Sai Pallavi Sister: మలయాళం ప్రేమమ్ చిత్రంలో హీరోయిన్ మారిపోయిన సాయి పల్లవి అసలు మన తెలుగు కార్యక్రమమైన ఈ టీవీలో ప్రసారమయ్యే డాన్స్ ప్రోగ్రాం ఢీ షోలో పాల్గొని ఓ కంటెస్టెంట్ గా తన జీవితాన్ని ప్రారంభించింది సాయి పల్లవి.. అలా ఆ తర్వాత హీరోయిన్ గా మారిపోయింది. తను నటించిన మొదటి సినిమా మళయాళంలో ప్రేమమ్ సూపర్ డూపర్ బ్లాక్ బాస్టర్ హిట్ అవడంతో ఆమెకు వరుస అవకాశాలు లభించాయి. ఆ సినిమా హిట్ తర్వాత శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించి తెరకెక్కించినటువంటి ఫిదా చిత్రంతో తెలుగు చిత్ర పరిశ్రమలోకి పూర్తి స్థాయి హీరోయిన్ గా పరిచయం అవడమే కాకుండా తెలుగు ప్రేక్షకులకు సైతం ఎంతగానో దగ్గర అయిందని చెప్పాలి.
ఇంకా ఈ చిత్రంలో తన న్యాచురల్ అందంతో తన మాటలతో అందరినీ ఎంతగానో ఆకట్టుకుంది. ఇక ఫిదా చిత్రం బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ కైవసం చేసుకోవడంతో సాయి పల్లకి వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరమే లేకుండా పోయింది. మన తెలుగు ఇండస్ట్రీలో వరుస చిత్రాలలో అవకాశాలు లభిస్తూ తన దూకుడుని ప్రదర్శిస్తూ వచ్చింది. కేవలం నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలు మాత్రమే ఎంపిక చేసుకుంటూ తను ఉన్న హీరోయిన్ల అందరిలో ఓ ప్రత్యేకమైన దానిలా గుర్తింపు సంతరించుకొని కోట్లాది మంది అభిమానులను సంపాదించుకుంది. ఆమెను ఫాలోయింగ్ చేసేవాళ్లు అందరూ ఆమెను లేడీ పవర్ స్టార్ గా అభివర్ణిస్తూ ఉంటారు.
ఇక ఈ విషయాన్ని పక్కన పెట్టి కాస్త మన టాపిక్ విషయంలోకి అడుగు పెడితే.. సాయి పల్లవికి పూజ కన్నాన్ (Sai Pallavi Sister) అనే చెల్లి ఉంది. ఈమె చూడ్డానికి సాయి పల్లవి కన్నాన్ తెల్లగా ఆమె కంటే అందంగా చాలా బాగుంటుంది. ఈమె కూడా 2021 సంవత్సరంలో సముద్రఖని ప్రధాన పాత్ర వహించినటువంటి చితిరై సవ్వనం అనే తమిళ చిత్రం ద్వారా హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. కానీ అనుకున్నంత స్థాయిలో ఈ సినిమా హిట్ అవ్వకపోయినప్పటికీ పూజా కన్నాన్ నటనపరంగా మంచి మార్కులు వచ్చాయి. కానీ ఈ చిత్రం తర్వాత ఏమైందో తెలియదు అప్పటి నుండి ఇప్పటి వరకు ఆమె మరే చిత్రంలో కూడా కనిపించలేదు. అందుకు ఎన్నో రకాల కారణాలు ఉన్నాయని ఇటు వెబ్ మీడియా నుండి మొదలు పెడితే అటు సోషల్ మీడియా వరకు మార్మోగిపోయాయట..
అదేంటంటే ఈమెతో ఒక ప్రముఖ కోలీవుడ్ హీరో పద్ధతిగా వ్యవహరించలేదట. ప్రతి రోజు పూజా కన్నాన్ కు అసభ్యమైన మెసేజ్ లు పెడుతూ ఎంతో ఇబ్బందికరంగా చేసేవాడట.. దాంతో ఈ విషయాన్ని అంతా తెలుసుకున్న సాయి పల్లవి ఆ హీరోని అందరు చూస్తుండగానే షూటింగ్ లొకేషన్ లోకి వచ్చి మరి అతన్ని చెప్పుతో కొట్టిందని ఇండస్ట్రీలో ఎన్నో రకాల వార్తలు గుసగుసలుగా వినిపించ సాగాయి. దాంతో ఫిల్మ్ ఇండస్ట్రీ మీద విరక్తి పుట్టి ఇంత చండాలమైన ఇండస్ట్రీలోకి నేను రాను దానికి దూరంగా ఉంటానంటూ చెప్పేసి పూజా కన్నన్ అప్పటి నుంచి సినిమాలకు పూర్తిగా దూరమైనట్టు మనకు వినిపిస్తున్న సమాచారం.