
Chiranjeevi – Pawan Kalyan : మెగాస్టార్ చిరంజీవిని అన్నయ్య అన్నయ్య అంటూ అభిమానులు ఎంత ప్రేమగా పిలుస్తారో మనందరికీ తెలిసిందే. అలాగే ఆయనకు కూడా ఆయన అభిమానులు అంటే పిచ్చి ప్రేమ. తనను అన్నయ్య అన్నయ్య అని వాళ్ళ అభిమానులు పిలిచే కొద్ది ఆయన ఇంకా హుషారు తెచ్చుకుని ఇంకా ( Babi speech about Chiranjeevi and Pawan Kalyan ) కష్టపడి సినిమాల్లో వాళ్ళకి నచ్చేటట్టుగా నటిస్తూ ఉంటాడు. బయట అభిమానులు మాత్రమే కాకుండా.. ఇంట్లో ఉన్న తమ్ముళ్లు ఇద్దరు కూడా చిరంజీవికి చాలా ఇష్టం అంట. వాళ్ళిద్దరూ ఏం చేసినా కూడా ఆయన క్షమించడమే కాకుండా వాళ్ళకి ఏం కావాలో అవన్నీ చూసుకునే వ్యక్తి అంట.
ఆగస్టు 11వ తేదీ అందరి ముందుకు భోళాశంకర్ సినిమా రాబోతున్న సంగతి మనందరికీ తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవి హీరోగా, తమన్నా హీరోయిన్గా, చెల్లెలు పాత్రలో కీర్తి సురేష్ నటించిగా, మెహర్ రమేష్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా గురించి మెగా అభిమానులు వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా ట్రైలర్ ( Babi speech about Chiranjeevi and Pawan Kalyan ) ఇప్పటికే రిలీజ్ అయ్యి మంచి రిజల్ట్ తెచ్చుకుంది. ఈ సినిమాలో చిరంజీవి మళ్లీ ఒకప్పటి చిరంజీవిలా చాలా జోష్ గా ఉన్నాడని అభిమానులు వాపోతున్నారు. అయితే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చిరంజీవి అదే చెప్పారు. మీరు చూపిస్తున్న ఈ అభిమానమే నా బలం.. మీరు చూపిస్తున్న ఈ ప్రేమే నాకున్న శక్తి అని చెప్పారు.
బోల శంకర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫంక్షన్ కి ఎందరో దర్శక, నిర్మాతలు వచ్చారు. అయితే ఆ సందర్భంగా దర్శకుడు బాబి చిరంజీవి గురించి మాట్లాడుతూ.. చిరంజీవికి ఆయన తమ్ముళ్లు అంటే చాలా ఇష్టమని.. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ అంటే ఇంకా ఇష్టమని.. ఒకసారి ఒక సినిమా షూటింగ్ జరుగుతుండగా.. ఒక ఇల్లు తీసుకున్నారని.. ఆ ఇంట్లో లైట్లు వేసే వాళ్ళు చెప్పులతో తిరుగుతున్నారని.. దానికి ఆ ఇంటి యజమాని చెప్పులతో ( Babi speech about Chiranjeevi and Pawan Kalyan ) ఇంట్లో తిరుగుతున్నారు ఏంటి? అని గట్టిగా అడిగితే.. అక్కడే ఉన్న పవన్ కళ్యాణ్ కరెంట్ వర్క్ చేసే వాళ్ళు చెప్పులతో కాకుండా ఎలా తిరుగుతారు? మీకు రెంట్ ఇస్తున్నాం కదా అని గట్టిగా అడగడంతో.. అవతల వ్యక్తి పవన్ కళ్యాణ్ అని కూడా ఆలోచించకుండా..
యజమాని మీరు చెప్పులు లేకుండా పని చేసుకోవాలని లేదా ఇంట్లో నుంచి బయటకు పోండి అని అన్నాడంట. దానితో కోపం వచ్చిన పవన్ కళ్యాణ్ అతనితో గొడవ చేసి.. వెళ్ళిపోయాడంట. అక్కడ నుంచి ఈ విషయం తెలిసిన చిరంజీవి వెంటనే ఆ హౌస్ ఓనర్ ఫోన్ నెంబర్ తీసుకొని.. అతనికి కాల్ చేసి.. నా తమ్ముడిని పట్టుకుని ఇంట్లోంచి బయటికి పొమ్మంటావా? నీకు ఎంత ధైర్యం అంటూ నానా తిట్లు తిట్టాడంట అవతల వ్యక్తిని.. ఇలా చిరంజీవికి ఆయన తమ్ముళ్లు అంటే చాలా ప్రేమని.. ఆయన తమ్ముడిని ఎవరైనా ఏమైనా అంటే ఆయన ఊరుకునేది లేదని.. ఎంతటి వారితోనైనా ఆయన గొడవ చేస్తారని చెబుతూ.. చిరంజీవి గొప్పతనం గురించి, ఆయన ఎంత కష్టపడి పైకొచ్చి ఎందరికో ఆదర్శవంతంగా నిలిచిన ఆ వ్యక్తిని గురించి ఎంత చెప్పుకున్న తక్కువేనని చెప్పడం జరిగింది..