
Pawan Kalyan : మన ఇండియా లో సినిమాలకి , క్రికెట్ కి , పాలిటిక్స్ కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆయా రంగాల్లో ఉండే సెలబ్రటీస్ కంటే వాళ్ల ఫాన్స్ మధ్య వార్ పీక్స్ లో ఉంటుంది. ముఖ్యంగా సౌత్ ఇండియాలో అయితే.. నెక్స్ట్ లెవెల్. సౌత్ ఇండియాలో అటు సినిమా రంగం పరంగాను, రాజకీయంగానూ (Comments on Pawan Kalyan BRO ) ఎప్పుడూ టాక్ అఫ్ ది టౌన్ గా ఉండే హీరో కమ్ పొలిటీషియన్ పవర్ స్థార్ పవన్ కళ్యాణ్. తాజాగా ఆయన, ఆయన మేనల్లుడు సాయి ధర్మ్ తేజ్ హీరో గా నటిస్తున్న బ్రో మోషన్ పోస్టర్ రిలీజ్ చేసిన సంగతి మనఅందరికి తెలిసిందే. ఈ సినిమా మాతృక తమిళ్ సినిమా అయిన వినోదయ సీతమ్, తమిళ్ లో దీనిని డైరెక్ట్ చేసింది ప్రముఖ నటుడు సముద్రఖని.
తమిళ్ సినిమా స్టోరీ ప్రకారం భగవంతుడు భక్తుడి కోసం స్వర్గం నుండి భూమి పైకి స్వయంగా రావడం. ఇదే థీమ్ లో కొన్ని వందల సినిమాలు వచ్చినప్పటికీ , పవన్ కళ్యాణ్ సైతం ఇలాంటి థీమ్ లో గతంలో గోపాల గోపాల లో కూడా మల్టీ స్టార్ సినిమాగా విక్టరీ వెంకటేష్ తో కలసి స్క్రీన్ పంచుకుని మంచి హిట్ కొట్టారు. బ్రో సినిమా ( Comments on Pawan Kalyan BRO ) మోషన్ పోస్టర్ అనేక రికార్డ్లని సొంతం చేసుకోవడమే కాకుండా.. సినిమాకి సంబంధించి ముఖ్యంగా పవన్ కళ్యాణ్ క్యారెక్టర్ ఎలా ఉండబోతోందో అనేక హింట్లు ఇచ్చింది. మరో హీరో సినిమా అయితే ఆ రిలీజ్ చేసిన మోషన్ పోస్టర్ ని సినీ అభిమానులు ముఖ్యంగా వాళ్ల ఫాన్స్ మాత్రమే కీన్ గా ఫాలో అవుతారు, కానీ ఇక్కడ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అవడం వలన అటు పవన్ అభిమానులతో పాటు, యాంటీ ఫాన్స్ తాకిడి కూడా విపరీతంగా ఉండటం వలన ఇండియా లో నెంబర్ వన్ ట్రేండింగ్ లోకి వెళ్లి అనేక రికార్డ్స్ ని బద్దలు కొట్టింది.
ఈ రెస్పాన్స్ చూసిన పవన్ కళ్యాణ్ అభిమానులు పండగ చేసుకోవడంలో ఆశ్చర్యం ఏమి లేదు. ఈ మోషన్ పోస్టర్ గురించి సోషల్ మీడియాలో అనేక చర్చలు జరుగుతున్నాయి. మోషన్ పోస్టర్ అభిమానులు తమ ( Comments on Pawan Kalyan BRO ) అభిప్రాయాలను, తాము ఇందులో గమనించిన విషయాలని అనేక రకాలుగా తమకు తోచిన విధంగా, తమ బుర్రలకి పదుని పెట్టిమరీ విశ్లేషిస్తున్నారు. ఆవివరాలు ఒకసారి చూద్దాం. ఓంకారం లో ఉన్న లాకెట్ : హిందూ సంప్రదాయంలోనూ, నమ్మకాల్లోనూ, పురాణాలలోను ఓంకారం కి ఉన్న ప్రత్యేక స్థానం గురించి చెప్పుకోవాలంటే మనకు ఎంతకీ సమయం సరిపోదు. దేవుడే ధివి నుండి భక్తుడి కోసం భూమి పైకి వచ్చే దేవుడి క్యారెక్టర్ కాబట్టీ, ఇందులో పవన్ కళ్యాణ్ శివుడి అవతారంగా వస్తున్నాడా అని కొంత మంది చెప్తూ ఉంటే..
మరి కొంత మంది అసలు ఓంకారం విశిష్టత మీద అనేక రకాలుగా విశ్లేషిస్తున్నారు. ఓంకారం ఏఒక్క మతానికో, దేవుడికో సంబంధించినది కాదని అది ప్రకృతి నుండి పుట్టిన శబ్దం అని, ఈ శబ్దాన్ని కొన్ని నిముషాలు పాటు పలికితే మానిశిక ప్రశాంతతే కాకుండా అనేక జబ్బుల్ని దూరం చేసి ఆరోగ్యాన్ని ప్రసాదించే దివ్య ఔషధంగా ఎలా పని చేస్తుందో కూడా అభిమానులు ఆధారాలతో సహా తమ అభిమానాన్ని అభిప్రాయాలరూపంలో పంచుకుని సినిమా మీద అంచనాలని అమాంతం పెంచేశారు. ఒక్క లాకెట్ లోని ఓం గురించే కాకుండా అందులో వచ్చిన పద్యం, దాని కోసం వాడిన మ్యూజిక్ గురించి కూడా ఎన్నో విశ్లేషణలు పుంకాను పుంకాలుగా చర్చిస్తున్నారు. కాలః త్రిగుణ సంశ్లేశం.. కాలః గమన సంకాశం అంటూ సాగే పద్యంలోని అర్ధాన్ని భావాన్ని పవర్ స్టార్ అభిమానులు తెగ ఎతికి జనాలలో విపరీతమైన హైప్ క్రియేట్ చేయడానికి ట్రై చేస్తున్నారు.