Home Cinema Manchu Manoj: మంచు మనోజ్ సంచలన నిర్ణయం.. పెళ్లయిన వారం రోజులకే విడిపోతున్నారా?

Manchu Manoj: మంచు మనోజ్ సంచలన నిర్ణయం.. పెళ్లయిన వారం రోజులకే విడిపోతున్నారా?

Manchu Manoj took shocking decision after his marriage: మంచు మనోజ్ భూమా మౌనిక రెడ్డిల పెళ్లి జరిగిన విషయం మనందరికీ తెలిసినదే. గత కొన్ని రోజులుగా అందరం ఈ పెళ్లి వార్తలను చూస్తూనే ఉన్నాము. మంచు మనోజ్ కి ఇది రెండవ పెళ్లి.. మొదట ప్రణతి రెడ్డిని ప్రేమించి పెళ్లి చేసుకున్న మనోజ్ తరవాత వారిద్దరి మధ్య కొన్ని సమస్యలు వచ్చి విడిపోయారు. అయితే ఆమెతో మనోజ్ కి పిల్లలు పుట్టలేదు. తరవాత మంచు మనోజ్ భూమా రెడ్డి రెండవ కూతురు మౌనిక రెడ్డి ని ప్రేమించారు. మౌనిక రెడ్డి కి కూడా మొదట పెద్దలు కుదిర్చిన పెళ్లి జరిగింది. ఆమెకు ఒక కొడుకు కూడా కలిగాడు. ఆ తరవాత ఆ భార్యాభర్తలు ఇద్దరూ విడిపోయారు. ఆ తర్వాత ఆమెకు మనోజ్ తో స్నేహం కుదిరింది. వారిద్దరి మధ్య స్నేహం కాస్త ప్రేమగా మారి పెళ్లి చేసుకునే దగ్గరకు వచ్చింది.

See also  NTR: ఇంతకన్నా ఇంకేమి కావాలి సాక్ష్యం.. ఎన్టీఆర్ నిజమైన గ్లోబల్ స్టార్ అనడానికి..

manchu-manoj-took-shocking-decision-after-his-marriage

మొదట్లో వీరిద్దరి మధ్య ఎదో నడుస్తుందని, మీడియా వాళ్ళు అన్నా, మనోజ్ మౌనికాలు మాత్రం బయట పడలేదు. తరవాత అసలు విషయం అనౌన్స్ చేసి, పెళ్లి చేసుకుంటామని చెప్పారు. వీరి పెళ్లి రెండు కుటుంబాలను ఒప్పించి మరీ పెళ్లి చేసుకున్నారు. పెళ్లి మాత్రం సింపుల్ గా బాగా దగ్గర వాళ్ళను మాత్రమే పిలిచి చేసుకున్నారు. వీళ్ళ పెళ్లి ఎంత సింపుల్ గా అయినా, సోషల్ మీడియాలో మాత్రం చాల సందడిగానే జరిగింది. వీరి పెళ్లి ఫొటోస్ వీడియోస్ అన్ని వైరల్ అయ్యాయి. అయితే ఇప్పుడు ఒక కొత్త సమస్య వచ్చిందని వార్తలు వస్తున్నాయి. అదేమిటంటే పెళ్లి అయ్యి వారం రోజులు కూడా కాలేదు కానీ, అప్పుడే విడిపోతున్నారంటూ వార్తలు వస్తున్నాయి. దీనితో అందరూ షాక్ అవుతున్నారు.

See also  Rashmi Gautam: యాంకర్ రష్మీ పెళ్లి పీటలు ఎక్కబోయేది రెండో పెళ్లి చేసుకున్న వాడితో నా.??

manchu-manoj-took-shocking-decision-after-his-marriage

మంచు మనోజ్ కి ఇంత వరకు పిల్లలు లేరు. భూమా మౌనిక రెడ్డికి ( Manchu Manoj took shocking decision after his marriage ) మాత్రం ఒక కొడుకు ఉన్నాడు. పెళ్లి అయిన తరవాత కొడుకు అమ్మమ్మ గారి ఇంట్లో ఉంటాడని, భూమా వారి వారసుడిగా పెరుగుతాడని అందరూ అనుకున్నారు. కానీ మనోజ్ మౌనిక కొడుకుని తన కొడుగ్గా స్వీకరిస్తానని, అంతే కాకుండా ఇంక తనకు పిల్లలు వద్దని నిర్ణయం తీసుకున్నాడంట. దీనితో మోహన్ బాబు ఫామిలీ షాక్ అయ్యిందంట. ప్రేమించాను, పెళ్లి చేసుకుంటాను అంటే ఓకే గాని, ఎవరి కొడుకునో మంచు వారసుడిని చేయడం ఏమిటని ఫీల్ అవుతున్నారంట. మనోజ్ కి ఎంత చెప్పినా కూడా వినడం లేదంట. దీనితో మోహన్ బాబు ఫామిలీ కూడా మనోజ్ పై కోపంగానే ఉన్నారంట. ఇవన్నీ చూస్తున్న మౌనిక రెడ్డి కి ఎం చెయ్యాలో తోచడం లేదంట.

See also  Trisha: ఆ స్టార్ హీరో వల్లే త్రిష ఇప్పటికీ పెళ్లి చేసుకోకుండా ఉందా.?

manchu-manoj-took-shocking-decision-after-his-marriage

అయితే మనోజ్ మౌనిక రెడ్డి కొడుకుని మంచు వారసుడిగా చెయ్యాలి అనుకుంటే, ఫామిలీ అంతా ఎవరికి వారు విడిపోయి, ఎవరి ఆస్తులు వాళ్ళు పంచుకోవాలని అనుకుంటున్నారట. దీనికి మోహన్ బాబు చాలా ఫీల్ అవుతున్నారంట. అసలు ఈ వార్తలో నిజం ఉందొ లేదో, గాలి వార్త నా? అనేది తెలియాలంటే మంచు ఫామిలీ నుంచి ఎదో ఒక అనౌన్సమెంట్ రావాలి. అలా వస్తే తప్ప సోషల్ మీడియాలో వచ్చే ఇలాంటి వార్తలని పూర్తిగా నమ్మలేము.