గత రెండు వారాలుగా నందమూరి అభిమానవులను తారకరత్న ఆరోగ్య పరిస్థితి బాధిస్తుంది. 17 రోజులు పూర్తి కావస్తుంది కానీ, ఇంకా తారకరత్న స్పృహలోకి ఎందుకు రాలేదనే బాధ వాళ్ళను వేధిస్తుంది. ఎప్పటికప్పుడు తారకరత్న ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులు సమాచారాన్ని ఇస్తూనే ఉన్నారు. అయితే, సోషల్ మీడియాలో తారకరత్న ఆరోగ్య పరిస్థితి గురించి అనేక వార్తలు వస్తున్నాయి గాని, అందులో అనేక గాలి వార్తలు లేకపోలేదు.
నారా లోకేష్ యువగళం పాదయాత్రలో పాల్గున్న తారకరత్న, ఒక్కసారిగా కుప్పకూలిపోయి ఇలా అవ్వడం నిజంగా బాధాకరం. అయితే తారకరత్న మల్లి ఆరోగ్యంగా తిరగటానికి, ఆయనకి మెరుగైన ఆరోగ్యం అందించేందుకు.. బెస్ట్ డాక్టర్స్ న్బు రప్పించి మంచి వైద్యం అందిస్తున్నారు. తారకరత్న కు మెదడుకి ఆక్సిజన్ అందక, బ్రెయిన్ కూడా డ్యామేజ్ అయ్యిందని, అందుకోసం కూడా ట్రీట్మెంట్ చేస్తున్నామని డాక్టర్లు చెప్పారు.
తారకరత్న గారికి నారాయణ హృదయాలయ హాస్పిటల్ లో ఎలాంటి ట్రీట్మెంట్ ఇస్తున్నారో సమాచారం బయటకు వచ్చింది. గుండెలో 90% బ్లాకేజీ ఉండటం వలన, ఆయన ఆరోగ్య పరిస్థితి అంత దారుణంగా ఉందని తెలుస్తుంది. ఆయన అడ్మిట్ అయిన తరవాత హార్ట్ సర్జరీ ఒకటి చేసారంట. అయినా కూడా ఇంతవరకు ఆయన స్పృహలోకి రావలేకపోవడానికి కారణం, గుండెలో 90% బ్లాకేజీ ఉండటం వలన అని అనుకుంటున్నారు.
అలాగే ఓ ప్రత్యేక డాక్టర్ల బృందం ఎప్పటికప్పుడు తారకరత్న బ్రెయిన్ ఎలా పనిచేస్తుంది అనే దాని మీద ట్రీట్మెంట్ చేయగా, న్యూరాలజీ డాక్టర్.. తారకరత్న బ్రెయిన్ పనితీరును పరీక్షిస్తూ దానికి తగ్గట్టు ట్రీట్మెంట్ చేస్తున్నారట. ఏది ఏమైనా తారకరత్న ట్రీట్మెంట్ అంత బాగా జరిగి వీలైనంత తొందరగా కోలుకోవాలని నందమూరి అభిమానులు కోరుకుంటున్నారు.