Home Cinema Lakshmi Pranathi : ఎన్టీఆర్ ని పక్కన పెట్టి మరీ ఆ హీరో సినిమా పిచ్చ...

Lakshmi Pranathi : ఎన్టీఆర్ ని పక్కన పెట్టి మరీ ఆ హీరో సినిమా పిచ్చ పిచ్చగా నచ్చిందంటున్న లక్ష్మి ప్రణతి..

jr-ntr-wife-lakshmi-pranathi-gave-a-review-about-the-mad-movie

Lakshmi Pranathi : టాలీవుడ్ లో ముచ్చటైన జంటల లిస్ట్ లో జూనియర్ ఎన్టీఆర్, లక్ష్మీప్రణతి కూడా ఉంటారు. వీళ్ళిద్దరూ ఎంతో అన్యోన్యతగా, సఖ్యతగా , చాలా వినయంగా కనిపించే మంచి జంట. జూనియర్ ఎన్టీఆర్, లక్ష్మీ ప్రణతి లకు ( Lakshmi Pranathi gave a review ) పెద్దలు కుదిర్చి చేసిన వివాహం అయినా కూడా.. వీళ్ళిద్దరూ మంచి లవర్స్లా కనిపిస్తారు. అంత మంచి అనుబంధం, అంత అర్థం చేసుకునే గుణం ఉన్న దంపతులు వీళ్ళు. వీళ్ళకి ఇద్దరు మగపిల్లలు. జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ఎంత బిజీగా ఉన్నాడో.. ప్రపంచవ్యాప్తంగా ఎంత ఖ్యాతితో ఎదిగాడో మనందరికీ తెలిసిందే.

Jr-NTR-wife-Lakshmi-Pranathi-likes

జూనియర్ ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ సినిమాతో ఎన్నో అవార్డులను అందుకున్నాడు. ప్రపంచవ్యాప్తంగా తన పేరుని మారు మ్రోగేట్టు చేసుకున్నాడు. రాజమౌళికి ఇష్టమైన హీరోగా ఎంతో ఖ్యాతిని పొందాడు. జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు దేవర ( Lakshmi Pranathi gave a review ) సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాని కొరటాల శివ దర్శకత్వంలో, జాన్వీకపూర్ హీరోయిన్గా, ఎన్టీఆర్ హీరోగా చేస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. ఈ సినిమాపై నందమూరి అభిమానులకు భారీ అంచనాలు ఉన్నాయి. ఇది ఇలా ఉంటే జూనియర్ ఎన్టీఆర్ భార్య లక్ష్మీ ప్రణతి ఎప్పుడూ కూడా సినిమాలకు దూరంగానే కనిపిస్తూ ఉంటుంది. ఆమె చాలా సింపుల్ గా ఆమె జీవితం నడుపుతూ ఉంటుంది.

See also  Virupaksha Censor Review: ఆశ్చర్యం కలిగించేలా విరూపాక్ష సెన్సార్ రివ్యూ.. ఆ క్యారక్టర్ కి అదిరిపోయే నేమ్ వస్తాదంట..

Jr-NTR-wife-Lakshmi-Pranathi-comments

అలాంటి లక్ష్మీ ప్రణతి ఒక సినిమా గురించి తన అభిప్రాయాన్ని చెప్పింది. అయితే అది ఎన్టీఆర్ సినిమా గురించి కాదండోయ్ ఒక హీరో సినిమాని పిచ్చపిచ్చగా నచ్చింది అని చెప్పింది అంట. సినిమా చూసి అంత పిచ్చిపిచ్చిగా నచ్చిందని ( Lakshmi Pranathi gave a review ) చెప్పించుకున్న ఆ హీరో ఎవరో అదృష్టవంతుడే.. జూనియర్ ఎన్టీఆర్ సినిమా కూడా ఆమె అంత గట్టిగా ఎక్కడా కూడా మాట విప్పినట్టు కనిపించలేదు. అయితే ఇంతకీ లక్ష్మీ ప్రణతి సినిమా చూసొచ్చి అంత పిచ్చిపిచ్చిగా నచ్చింది అని చెప్పిన సినిమా ఏంటి? ఆ హీరో ఎవరో తెలుసుకుందాం.

See also  Actor Nani: ఆ హీరోయిన్ తో హీరో నాని నిజంగా ఎఫైర్ పెట్టుకున్నాడా.? నిజా నిజాలు..

Jr-NTR-wife-Lakshmi-Pranathi-MAD-movie

లక్ష్మీ ప్రణతి సోదరుడు నితిన్ హీరోగా తెలుగు సినిమా ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు. మాడ్ సినిమాతో యూత్ ని అట్రాక్ట్ చేసే సినిమాగా రిలీజ్ అయింది. ఈ సినిమా రిలీజ్ తోనే పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఇప్పటికే 10 కోట్లకు పైగా వసూలు చేసింది. ఈ సినిమా సక్సెస్ మీట్ లో హీరో నితిన్ మాట్లాడుతూ.. ఈ సినిమా చూసిన అక్క, ( బావ జూనియర్ ఎన్టీఆర్కి లక్ష్మీ ప్రణతికి ) ఇద్దరికీ సినిమా చాలా నచ్చిందని.. బావ సినిమా చాలా బాగుంది అన్నాడని చెప్పాడు. అలాగే ఇక అక్క లక్ష్మీ ప్రణతి అయితే పిచ్చిపిచ్చిగా నచ్చిందని చెప్పింది. అలాగే పిల్లలు సూపర్ మామ నువ్వు సూపర్ హీరో అంటూ పొగిడారని చెప్పుకొచ్చాడు. ఇలా లక్ష్మీ ప్రణతి తన సోదరుడు నితిన్ సినిమాని పిచ్చిపిచ్చిగా నచ్చిందని పొగిడిందంట.