Chiranjeevi : సినిమా ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఒక సామాన్యుడిగా సినిమా రంగంలో అడుగుపెట్టి తనని తాను నిరూపించుకోవడానికి చాలా కష్టపడే పరిస్థితుల్లో.. చిన్న చిన్న పాత్రలు చేస్తూ, విలన్ గా కూడా నటించి ఈ రోజు ఆయన ఉన్న స్థాయిని ఒక్కసారి ఆలోచిస్తే ( Chiranjeevi reacts for the first time ) ఆశ్చర్యం కలుగుతుంది. ఏ బ్యాగ్రౌండ్ లేకుండా చిన్న చిన్న పాత్రలతో పెద్ద స్థాయికి వచ్చిన హీరోలు ఎందరో ఉన్నారు కానీ.. చిరంజీవి మాత్రం ఆయన ఒక్కరు మాత్రమే కాకుండా ఒక పెద్ద వృక్షాన్ని తయారు చేసినట్టు ఆయన కొడుకుని, తమ్ముళ్ళని, మేనల్లుళ్ళని ఇలా ఎందరినో మెగా హీరోల్ని తెలుగు సినిమా రంగానికి అందించి వాళ్ళందరికీ..
దారి వేసింది అదిగో ఆ మెగాస్టార్ చిరంజీవి అని కథలుగా చెప్పుకునే స్థాయికి ఒక మనిషి రీచ్ అవ్వడం అంటే దాని వెనక అతని పట్టుదల, కృషి ఎంత ఉంది అనేది అంచనా వేయలేము. ఎంత ఎదిగితే అంత ఉదుగుతూ ఉండాలి అనడం అనే మాట చిరంజీవిలో కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. చిరంజీవి పెద్దవాళ్ళని గౌరవిస్తూ.. సినిమా ( Chiranjeevi reacts for the first time ) రంగంలో ఎటువంటి బ్యాడ్ రిమార్క్ ని తెచ్చుకోకుండా.. తనదైన శైలిలో తన కుటుంబాన్ని కాపాడుకుంటూ.. అభిమానుల అభిమానాన్ని పెంచుకుంటూ.. ఆయన జీవితం ఒక మంచి సక్సెస్ఫుల్ బాటగా నడిపించుకున్న గొప్ప హీరో మన మెగాస్టార్ చిరంజీవి.
చిరంజీవి ఒక్కగానొక్క కొడుకు, వారసుడు, నటవారసుడైన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ స్టార్ హీరోగా ఒక వెలుగు వెలుగుతున్నాడు. చిరు మంచి లీడింగ్ లో ఉండగానే కొడుకు సక్సెస్ ని చూసే అదృష్టాన్ని కూడా ఆ భగవంతుని కలిగించాడు. సక్సెస్ అంటే మామూలు సక్సెస్ కాదు ఈరోజు చిరంజీవి తనయుడు పేరు ప్రపంచ ( Chiranjeevi reacts for the first time ) వ్యాప్తంగా వినిపిస్తుంది. అలాగే చిరంజీవి జీవితంలో ఎన్నో సమస్యల్ని ఎదుర్కొన్నది కూడా మనకు తెలుసు. చిరంజీవి పెద్ద కూతురు కెరియర్ పరంగా కూడా చాలా చక్కగా ఫ్యాషన్ డిజైనింగ్ కాకుండా ఇప్పుడు ప్రొడక్షన్లో కూడా ముందడుగు వేస్తూ ఆయనకు ఆనందాన్ని కలిగిస్తుంది. అలాగే చిన్న కూతురు శ్రీజ గురించి చెప్పుకుంటే..
ఆమె ప్రేమించి పెళ్లి చేసుకుని ఒక బిడ్డని కన్నాక అతన్ని వదిలేసి.. మళ్లీ రెండో పెళ్లి చేసుకున్న విషయం తెలిసినదే. మదర్స్ డే రోజు చిరంజీవి తన తల్లి అంజనాదేవి గురించి మరియు తన చిన్న కూతురు శ్రీజ గురించి మాట్లాడారు. చిరంజీవి మాట్లాడుతూ.. మా అమ్మాయి శ్రీజ వాళ్ళ నాన్నమ్మ దగ్గరికి వెళ్లి తనకు చాలా బాధగా ఉందని చెప్పిందట. దానికి మా అమ్మ.. జీవితం అంటే ఇలానే ఒక్కళ్ళతోనే సాగేది కాదు.. ఎక్కడ నీ మనసుకి నచ్చకపోతే అక్కడ ఉండకు. ఎక్కడ నీ మనసు బాగుంటే అక్కడే ఉండు అని చెప్పిందంట. ఆ మాటలు విన్న శ్రీజ నా దగ్గరికి వచ్చి.. నాన్న నాన్నమ్మ తో మాట్లాడిన తర్వాత నాకు చాలా ధైర్యం వచ్చింది. జీవితంలో ఏదైనా సాధించగలనని కాన్ఫిడెన్స్ వచ్చింది అని చెప్పింది అని అన్నారు. తన కూతురు శ్రీజ గురించే చిరంజీవి చాన్నాళ్లకు నోరు విప్పి మాట్లాడడం అభిమానులందరికీ ఆనందంగా ఉంది.