Anushka: హీరోయిన్ అవుతానని అస్సలు ఊహించకుండానే స్టార్ హీరోయిన్ స్థాయికి ఎదిగి స్టార్ హీరోల సరసన సినిమాల్లో నటించే మంచి స్థానం సంపాదించుకుంది అనుష్క శెట్టి. తెలుగు చిత్ర పరిశ్రమలో మంచి మంచి హీరోలతో ఎన్నో చిత్రాల్లో నటించిన ఈ అందాల భామ అనుష్క శెట్టి గురించి ప్రత్యేకించి పరిచయాలు అవసరం లేదు. ఇక తెలుగు చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టిన తర్వాత అంది వచ్చిన అవకాశాలలో నటిస్తూ రవితేజ సరసన విక్రమార్కుడు చిత్రంలో నటించి సూపర్ డూపర్ బ్లాక్ పాస్టర్ హిట్టు కొట్టి.. ఆ తర్వాత లేడీ ఓరియంటెడ్ చిత్రాల్లో కూడా తనదైన శైలిలో నటిస్తూ తనేంటో నిరూపించుకుంది. తన అందం, తన నటనతో చూపరులను ఇట్టే ఆకర్షించుకుని తెలుగులో భారీ స్థాయిలో ఫాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. (Anushka Agree)
కేవలం తెలుగులోనే కాకుండా తన నటనతో ఇటు తమిళంలో కూడా స్టార్ హీరోల సరసన నటిస్తూ భారీ స్థాయిలో అక్కడ కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుని స్టార్ట్ పొందింది. ఓ పక్క స్టార్ హీరోల సరసన హీరోయిన్ గా నటిస్తూనే మరో పక్క లేడీ ఓరియంటెడ్ చిత్రాలతో ప్రేక్షకులను పలకరించింది ఈ ముద్దుగుమ్మ.. ఇక అనిష్క నటించిన అరుంధతి చిత్రం అప్పట్లో ఎంతటి ఘన విజయాన్ని సృష్టించిందో మనందరికీ తెలిసిన విషయమే.. ఇక అప్పటినుండే అనుష్క పేరు జేజమ్మగా టాలీవుడ్ ఇండస్ట్రీలో చిరస్థాయిగా నిలిచిపోయింది. అందుకే ఇండస్ట్రీలో అరుంధతి చిత్రానికి ముందు ఆ తర్వాత అనుష్క కెరియర్ గురించి మాట్లాడుకుంటారు.. ఇక ఇటీవల కాలంలో ఏమైందో తెలియదు అనుష్క సినిమాలు చేయడం పూర్తిగా తగ్గిచ్చేసింది. (Anushka Agree)
ఒకప్పటిలా అనుకున్నంత స్థాయిలో చిత్రాలు చేయడమే లేదు. ప్రస్తుతం ఈ అమ్మడు కుర్ర హీరో నవీన్ పోలిశెట్టి తో మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి చిత్రంలో నటిస్తోంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక సినిమాల విషయం కాస్త పక్కన పెడితే 40 సంవత్సరాల వయసు దాటినా పెళ్లి ఊసే ఎత్తడం లేదు అనుష్క.. మరి ముఖ్యంగా ప్రభాస్ అనుష్క పీకల్లోతు ప్రేమలో ఉన్నారని వీళ్ళిద్దరూ త్వరలో పెళ్లికూడా చేసుకోబోతున్నారని ఎన్నో రకాల వార్తలు వ్యాపించినప్పటికీ.. వీళ్ళిద్దరూ మేము మంచి ఫ్రెండ్స్ మాత్రమే అంటూ ఈ మాటలన్నిటిని కొట్టి పడేస్తూ వాళ్లకి ఆ ఉద్దేశమే లేదని విషయాన్ని తెలియజేశారు. అయితే ఇటీవల తను నటించిన చిత్రం మిస్టర్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి ప్రమోషన్ లో భాగంగా ఇంటర్వ్యూలో పాల్గొన్న అనుష్క తన మొదటి లవ్ గురించి వెల్లడించింది. ఇక తన మొదటి లవ్ తన ఆరవ తరగతిలో మొదలైందట..
అవును మీరు విన్నది నిజమే.. అనుష్క తన ఆరో తరగతి లోనే అలాంటి పనికి అంగీకరించిందట. అదేంటంటే.. తనతోపాటు తన స్కూల్లో ఆరవ తరగతి చదివేటప్పుడే ఓ కుర్రాడు తనకి లవ్ ప్రపోజల్ చేశాడట. కానీ అంత చిన్న వయసులో తనకి ప్రేమ అంటే ఏంటో కూడా తెలియని వయసు అది. ఇక ఆ అబ్బాయి తన లవ్ ప్రపోజల్ చేయగానే అయోమయంతో ఏం చెప్పాలో తెలియక ఆ కుర్రాడి ప్రేమకు ఓకే చెప్పేసిందట.. కాగా ఆ తరువాత తన జీవితంలో ఇదొక మెమోరీగా మిగిలి పోయిందని అనుష్క వెల్లడించింది.. ఇక ఈ విషయం తెలుసుకున్న స్వీటీ అభిమానులే కాక నిటిజన్లు కూడా వామ్మో నువ్వు తక్కువ కాదు చిట్టి అంటూ రకరకాల కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.