Home Cinema వాటికి కూడా సెన్సార్ ఉండాలి అంటున్న హీరోయిన్

వాటికి కూడా సెన్సార్ ఉండాలి అంటున్న హీరోయిన్

వాటికి కూడా సెన్సార్ ఉండాలి అంటున్న హీరోయిన్

తక్కువ ఖర్చుతో ఎక్కువ వినోదం పైగా కుటుంబంలో అన్ని వయసుల వారిని ఆకట్టుకునే వినోదం అంటే సినిమానే అని చెప్పాలి. భారతదేశంలో సినిమా అంటే విపరీతమైన క్రేజ్ ఉంది. కానీ అది మెల్లమెల్లగా తగ్గుతూ వస్తుందనే అనుకోవాలి. ఎందుకంటే ఓటిటి వచ్చిన తరవాత ఆడియన్స్ సినిమాలతో పాటు సీరియల్స్ కి, వెబ్ సిరీస్ కి కూడా ఎక్కువగా అలవాటు పడుతున్నారు. ఏడాదికి ఇంత అని యాప్ కి డబ్బులు చెల్లిస్తే చాలు, ఏడాది అంతా చక్కగా అందులో వచ్చే సినిమాలు, సీరియల్స్, వెబ్ సీరీస్ అన్ని చూడవచ్చు.

See also  Naga Chaitanya - Samantha : పెళ్లయిన తరవాత ఆ ఒక్క పనీ చేయకే వీళ్ళిద్దరూ విడిపోయారంట..

ఇప్పుడు వెబ్ సీరీస్ కి మంచి డిమాండ్ వచ్చింది. మంచి కథని సినిమాలో కంటే బాగా తియ్యడానికి, ప్రేక్షకుడిని ఆకట్టుకోవడానికి వెబ్ సీరీస్ బాగా ఉపయోగపడతున్నట్టు కనిపిస్తుంది. వెబ్ సీరీస్ డిమాండ్ ఎంతగా పెరిగిందంటే, ఫేమస్ హీరోస్ హీరోయిన్స్ కూడా వీటిలో నటిస్తున్నారు. వీటి వలన ఓటిటి కి కూడా మంచి ఆదాయాలు వస్తున్నాయి. అయితే వెబ్ సీరీస్ అనగానే అడల్ట్ కంటెంట్ అని గుర్తుకువస్తుంది. వెబ్ సీరీస్ ఎక్కువగా ఎడల్ట్ కంటెంట్ మీదనే తీస్తున్నారు. ఒక్క భాష కాదు, అన్ని భాషల్లోనూ తీస్తున్నారు.

See also  Comedian Manobala: ప్రముఖ స్టార్ కమెడియన్ మనోభాల మృతి.. సినీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం..

స్టోరీ ఆఫ్ థింగ్స్ అనే వెబ్ సిరీస్ తో సీనియర్ నటి గౌతమి కూడా ఆడియన్స్ ముందుకు రాబోతుంది. ప్రస్తుతం గౌతమి కేంద్ర సెన్సార్ బోర్డ్ సభ్యురాలిగా ఉన్నారు. ఆమె తాను నటించబోయే వెబ్ సీరీస్ గురించి మాట్లాడుతూ… వెబ్ సిరీస్ కి కూడా సెన్సార్ అనేది ఉండాలని అన్నారు. ముందు ముందు వెబ్ సీరీస్ కి కూడా సెన్సార్ వచ్చే అవకాశం ఉందనే అభిప్రాయాన్ని ఆమె మాటల్లో వ్యక్తం చేశారు. తాను నటిస్తున్న స్టోరీ ఆఫ్ థింగ్స్ వెబ్ సిరీస్ మంచి ఫీల్ ఉన్న సిరీస్ గా పేరు వస్తాదని ఆమె చెప్పారు. కొన్ని వెబ్ సీరీస్ మరీ అడల్ట్ కంటెంట్ గా ఉండటంతో సెన్సార్ ఉంటేనే మంచిదని నెటిజనులు కొందరు ఫీల్ అవుతున్నారు.