Home Cinema Mannara Chopra: మన్నారా చోప్రా ని ముద్దుపెట్టుకోవడం పై డైరెక్టర్ రవి కుమార్ సెన్సేషనల్ కామెంట్స్..!

Mannara Chopra: మన్నారా చోప్రా ని ముద్దుపెట్టుకోవడం పై డైరెక్టర్ రవి కుమార్ సెన్సేషనల్ కామెంట్స్..!

Director Ravi Kumars: ఈ మధ్య కాలం లో బోల్డ్ గా ఉంటున్నాం అంటూ కొంత మంది హీరోయిన్లు మరియు కొంత మంది దర్శకులు చేస్తున్న పనులు చూసేందుకు చాలా అసహ్యాన్ని కలిగిస్తున్నాయి. సోషల్ మీడియా కాలం లో ఏమి చేసిన చెల్లుతుంది అన్నట్టుగా కొంత మంది వ్యవహరిస్తున్న తీరు పై నెటిజెన్స్ విరుచుకు పడుతున్నారు. పబ్లిసిటీ కోసం మన తెలుగు సంప్రదాయాలను కాలరాసే విధంగా ఈ మధ్య కొంత మంది ప్రవర్తిస్తున్నారని అంటున్నారు.

director-ravi-kumars-sensational-comments-on-kissing-mannara-chopra

ఇక పోతే రీసెంట్ గా ప్రముఖ దర్శకుడు రవి కుమార్ మన్నారా చోప్రా ని ముద్దు పెట్టుకున్న వీడియో సోషల్ మీడియా లో వైరల్ గా మారి వివాదాలకు దారి తీసింది. కూతురు వయస్సు ఉన్న అమ్మాయి ని పబ్లిక్ గా అలా ముద్దు పెట్టుకోవడం చూసేందుకు చాలా ఇబ్బందిగా ఉంది అంటూ కామెంట్ చేస్తున్నారు. మన్నారా చోప్రా ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంక చోప్రా కి కజిన్ అవుతుంది అనే విషయం మన అందరికీ తెలిసిందే. ఈమె తెలుగు లో గతంలో జక్కన్న, తిక్క , రోగ్ వంటి సినిమాల్లో హీరోయిన్ గా నటించింది.

See also  Ram Charan - Sreeleela : జాను కన్నా శ్రీలేలే నాకు మిన్న అంటున్నా రామ్ చరణ్!

director-ravi-kumars-sensational-comments-on-kissing-mannara-chopra

ఇప్పుడు రీసెంట్ గా ఈమె రాజ్ తరుణ్ తో కలిసి ‘తిరగబడరా సామీ’ అనే సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాకి దర్శకుడిగా రవి కుమార్ వ్యవహరించాడు. గతం లో (Director Ravi Kumars) రవి కుమార్ ‘యజ్ఞం’, ‘పిల్లా నువ్వు లేని జీవితం’ వంటి సూపర్ హిట్ సినిమాలు చేసాడు. ఆ తర్వాత ఎందుకో ఆయనకి ఆశించిన స్థాయిలో అవకాశాలు రాలేదు. ఇకపోతే రీసెంట్ గా మన్నారా చోప్రా కి ముద్దు పెట్టడం , దానికి సోషల్ మీడియా లో విపరీతంగా ట్రోల్ల్స్ రావడం పై రవి కుమార్ స్పందించాడు.

See also  Rajamouli: ఆస్కార్ తో అందరూ ఆనందంగానే ఉన్నారు గాని.. పాపం రాజమౌళికి జరిగింది అంత ఘోరమా?

director-ravi-kumars-sensational-comments-on-kissing-mannara-chopra

ఆయన మాట్లాడుతూ ‘నాకు, ఆ అమ్మాయికి , ఆ అమ్మాయి కుటుంబానికి లేని ఇబ్బంది మీకు ఎందుకు..?, మన్నారా నాకు కూతురు లాంటిది, ఆమె పై నాకు ఎంతో ప్రేమ , అభిమానం ఉంది , ఒక కూతురు ని తండ్రి ఎలా ముద్దు పెట్టుకుంటాడో, నేను కూడా అలాగే పెట్టుకున్నాను, దానిని తప్పుగా చూడాల్సిన అవసరం లేదు’ అంటూ కామెంట్ చేసాడు. ఆయన మాట్లాడిన ఈ మాటలపై నెటిజెన్స్ ఇంకా మండిపడుతున్నారు. వీడియో లో ఆ అమ్మాయి ఇబ్బంది పడడం స్పష్టం గా కనిపిస్తుంది, అందులో మాకు డైరెక్టర్ కామం తప్ప మరొకటి కనిపించలేదు అంటూ కామెంట్ చేస్తున్నారు నెటిజెన్స్.