Hi Nanna Trailer Review : నాచురల్ స్టార్ నాని హీరోగా, మృణాల్ ఠాకూర్ హీరోయిన్గా, శౌర్యవ్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం హాయ్ నాన్న. ఈ సినిమా డిసెంబర్ 7వ తేదీన ప్రేక్షకుల ముందు వచ్చేందుకు సిద్ధంగా ఉంది. ఈరోజు ఈ సినిమా ట్రైలర్ ని రిలీజ్ చేశారు. ఈ సినిమా ట్రైలర్ ప్రేక్షకుల్ని చాలా బాగా ఆకట్టుకుంది. ఇక నాని నటించిన ప్రతి సీన్ ట్రైలర్ లోనే అదిరిపోయింది అంటే.. ఇంక సినిమాలో ఇంకెంత ( Hi Nanna Trailer Review ) సెంటిమెంట్ గా ఉంటుందో అనిపిస్తుంది. ట్రైలర్లో తన కూతుర్ని ఎంతో బాగా చూసుకుంటున్న తండ్రిగా.. తండ్రి కూతుర్లకు మంచి బౌండింగ్ ఉన్న రిలేషన్ గా చూపిస్తూ.. కూతురికి కథలు చెబుతూ పెంచుతుంటాడు కానీ ఆ అమ్మాయి తండ్రి చెప్పే కథల్లో తల్లి పాత్ర గురించి తాపత్రయపడుతూ ఉంటుంది.
ఎక్కడ తప్పు చేశాను? నా ప్రేమలో ఏం లోపం అయిందో, తగ్గిందో తెలియడం లేదు.. అని నాని మాట్లాడిన సెంటిమెంట్ డైలాగ్స్ చెబుతూ నాని యాక్షన్ తో ట్రైలర్లు అదిరిపోయింది. హీరోయిన్ మృణాల్ ఠాకూర్.. నాని కూతురితో ( Hi Nanna Trailer Review ) ఫస్ట్ పరిచయం.. ఆ తర్వాత నానితో పరిచయం ఏర్పడి నాని ప్రేమలో పడినట్టు కనిపిస్తుంది. ఇక ట్రైలర్ విషయానికొస్తే ప్రేక్షకులు 100% సాటిస్ఫై అయ్యారు. సినిమా కచ్చితంగా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని.. సెంటిమెంట్తో అందరినీ కన్నీళ్లు తెప్పించే తీరులో ట్రైలర్ ఉందని అనుకుంటున్నారు.
ఈ ట్రైలర్ చూసిన తర్వాత చాలామంది గుర్తొస్తున్నది హిందీ సీరియల్ ” ఏ హాయ్ మోహబత్ ” . ఈ సీరియల్ లో కొన్ని సీన్స్, మూల కథ ట్రైలర్ ఉన్నట్టు అనిపించాయి.అయితే కొంచెం కొంచెం తేడాలు ఉన్నాయి కానీ.. మూల కథ అలాగే అనిపిస్తుంది. ఆ సీరియల్ లో తండ్రి దగ్గర కూతురు ఉంటుంది కానీ.. కూతురుతో మంచి రిలేషన్ ( Hi Nanna Trailer Review ) ఉండదు. ఇందులో నానికి కూతురుతో మంచి రిలేషన్ ఉంది. చాలా బాగా పెంచుతాడు. కానీ తల్లి లేదని లోటు కనిపిస్తూ ఉంటుంది. ఆ సీరియల్ లో కూడా ఆ పాప తల్లితండ్రి ప్రేమని తనన కలిసిన హీరోయిన్ లో ఫీల్ అవుతుంది. ఆ సీరియల్ లో కుక్కతో ఒక కారు కింద పడిపోతున్న పాపని హీరోయిన్ పట్టుకొని కాపాడుతుంది. అక్కడి నుంచి వాళ్ళిద్దరికీ ఫ్రెండ్షిప్ మొదలవుతుంది. అదే హాయ్ నాన్న ట్రైలర్ లో కూడా చూపించారు.
అలాగే నాని మొదటి భార్య నానిని వదిలేసిందని ట్రైలర్లో అర్థమవుతుంది. మరి ఆ సీరియల్ లో కూడా అదే జరుగుతుంది. కాకపోతే సేమ్ కాకపోయినా కూడా ఇంచుమించుగా అలా అనిపిస్తుంది. ఒకవేళ అలా అనిపించినా కూడా ఆ సీరియల్ కూడా చాలా సూపర్ హిట్ అయింది.ఆ సీరియల్ 2013 లో వచ్చినప్పటికీ.. ఇప్పటికీ ఆ సీరియల్ ఎవరు మరిచిపోయే పరిస్థితి లేదు. అలాగే ఈ సినిమా కూడా బ్లాక్ బస్టర్ హీట్ అవుతుందని, కచ్చితంగా అలాంటి సెంటిమెంట్తో ఆ సీన్స్ ని కరెక్ట్ గా పండించగలిగితే మాత్రం ఆడియన్స్ చాలా బాగా కనెక్ట్ అవుతారని అనుకుంటున్నారు. ఈ సినిమా ఎంత హిట్ అవుతుందో డిసెంబర్ 7వ తేదీన థియేటర్లో రిలీజ్ అయిన తర్వాత అర్థమవుతుంది.