Jr NTR : జూనియర్ ఎన్టీఆర్ ప్రతిభ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. స్టూడెంట్ నెంబర్ వన్ సినిమాతో మొదలైన తన కెరియర్ ని.. ప్రతి సినిమాలో తనని కొత్త కొత్తగా మలుచుకుంటూ.. ఎప్పటికప్పుడు తన అభిమానులకి ఏదో ఒక కొత్త ఆనందాన్ని, కొత్త ఉత్సాహాన్ని ఎన్టీఆర్ ఇస్తూనే ఉన్నాడు. నందమూరి వంశం ( Jr NTR gets big movie offers from Hollywood ) నుంచి నందమూరి వారసుడిగా అడుగుపెట్టిన జూనియర్ ఎన్టీఆర్ తన్నదంటూ స్టైల్ లో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని నిలబెట్టుకున్న హీరో అని ఒప్పుకోక తప్పదు. జూనియర్ ఎన్టీఆర్ నటించిన ప్రతి సినిమాలో ఆ సినిమా హిట్టా ఫ్లాపా అనేది పక్కన పెడితే తన పాత్ర మాత్రం హిట్ అనే చెప్పాలి. అంత బాగా ప్రతి పాత్రలో తను దూరి, అనునయించుకుని అప్పుడు నటిస్తాడని చూస్తే అర్థమవుతుంది.
జూనియర్ ఎన్టీఆర్ నటన అలా ఉంటె.. ఇక డాన్స్ గురించి.. జక్కన్నగా పేరుపొందటమే కాకుండా, హాలీవుడ్ లెవెల్ వరకు తెలుగు సినిమా ఇండస్ట్రీ తీసుకెళ్లిన దర్శకుడు రాజమౌళి జూనియర్ ఎన్టీఆర్ డాన్స్ గురించి ఎప్పుడూ పొగుడుతూనే ఉంటారు. ఇటీవల వచ్చిన ఆర్ఆర్ఆర్ సినిమాతో ఎన్టీఆర్ పొజిషన్ ఒక రేంజ్ కి వెళ్ళిపోయింది. ఆర్ఆర్ఆర్ సినిమాలో ఎన్టీఆర్ పాత్ర ఒక అద్భుతం కాగా.. ఆ సినిమాలో ( Jr NTR gets big movie offers from Hollywood ) నాటు నాటు పాటకి ఆస్కార్ అవార్డు వచ్చిన విషయం మన అందరికి తెలిసిందే. కానీ హాలీవుడ్ ప్రముఖులంతా కూడా ఆ పాట చూసి అందులో ఎన్టీఆర్ హావభావాలు అతని డాన్స్ చూసి కొనియాడతున్నారు. అలాగే హాలీవుడ్ నుంచి ఎన్టీఆర్ కి మంచి మంచి ఆఫర్స్ మొదలయ్యాయి. బాలీవుడ్ నుంచి ఆల్రెడీ ఆఫర్స్ రావడం, దానికి మంచి రెమ్యునిరేషన్ తో..
బాలీవుడ్ లో జర్నీ చేయడం ఎన్టీఆర్ మొదలు పెట్టేసాడు. ఇక హాలీవుడ్ నుంచి కూడా ఎన్టీఆర్ కోసం పిలుపులు వస్తున్నాయి. ముఖ్యంగా హాలీవుడ్ దర్శకుడు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఇండియా నుంచి ఎవరినైనా ఆర్టిస్ట్ ని మీరు తీసుకుంటారా అని అడిగితే.. అతను చెప్పిన మాటకి నిజంగా మన తెలుగు ( Jr NTR gets big movie offers from Hollywood ) వాళ్ళందరూ గర్వించదగ్గ విషయం. అతనికి జూనియర్ ఎన్టీఆర్ తో కలిసి పని చెయ్యాలని ఉంది అని అన్నాడు. గార్డెన్ ఆఫ్ ది గేలక్సీ 3 ప్రమోషన్ల భాగంగా ప్రముఖ ఛానల్ ఇంటర్వ్యూకి జేమ్స్ గన్ వచ్చినప్పుడు మాట్లాడుతూ ఈ విషయాన్ని చెప్పాడు. ముఖ్యంగా హాలీవుడ్ ప్రముఖులు ఆర్ఆర్ఆర్ సినిమాలో ఎన్టీఆర్ నటనకు అవార్డు రావాల్సింది అని అనుకుంటున్న విషయాలు తెలిసి నందమూరి అభిమానుల ఆనందానికి అవధులు లేవు.
అలాగే ఆర్ఆర్ఆర్ సినిమాలో బోన్లో నుంచి పులులతో కలిసి బయటికి ఎగురుకుంటూ వచ్చిన ఎన్టీఆర్ ను చూసి.. అంత గొప్ప నటుడు ఎన్టీఆర్ తో కలిసి పనిచేయాలని ఉందని హాలీవుడ్ ప్రముఖ దర్శకుడు జేమ్స్ గన్ అన్నాడు. నిజమే మళ్ళీ ఒకసారి ఆ సినిమాలో ఎన్టీఆర్ పులులతో కలిసి, బోన్ లోంచి బయటకు ఎగురుకుంటూ వచ్చిన సీన్ చూస్తే.. మన తెలుగు హీరోలు, మన తెలుగు దర్శకులు , వాళ్ళని ప్రోత్సహిస్తున్న తెలుగు నిర్మాతలను ఖచ్చితంగా ఒక్కసారి పొగడాలని అనిపిస్తుంది. ఈ విజయం ఒక్కరిది కాదు.. అంత గొప్పగా నటించిన జూనియర్ ఎన్టీఆర్ ది.. ఎన్టీఆర్ ని అక్కడికి తీసుకుని వెళ్లిన రాజమౌళిది.. రాజమౌళి లాంటి దర్శుకుడిని సంపాదించుకున్న తెలుగు సినిమా ఇండస్ట్రీ ది.. తెలుగు సినిమా ఇండస్ట్రీ ని పోషిస్తున్న తెలుగు సినీ అభిమానులది.. మొత్తంగా మన తెలుగువారిది..