ఉదయం లేవగానే వీటిని తినండి ఇక డాక్టర్లతో పనే ఉండదు.
గోరు వెచ్చని నీరు:
ఉదయాన్నే పరిగడపున గోరురెచ్చని నీళ్ళతో లాభాలు బోలెడున్నాయి. రక్త ప్రసరణ సమృద్దిగా ప్రసరణ అవుతుంది. జీర్ణ వ్యవస్థ సంబంధిత సమస్యలు కడుపునొప్పి, ఉదర సమస్యలు, అజీర్తి, ఊభకాయం వంటి సమస్యల నుండి ఉపశమనం. మూత్ర సంబంధిత వ్యాదులు ఇట్టే నయమైపోతాయి. వరుసగా వారం రోజులు గోరువెచ్చని నీళ్ళు తాగడం వల్ల మంచి ఫలితాలుంటాయి. నోటిపూత సమస్యతో బాధపడేవారికి తక్షణ ఫలితాలను ఇస్తుంది. గొంతులో గరగర అనిపించినా, గొంతులో మంటగా ఉన్నా, నోటి సమస్యలతో బాధపడేవారు గోరువెచ్చని నీటిని తాగడం వల్ల అధ్భుత ఫలితాలుంటాయి. నోటికి సంబంధిచి ఏదైనా ఇన్ఫెక్షన్లు ఉన్నా ఈ గోరువెచ్చని నీళ్ళతో వెంటనే ఉపశమనం పొందవచ్చు.
నానబెట్టిన బాదం పప్పు:
బాదం పప్పు పోషకాలకి అలాగే ఖనిజలకు నిలయంగా ఉంది, మనం ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే నిత్యం గుప్పెడు బాదం పప్పులను తినాలి ఒకవేళ బాదం పప్పు తినబుద్ది కాకపోతే రాత్రి నానబెట్టుకుని పరిగడపున వాటి తోలు తీసి తింటే ఎంతో మంచిది ఇలా తినడం వలన తెలివి తేటలు పెరుగుతాయి. మెదడు చురగ్గా పనిచేస్తుంది. నానబెట్టిన బాదం గింజల వలన అత్యంత గుర్తింపు పొందిన ప్రయోజనాలు మెదడు యొక్క పనితీరు జ్ఞానము మరియు జ్ఞాపకశక్తి పెంపొందించడమే, అలాగే మతిమరుపు ఉంటే బాదం పప్పు తినడం వల్ల తొలగిపోతుంది. బరువు తగ్గాలనుకునే వారు కూడా బాదం పప్పులను తినాలి. కొలెస్ర్టాల్ స్థాయిలను మన శరీరంలో తగ్గించడానికి సహయపడుతుంది. డయాబెటిస్ ఉన్న రోగులు బాదం తినడం వలన ఆరోగ్యానికి మంచిది. వివిధ రకాల క్యాన్సర్లను ఇది నిర్మూలిస్తుంది.
అరటిపండ్ల ఉపయోగాలు:
మన జీర్ణక్రియ ప్రక్రియలో అరటిపండు మంచిగా సహకరిస్తుంది మలం మృదువుగా రావడానికి సహకరిస్తుంది. అరటిపండులో కరిగే మరియు కరగని ఫైబర్ లు పుష్కలంగా ఉన్నాయి. మన శరీరానికి కావలసిన కాల్షియం అందిచండం వల్ల ఎముకులు దృఢంగా చేస్తాయి. అధిక ఐరన్ ఉండడం వల్ల ఇది రక్తహీనతను నిర్వహించడానికి సహకరిస్తుంది. అరటిపండులో ఉండే యాంటీఆక్సిడేట్లు, లుటిన్, విటమిన్ ఎ మరియు కెరోటినాయిడ్స్ పుష్కలంగా ఉన్నాయి ఇవి మన చూపు మంచిగా కనిపించడానికి సహయపడుతుంది.
ఎండుద్రాక్ష ఉపయోగాలు:
ఎండుద్రాక్షలో ఐరన్, పొటాషియం, మెగ్నీషయం, ఫైబర్ అధికంగా ఉంటాయి. అందువల్ల ఇవి ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. ఇందులో వివిధ రకాలున్నాయి. అవి గొల్డెన్, గ్రీన్ మరియు బ్లాక్ మొదలైనవి ఉన్నాయి. ఎండుద్రాక్షలో ఉండే ఫైబర్ జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది. ఇందులో న్యూట్రీషియన్స్ అధికంగా ఉండడం వల్ల వ్యాధినిరోధక శక్తి పెంపొందిస్తుంది. ఎండు ద్రాక్షలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు బ్యాడ్ స్మెల్ ను నివారించడంలో అధ్భుదంగా పనిచేస్తుంది. ఎండు ద్రాక్షలో కాల్షియం మరియు మైక్రో న్యూట్రీషియన్స్ అధికంగా ఉండడం వల్ల ఎముకలకు ఆరోగ్యాన్ని చేకూరుస్తుంది. నానబెట్టిన ఎండుద్రాక్షల నీటిని తీసుకోవడం వల్ల అనీమియా సమస్య ఉండదు. శరీరంలో టాక్సిన్ ను నివారించడంలో ఎండు ద్రాక్ష గ్రేట్ గా సహయపడుతుంది. ఎండు ద్రాక్షలో ఫైబర్ కంటెంట్ అధికంగా ఉండడం వల్ల కొలెస్ర్టాల్ లెవల్స్ ను కంట్రోల్ చేసి హర్ట్ డిసీస్ లను తగ్గిస్తుంది. ఎండుద్రాక్షలో ఉండే న్యాచురల్ ప్రక్టోజ్ శరీరానికి ఎనర్జీని అందిస్తుంది. కిడ్నీ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్దుంది. కంటిచూపులను మెరుగుపరుస్తుంది.