీవల ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్ స్టార్ హీరో సిద్ధార్థ మల్హోత్రాను వివాహం ఆడిన విషయం అందరికీ తెలిసిందే. బంధుమిత్రులు కొంతమంది సినీ ప్రముఖుల సమక్షంలో వీరి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. వీరిద్దరూ దాదాపు మూడేళ్ల నుంచి ప్రేమించుకుంటూ డేటింగ్ చేస్తున్నారని వార్తలు వార్తతో పాటు తాజాగా మరొక వార్త కూడా సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతుంది.

See also  Valentines Day: మన తెలుగు తారల ప్రేమ పెళ్లిళ్లు.. ఎవరెవరిది సక్సెస్ రేట్ ఎలా ఉందొ చూద్దాం.

ram-charan-actress-kiara-advani-is-pregnant-just-after-a-week-of-her-marriage-with-sidharth-malhotra

ఆ వార్త ఏంటంటే.. నాటి శ్రీదేవి నుంచి ఎందరో హీరోయిన్లు వివాహానికి ముందే గర్భం దాల్చిన సంగతి అందరికీ తెలిసిందే. అలా తొందరపడి హడావిడిగా పెళ్లి చేసుకున్న వాళ్ళలో శ్రీదేవితో పాటు ఇంకా కొంకనాసేన్ శర్మ, నీనా గుప్తా, సారిక, సేలినా జైట్లి, అమీ జాక్సన్, మహిమా చౌదరి, అమృత అరోరా, వీణా మాలిక్ లతో పాటు ఇటీవలే వివాహం చేసుకున్న ఆలియా భట్ కూడా పెళ్లికి ముందే గర్భం దాల్చడం విశేషం. ఇప్పుడు ఇదే లిస్టులోకి రామ్ చరణ్ హీరోయిన్ కూడా చేరిందనే వార్తలు అంతటా వ్యాపించాయి.

See also  Anchor Ravi: యాంకరింగ్ కు దూరమవుతున్న రవి - ఆ తప్పు వల్లేనా..??

ram-charan-actress-kiara-advani-is-pregnant-just-after-a-week-of-her-marriage-with-sidharth-malhotra

కియారా అద్వానీ పెళ్లికి ముందే గర్భం దాల్చింది. డేటింగ్ సమయంలోనే ఇది జరిగిందంటూ వార్త జోరుగా ప్రచారం సాగుతుంది. కియారా అద్వానీ రెగ్యులర్గా చెక్ అప్ చేయించుకునే హాస్పిటల్ లో డాక్టర్ రిపోర్ట్స్ ద్వారా ఈ విషయం బయటపడిందని. ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే కియారా అద్వానీ మరి ఈ విషయం పట్ల ఎలా స్పందిస్తుందో చూడాలి మరి. కానీ ఇది ఒక ఎత్తు అయితే పెళ్లయిన తర్వాత ఆఫర్లు రావు అనుకుంటారు. కానీ కియారా అద్వానీ చేతిలో ప్రస్తుతం 5,6 సినిమాలు ఉన్నాయి. వాటిలో ఎక్కువ బాలీవుడ్ కు సంబంధించిన చిత్రాలు కావడం విశేషం. ఇటు టాలీవుడ్ లో రామ్ చరణ్ శంకర్ కాంబోలో ఆర్సి 15 చిత్రంలో నటిస్తుంది. ఇదే కాక తనకు భారీ ఆఫర్స్ వస్తున్నా కూడా డేట్స్ సెట్ చేయలేకపోతుందంట. మన టాలీవుడ్ ఫ్యాన్స్ మాత్రం ఆమె నుంచి ఎక్కువ సినిమాలు వస్తే బాగుండు అని కోరుకుంటున్నారట.