Home Cinema Heros Marriage: వచ్చే నెల జూన్ లో ఇంతమంది హీరోల పెళ్లిళ్లు జరగనున్నాయా.? ఫ్యాన్స్ కు...

Heros Marriage: వచ్చే నెల జూన్ లో ఇంతమంది హీరోల పెళ్లిళ్లు జరగనున్నాయా.? ఫ్యాన్స్ కు పండగే..

Heros Marriage: సినీ పరిశ్రమలో హీరోల, హీరోయిన్ల పెళ్లిళ్లు చేసుకునే విషయాలను ఎంతో రహస్యంగా వ్యవహరిస్తూ దాస్తుంటారు. ఇక వీరి వివాహ విషయం ఎంత దగ్గర పడుతున్నప్పటికీ రేపు పెళ్లి పీటలు ఎక్కుతున్నారు అనంగా కూడా బయటకి చెప్పడానికి గోప్యంగా ఉంచుతారు. మరి వీళ్ళ వివాహ విషయాన్ని ఎందుకంత రహస్యంగా ఉంచుతారు అన్న విషయం తెలియదు కానీ చాలామంది సెలబ్రిటీలు ఫాలో అయ్యే తీరు మాత్రం ఇదే.. కాగా మనకొచ్చిన సమాచారం ప్రకారం వచ్చే నెలలో చాలామంది నటీనటులు పెళ్లి పీటలు ఎక్కబోతున్నారంటూ ఇప్పటికే ఎన్నో రకాల వార్తలు వినిపించాయి. ఇదే నేపథ్యంలో జూన్ నెలలో మన టాలీవుడ్ నుండి ముగ్గురు హీరోలు వివాహం చేసుకోబోతున్నారంటూ ప్రస్తుతం అయితే ఒక వార్త నెట్టింట తెగ తిరుగుతూ సందడి చేస్తూ ఉంది. మరి వచ్చే నెల జూన్ లో ఏడడుగులు వేయబోతున్న ఆ జంటలు ఎవరనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం.

See also  Kethika Sharma: మరీ అంతలా కేతిక శర్మను మొత్తం ఆ స్టార్ డైరెక్టర్ కొడుకు వాడుకున్నాడా.?

heros-who-are-getting-ready-for-their-marriage-in-june-here-is-the-list

శర్వానంద్ రక్షిత రెడ్డి: శర్వానంద్ అలాగే సాఫ్ట్వేర్ ఇంజనీర్ రక్షత రెడ్డి చాలా కాలం నుంచి ప్రేమించుకుంటున్నారన్న విషయం మనందరికీ తెలిసిందే.. ఇక ఈ విషయాన్ని ఇన్ని రోజులు ఎంతో సీక్రెట్ గా దాచిపెట్టిన ఈ జంట మొన్న జనవరి నెలలో నిశ్చితార్థం చేసుకుని అందరిని ఒక్కసారి ఆశ్చర్యానికి గురి చేశారు. అయితే జనవరి నెలలో నిశ్చితార్థం చేసుకున్న ఈ జంట పెళ్లి గురించి మాత్రం ఇప్పటివరకు డేట్ ఫిక్స్ చేయలేదు. దాంతో ఈ జంట బ్రేకప్ చెప్పుకున్నారని చాలామంది అనుకున్నారు. కానీ అనూహ్యంగా వీళ్ళిద్దరి వివాహం జూన్ నెలలో జరగబోతుందంటూ సమాచారం తెలిసింది. ఇక మీడియాలో వస్తున్న సమాచారం ప్రకారం వీళ్ళిద్దరూ జూన్ మూడవ తారీఖున అంగరంగ వైభవంగా రాజస్థాన్ లీలా ప్యాలెస్ లో వివాహం చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది..

See also  ఆ స్టార్ హీరో నేను జైల్లో బాత్రూంలు కడిగానంటూ షాకింగ్ కామెంట్స్. వైరల్..

heros-who-are-getting-ready-for-their-marriage-in-june-here-is-the-list

అడివి శేష్ అక్కినేని సుప్రియ: ఇక అడవిశేష్ గూఢచారి చిత్రంలో హీరోగా నటించాడు  ఇదే చిత్రంలో అక్కినేని సుప్రియ ఓ కీలక పాత్రలో నటించింది. ఈ చిత్రంలో నటించిన సమయంలో నుండే అడవి శేష్ సుప్రియ మధ్యల చాలా మంచి బంధం ఏర్పడింది. దాంతో వీళ్లిద్దరి మధ్య ఏదో నడుస్తుందని అంతా భావించారు. ఇక ఇదే కాకుండా అక్కినేని కుటుంబంలో జరిగే ప్రతి చిన్న ఫంక్షన్ లో కూడా అడవి శేష్ పాల్గొంటూ ఉంటాడు అయితే ప్రస్తుతం అయితే మనకు అందిన తాజా సమాచారం ప్రకారం అక్కినేని సుప్రియ అడవి శేష్ వీళ్లిద్దరూ జూన్ 16న పెళ్లి చేసుకోబోతున్నారంటూ ఓ వార్త అయితే మనకు వినిపిస్తుంది..

heros-who-are-getting-ready-for-their-marriage-in-june-here-is-the-list

వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి: మెగా హీరో వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠిల మధ్య ఎప్పటి నుంచో సీక్రెట్ ఎఫైర్ నడుస్తుందని వార్తలు ఇప్పటికే చాలా వినిపించాయి. కానీ ఆ వార్తలు అన్నిటిని ఎప్పటికప్పుడు తిప్పికొడుతూనే ఉంది లావణ్య త్రిపాఠి. వీళ్ళిద్దరి మధ్యల అనుమానం రాకూడదని ఎన్నిసార్లు లావణ్య అలాంటి వార్తలను ఖండించినప్పటికీ వీళ్ళపై వస్తున్న వార్తలు మాత్రం ఆగడం లేదు. తాజాగా పెద్ద పెద్ద మీడియా సంస్థలు కూడా వీలై ఎంగేజ్మెంట్ జూన్లో జరగబోతుంది అంటూ క్లారిటీ ఇవ్వడంతో.. ప్రస్తుతం అది అందరూ నిజమనే భావిస్తున్నారు. దాంతో ఆ మీడియా సంస్థలకు అందిన సమాచారం మేరకు వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి ఇద్దరూ జూన్ 17న నిశ్చితార్థం చేసుకుంటారని.. ఆ తర్వాత త్వరలోనే పెళ్లి పీటలు కూడా ఎక్కబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఒకే నెలలో ఎంతమంది టాలీవుడ్ హీరోల (Heros Marriage) పెళ్లిళ్లు జరుగుతున్న తరుణంలో వీళ్ళ అభిమానులు ఎగిరి గంతేస్తున్నారు.