Home Cinema Naga Shourya: హీరో నాగ శౌర్య రోడ్డుమీద ఓవరాక్షన్..? లవర్స్ ను ఆపి మరీ రోడ్డుమీద...

Naga Shourya: హీరో నాగ శౌర్య రోడ్డుమీద ఓవరాక్షన్..? లవర్స్ ను ఆపి మరీ రోడ్డుమీద గొడవకు దిగిన వీడియో వైరల్..

Hero Naga Shourya Argument: ఇప్పుడున్న కుర్ర హీరోలలో ఓ కొత్త కథతో మన ముందుకి రావడానికి ఎప్పటికప్పుడు ప్రయత్నాలు చేస్తుండే యువ హీరోలలో నాగశౌర్య ఒకరు. ఇండస్ట్రీకి చందమామ కథలు అనే సినిమా ద్వారా హీరోగా పరిచయం నాగశౌర్య ఆ తర్వాత ఊహలు గుసగుసలాడే అనే సినిమాతో సూపర్ హిట్ కొట్టి తెలుగు చిత్ర పరిశ్రమలో తానేంటో నిరూపించుకొని తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపుని నిలదొక్కుకున్నాడు. ఇక ఆ తర్వాత ఈయన జీవితంలో చలో అనే సినిమాతో ఆట పెద్ద గుర్తింపు దక్కింది. దాంతో ఒకసారి గా ఈ యువ హీరో మార్కెట్ తారాస్థాయికి చేరింది.

hero-naga-shourya-argument-on-road-video-goes-viral

కానీ ఆ తర్వాత నటించిన సినిమాలు ఏవి అంత పెద్దగా హిట్ సాధించలేకపోయాయి. కానీ ఏది ఏమైనప్పటికీ నాగశౌర్యకు ఇటు యువతలో అటు లేడీస్ లో కూడా ఎంతో మంచి గుర్తింపు సాధించుకున్నాడు. ఇక ఈ మధ్యనే పెళ్లి చేసుకున్న ఈ యంగ్ హీరో చేతులో ప్రస్తుతం మూడు సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. కానీ అవి ఎప్పుడు విడుదలవుతాయో వాటికి సంబంధించిన అప్డేట్స్ ఇంతవరకు రాలేదు. అయితే రీసెంట్ గా హైదరాబాద్ ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఓ వీడియోలో నాగ శౌర్య హల్చల్ చేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

See also  Keerthy Suresh: జాన్వీ కపూర్ మొగుడుతో అలాంటి స్థితిలో అడ్డంగా దొరికిపోయిన కీర్తి సురేష్.

hero-naga-shourya-argument-on-road-video-goes-viral

నాగశౌర్య హైదరాబాద్ ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ప్రేమజంటతో వ్యవహరించిన తీరు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యింది. ప్రేమికుల మధ్యలో వారి అనుమతి లేకుండా, వారి ప్రమేయం లేకుండా తల దూర్చకూడదని పెద్దలు చెప్పిన మాటలు అయితే మరొకసారి గుర్తుచేసింది నేడు అదే నాగశౌర్య విషయంలో.. ప్రేమికుల అన్న తర్వాత గొడవలు పడడం, కొట్టుకోవడం, తిట్టుకోవడం, అలగడం మొదలగునవి సహజం. అలాంటి ప్రేమ జంటలు నాగశౌర్యకి ఎదురయ్యాయి. ఒక అబ్బాయి ఒక అమ్మాయి పైన చేయి చేసుకోవడానికి చూసిన నాగశౌర్య వెంటనే కారు దిగి వాళ్ళ వద్దకు వచ్చి అమ్మాయి మీద చేయి వేసి ఎందుకు చేస్తున్నావని అతడి బాయ్ ఫ్రెండ్ ని అడిగాడు.

See also  Ambajipeta Marriage Band Teaser : అంబాజీపేట మ్యారేజ్ బ్యాండు లో ఆ సీన్ వెనుక రహస్యం.. టీజర్ రివ్యూ..

hero-naga-shourya-argument-on-road-video-goes-viral

అప్పుడు అతని భాయ్ ఫ్రెండ్ నా లవర్ నా ఇష్టం నీకెందుకు అన్నా అని సమాధానం ఇవ్వడంతో.. నాగశౌర్యకు కోపం వచ్చి మర్యాదగా ఆ అమ్మాయికి క్షమాపణలు చెప్పు అంటూ అబ్బాయితో గొడవకు దిగాడు నాగ శౌర్య. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారి వైరల్ అయింది. వాళ్ళిద్దరూ గొడవ పడుతున్న (Hero Naga Shourya Argument) వీడియో చూసి చాలామంది నెటిజన్స్ రకరకాలుగా స్పందిస్తూ కామెంట్ చేస్తున్నారు.. లవర్స్ మధ్య గొడవలు ఉండడం కామన్ వాళ్ల మధ్య ఎన్నో ఉంటాయి నీకెందుకు భయ్యా అని నాగశౌర్యను కొందరు నిలదీస్తే, మరి కొందరు ఇది పబ్లిసిటీ స్టంట్ ఇలాంటి ఎన్ని చూడలేదు భయ్యా అని మరికొందరు కామెంట్స్ చేస్తుంటే, ఇంకొందరు అమ్మాయి పట్ల నాగశౌర్య చూపించే గౌరవానికి సెల్యూట్ చేయాల్సిందే అంటూ భిన్న విభిన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. చూడాలి మరి ఈ వీడియో పై నాగశౌర్య ఏమని స్పందిస్తాడో..