Home Cinema Kalki 2898 AD : కల్కి 2898 ఎడి సినిమాలో రాజమౌళికి కావాలనే అలాంటి పాత్ర...

Kalki 2898 AD : కల్కి 2898 ఎడి సినిమాలో రాజమౌళికి కావాలనే అలాంటి పాత్ర ఇచ్చారట.. ఇక సంచలనమే..

in-prabhas-movie-kalki-2898-ad-rajamouli-had-a-great-role

Rajamouli : టాలీవుడ్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సినిమా ఎప్పుడు వస్తదా ఎప్పుడొస్తదా అని అభిమానం ఎంతో ఆత్రంగా ఎదురుచూస్తున్నారు. ఇటీవల వచ్చి వెళ్లిన ఆదిపురుష్ సినిమా ఫెయిల్ అయినప్పటికీ.. అందులో ( Kalki 2898 AD Rajamouli ) ప్రభాస్ నటన గాని, ప్రభాస్ రాముడు గా సూటైన విధానం గాని అందరికీ చాలా నచ్చింది. ప్రభాస్ ఇలాంటి పాత్రలకు ఎంత బాగా సూట్ అవుతాడో కొత్తగా చెప్పుకోవాల్సిన పనిలేదు. బాహుబలి తోనే ప్రభాస్ అద్భుతమైన నటుడని అర్థమైపోయింది. ఇక ప్రభాస్, నాగ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ వరల్డ్ సినిమా కల్కి 2898 ఈ సినిమాపై ప్రభాస్ అభిమానులకు భారీ అంచనాలు ఉన్నాయి.

Kalki-2898-AD-Rajamouli-movie

ఎందుకంటే ఈ సినిమాని భారీ బడ్జెట్ తో రూపొందిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా వ్యాపారం జరగాలని ఆశిస్తున్నారు. ఇండియన్ మైథాలజికల్ క్యారెక్టర్స్ ని ఫ్యూచర్స్టిక్ కాన్సెప్ట్ తో.. సినిమాలో విజువల్ వండర్ గా ఆవిష్కరించే ( Kalki 2898 AD Rajamouli ) గొప్ప ప్రయత్నం చేస్తున్న ఈ సినిమాపై.. సినీ అభిమానులకి సినీ రంగానికి కూడా ఎంతో భారీ అంచనాలతో పాటు ఆసక్తి కూడా ఉంది. ఇక ఈ సినిమా పరంగా దర్శకుడు నాథ్ అశ్విన్ పూర్తిగా ఒకసారి కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తున్నాడు. కంప్లీట్ గా మోషన్ క్యాప్చర్ ఇమేజనరీ వరల్డ్ తో ఈ కథ మొత్తం నడిపించబోతున్నాడు. ఈ సినిమా టీజర్ ఇప్పటికే అందరి ఆదరణ పొందింది. ఇక ఈ సినిమాలో దీపికా పదుకొనే హీరోయిన్గా, దిశా పటాని లాంటి స్టార్ కాస్టింగ్ తో రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో అమితాబచ్చన్ కూడా ఒక ముఖ్యమైన పాత్రను నటిస్తున్నారు.

See also  Samantha : నరేష్ మళ్ళి పెళ్లి ఫట్ అయినా.. సమంత మళ్ళి ప్రేమ ఆ హీరో తో మొదలు..

Kalki-2898-AD-Rajamouli-prabhas

అన్నిటికంటే ముఖ్యంగా ఈ సినిమాలో విలన్ గా కమలహాసన్ నటించిగా.. కమల్ హాసన్ మొదటిసారిగా విలన్ గా ఇంకొక హీరోకి నటిస్తున్నాడు. ఇంతకుముందు విలన్ పాత్రలు చేసినా కూడా అది ఆయనే హీరోగా నటించిన సినిమాల్లో మాత్రమే చేశారు. తెలుగు ఆడియో కమలహాసన్ అంటే ఎంత ఇష్టమో మనందరికీ తెలిసిందే. అలాంటి కమల్ హాసన్ ఇన్నాళ్ల తర్వాత మళ్లీ తెలుగు వాళ్ళకి విలన్ గా కనిపించబోతున్నాడు. ఇన్ని ఆసక్తికరమైన విషయాలని కలిగి ఉన్న ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఎదురుచూస్తున్నారు. ఇది వచ్చే ఏడాది మే 9వ తేదీన ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. అయితే ఈ సినిమాలో రాజమౌళి నటిస్తున్నాడని ఇప్పటికే అనేక వార్తలు వచ్చాయి. రాజమౌళి అంటే ఇప్పుడు ప్రపంచం మొత్తానికి ఒక బ్రాండ్. అలాంటి రాజమౌళికి ఎలాంటి క్యారెక్టర్ ఇస్తున్నారు అనేదానిపై ఇప్పుడు వార్తలు విపరీతంగా హల్చల్ చేస్తున్నాయి.

See also  Adipurush Review and Rating : ఆదిపురుష్ సినిమాని ఓం రౌత్ అందుకే తీసాడా.. రివ్యూ మరియు రేటింగ్..

Kalki-2898-AD-Rajamouli-prabhas-movie

ఈ సినిమాలో రాజమౌళికి సైంటిస్ట్ గా ఒక పాత్రనిస్తున్నారంట. ఇది తెలిసిన వెంటనే నెటిజనులు ఆనందంతో పొంగిపోతున్నారు. రాజమౌళికి సరైన పాత్ర ఇచ్చారని అనుకుంటున్నారు. ఎందుకంటే.. ఆయన నిజంగానే ఒక సైంటిస్ట్.. ఏ సినిమాని ఎలా తీస్తే ఎంతమంది ఇష్టపడతారు, అది ఎంత బ్లాక్ బస్టర్ హిట్ అవుతది అనేది ఆయన ఒక ( Kalki 2898 AD Rajamouli ) సైంటిస్టుల అన్ని తనలో తాను అనుకొని, పరిశోధించి తెలుసుకొని దాన్ని ఇంప్లిమెంట్ చేస్తాడు. అందుకే ఇంతవరకు రాజమౌళి జీవితంలో ఫెయిల్ అయిన సినిమా అంటూ లేదు. ఏ బడ్జెట్ తగ్గట్టు ఆ బడ్జెట్ పరంగా అతను సైంటిస్టులకు దానిమీద పరివేక్షణ చేసి అప్పుడు సినిమా తీస్తాడు కాబట్టి మంచి పాత్ర ఇచ్చారు అనుకుంటున్నారు. అంతేకాకుండా ప్రపంచవ్యాప్తంగా మంచి పేరున్న రాజమౌళి సినిమాలో సైంటిస్ట్ గా నటిస్తున్నాడు అని తెలిస్తే.. ఈ సినిమా ప్రమోషన్ కూడా హైలెట్ గా ఉంటుందని.. కచ్చితంగా ప్రపంచవ్యాప్తంగా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యి సంచలనం క్రియేట్ చేస్తుందని ప్రభాస్ అభిమానులు అనుకుంటున్నారు.