KTR – Balagam : సినిమా అంటే కేవలం స్టార్ హీరో, హీరోయిన్స్.. హై బడ్జెట్ సినిమాలు మాత్రమే కాదు.. మంచి కథ, మంచి సారాంశం ఉంటే.. చిన్న చిన్న నటులతో, లో బడ్జెట్ లో కూడా అందరి మనసుల్ని గెలుచుకునేలాగా ఎక్కువ కలెక్షన్స్ తీసుకొచ్చేలాగా నిర్మించవచ్చు అని ఇప్పటివరకు అనేక సినిమాలు నిరూపించాయి. ఎప్పటికప్పుడు ( Minister KTR speech about the Balagam movie ) చిన్న చిన్న సినిమాలు తమ సాయి శక్తుల పెద్ద సినిమాలతో పోటీపడేలా సక్సెస్ అవ్వాలని ప్రయత్నిస్తూనే ఉంటాయి. అలాంటి తరుణంలో ఎక్కడో ఒకచోట ఎదో ఒక సినిమా కరెక్ట్ గా,సరిగ్గా అలాగే సక్సెస్ అయ్యి కూర్చుంటుంది. అలాంటి సినిమానే తెలుగులో ఇటీవల రిలీజైన బలగం సినిమా.
ప్రియదర్శి హీరోగా, కావ్య కళ్యాణ్రామ్ హీరోయిన్ గా, వేణు దర్శకత్వంలో రూపొందిన చిత్రం బలగం. ఈ సినిమాని దిల్ రాజు కూతురు హన్సిక రెడ్డి నిర్మించడం జరిగింది. ఈ సినిమాని గురించి అక్కడ ఇక్కడ జనాలందరూ మాట్లాడుకోవడం అనేది పక్కన పెడితే.. ఏకంగా అసెంబ్లీలో మాట్లాడుకున్నారు. వర్షాకాలం అసెంబ్లీ సమావేశాలు ( Minister KTR speech about the Balagam movie ) జరుగుతున్న సందర్భంగా.. మంత్రి కేటిఆర్ మాట్లాడుతూ.. బలగం సినిమా గురించి మాట్లాడారు.. బలగం సినిమా తీసిన తర్వాత ఆ సినిమా వేడుకకు నన్ను రమ్మని ఆహ్వానించగా వెళ్ళాను. ఆ సినిమా చూసిన తర్వాత అర్థమైంది ఆ సినిమా ఎంత బాగుందో.. ఆ సినిమా ఆడియన్స్ ని ఎంతగా ఆకట్టుకుందంటే.. మనుషుల బంధాలు గురించి, ఆప్యాయతల గురించి ఎంతో చక్కగా చూపించారు. ప్రతి ఊరిలోనూ పెద్ద పెద్ద స్క్రీన్స్ పెట్టి ఆ సినిమాలు చూపించడం జరిగింది.
ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరికి కనిపించింది, మాట్లాడుకునేది ఎక్కువగా మనుషుల బంధాల గురించి.. మనుషుల మధ్య బంధాలు రోజురోజుకీ తగ్గిపోతుంటే వాటిని చూపించే తరుణంలో చాలా గొప్పగా తీశారని.. ఆ సినిమా చూసిన ప్రతి ఒక్కరూ కన్నీరు కార్చారని.. చాలా బాగా తీశారని కేటీఆర్ చెప్పారు. అయితే ఈ సినిమా ( Minister KTR speech about the Balagam movie ) చూస్తుండగా మనుషుల బంధాలు మాత్రమే కాకుండా ఆడియన్స్ ఇంకొకటి చూడగలిగారు. అదేమిటంటే పచ్చటి పొలాలను. ఈ సినిమా షూటింగ్ రాజన్న సిరిసిల్ల జిల్లా.. వేములవాడ నియోజకవర్గం.. కోనరావుపేట మండలంలో జరిగింది. ఈ సినిమా నేను నా కుటుంబంతో కలిసి చూసాను. అయితే ఆ సినిమా చూసిన తర్వాత ఈ సినిమా షూటింగ్ నిజంగానే తెలంగాణలో తీశారా అని నన్ను చాలామంది అడిగారు.
కప్పుడు సినిమాల్లో కరువు లేదా బాధల్లో ఉన్నప్పుడు ఎండిపోయిన పొలాలు చూపించడానికి రాయలసీమ, తెలంగాణ ప్రాంతాల్లోనే చూపించేవారు. అలాంటిది ఇప్పుడు బలగం సినిమా చూస్తే అర్థమవుతుంది.. తెలంగాణ పాడిపంటల విషయంలో ఎంత అభివృద్ధి చెందిందో.. దానికి నిలువెత్తు నిదర్శనం బలగం సినిమానే అని కేటర్ అన్నారు. తెలంగాణ పాడిపంటల విషయంలో ఎంత పచ్చదనాన్ని తీసుకొచ్చిందో .. ఎంత మార్పు వచ్చిందో అనేది అర్థమవుతుంది అని ఈ పాయింట్ని రేజ్ చేస్తూ కేటీఆర్ బలగం సినిమా గురించి అసెంబ్లీలో మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఏదేమైనా బలగం సినిమా అదృష్టం ఏమిటంటే.. ఈ సినిమా ఎన్నో అవార్డులను సాధించుకుని.. ఎంతో సూపర్ డూపర్ కలెక్షన్స్ రాబట్టుకుని.. ఎంతో మంచి పేరు తెచ్చుకోవడమే కాకుండా అసెంబ్లీలో కూడా ఈ సినిమా గురించి మాట్లాడుకునే స్థాయికి వెళ్లడం నిజంగా ఆ దర్శకుడు, ఆ నిర్మాతలు అందరూ కూడా గర్వించదగ్గ విషయమే అని అనుకుంటున్నారు.