Dhoni Affairs: కేవలం మన ఒక్క దేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా మంచి గుర్తింపు సాధించుకున్న స్టార్ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోని. మన భారతీయ జట్టు కెప్టెన్గ్ గా బాధ్యత వహిస్తూ ఎన్నో విజయాలను అందించిన ధోని గురించి మన దేశంలోనే క్రికెట్ కాకుండా ప్రపంచ వ్యాప్తంగా కూడా సుపరిచితమే.. ఫామ్ ఎలాంటిది అని చూడకుండా గెలుపే లక్ష్యంగా ఎన్నో ట్రోఫీ లను సైతం ఇండియాకు గెలిపించుకు వచ్చాడు. ఇక ఇటీవలే ధోని తన నలభై రెండవ జన్మదిన వేడుకలను చాలా ఘనంగా జరుపుకున్నాడు.
ఐతే తన పుట్టిన రోజు సందర్భంగా నెట్టింట ఆయనకు సంబంధించిన ఒక పర్సనల్ విషయం గురించి ఓ వార్త అయితే వైరల్ అవుతుంది. మరి ఆ విషయం ఏంటంటే.. ధోని పెళ్లికి ముందు చాలా మంది స్టార్ హీరోయిన్లతో ఎఫెక్ట్స్ పెట్టుకున్నాడు అన్న విషయం.. దీంతో ఈ విషయం ఒక్కసారిగా సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ధోని అభిమానులే కాక యావత్ క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తికరంగా ఆయన లవ్ స్టోరీ ల గురించి ఆసక్తిగా తెలుసుకుంటున్నారు.
ధోని ముందుగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అయిన దీపికా పడుకునే తో చాలా రోజులు రిలేషన్షిప్ మైంటైన్ చేస్తూ అలా వీళ్ళిద్దరూ రిలేషన్ లో ఉన్నారట.. కానీ వీళ్లిద్దరి మధ్య యువరాజ్ సింగ్ రావడం వల్ల వీళ్ళిద్దరి రిలేషన్ షిప్ అంతటితో ఆగిపోయింది అంట. ఇక ఆ తర్వాత మహేంద్ర సింగ్ ధోని ఆసిన్ తో కూడా ప్రేమాయణాన్ని కొనసాగించాడట. కానీ ఏమైందో తెలియదు వీళ్ళిద్దరి రిలేషన్షిప్ కూడా కొన్నేళ్ల పాటే సాగి చివరకు పెళ్లి వరకు మాత్రం వెళ్ళలేదు. ఇక వీళ్లే కాకుండా కోలీవుడ్ నటి అయిన లక్ష్మీరాయ్ తో కూడా కొన్ని రోజుల పాటు ధోని ప్రేమయణాన్ని కొనసాగించాడట.
ఇక సుశాంత్ సింగ్ రాజ్ పుత్ హీరోగా వచ్చిన మహేంద్ర సింగ్ ధోనీ బయోపిక్ లో ధోని లవర్ పాత్ర లక్ష్మీ రాయ్ దే అంటూ గతంలో రక రకాల వార్తలు వెలుబడ్డాయి. వీళ్ళే కాకుండా ధోని తో అప్పట్లో ఇంకా చాలా మంది హీరోయిన్ల పేర్లు వినిపించినప్పటికీ.. అందులో అసలు నిజం ఎంత ఉన్నదన్న సంగతి ఆ ధోనీ (Dhoni Affairs) కే తెలియాలి. కేవలం ధోని ఒక్కరే మాత్రమే కాదు.. చాలామంది క్రికెటర్లు చాలామంది హీరోయిన్లతో కొనసాగిస్తూనే ఉన్నారు అలా వాళ్ల విషయం చాలా దూరం వెళ్తే ఆ తర్వాత ఎందరో సెలబ్రిటీలను క్రికెటర్లు పెళ్లిళ్లు కూడా చేసుకున్నది మనం చూస్తూనే ఉన్నాం.