Bhola Shankar : మెగాస్టార్ చిరంజీవి సినిమా బోలా శంకర్ టీజర్ రిలీజ్ అయిన సంగతి మన అందరికి తెలిసిందే. ఈ సినిమా టీజర్ చూడగానే కొందరు మెగాస్టార్ ఇంకా యంగ్ గా ఉన్నాడని.. ఇప్పటి హీరోలకు ఇంకా దీటుగా పోటీగానే ఉన్నాడని.. ఎంతో పొగిడారు. అలాగే మరికొందరు సినిమా బజ్ చూస్తే.. అంత గొప్పగా ( Bhola Shankar movie buzz ) అనిపించడం లేదని.. టీజర్ చూస్తుంటే రొటీన్ సినిమా స్టోరీ లాగే అనిపిస్తుంది అని అంటున్నారు. ఏదేమైనా మొదటి నుంచి ఈ సినిమాపై పెద్ద బజ్ కనిపించడం లేదు. తక్కువగానే ఉంది దానికి కారణం ఏమిటో ఆరా తీస్తే.. ఈ సినిమా రీమేక్ కావడమే కాకుండా.. 8 ఏళ్ల క్రితం వచ్చిన ఓ పాపులర్ సినిమాని రీమేక్ చేయడం వల్ల ఈ సినిమాపై ఎవరికీ అంత ఆసక్తిగా లేదు.
ఎన్నో ఏళ్ల క్రితం సినిమాని రీమేక్ చేయడమే కాకుండా.. శక్తి , షోడా వంటి డిజాస్టర్ సినిమాలు ఇచ్చిన మెహర్ రమేష్ దర్శకత్వంలో సినిమా చేయడం చాలా మందికి అసలు ఇష్టం లేదు. మెహర్ రమేష్ గత 10 సంవత్సరాల నుంచి సినిమాలు డైరెక్షన్ చేసినట్టు లేదు. అటువంటి దర్శకుడు చేతిలో బోలాశంకర్ లాంటి సినిమా చిరంజీవి ( Bhola Shankar movie buzz ) నటించిన మెగా అభిమానులకు ఎంతో బాధగా వెలితిగా ఉంది. ఈ సినిమా ఏ మాత్రం ఫ్లాప్ అయినా కూడా.. ఇప్పటికే వాల్తేరు వీరయ్య సినిమాతో మంచి ఊపులో ఉన్న చిరంజీవి ఇప్పుడు మళ్లీ ఫ్లాప్ లోకి వెళ్లాల్సి వస్తుందని అభిమానులకు బెంగగా ఉంది. మరోపక్క ఈ సినిమా పై మొదటి నుంచి కూడా ఎందుకో ఎవరికీ పెద్దగా భారీ అంచనాలు లేవు. భారీ అంచనాలు లేని సినిమాలు ఒక్కొక్కసారి హిట్ అవ్వడానికి కూడా అవకాశం ఉంటుంది. కానీ మరి ఈ సినిమా రిజల్ట్ ఎలా ఉంటుందో తెలియదు.
మెగాస్టార్ చిరంజీవి నటించిన భోళాశంకర్ సినిమా ఫ్లాప్ అవుతుందేమో అని అనుమానం రావడానికి అనేక కారణాలు ఉన్నాయి. ట్రైలర్ చూడగానే సినిమా ఒరిజినల్ కంటే కూడా ఇది కొంచెం పేలగా ఉందని అందరికీ అనిపించింది. అంతేకాకుండా ( Bhola Shankar movie buzz ) తెలంగాణ యాసలో పెద్దగా పట్టులేదని, డైలాగ్ అసలు బాలేదని అనుకుంటున్నారు. అలాగే సినిమా యొక్క ప్రతికూలతను భారీగా పెంచుతుంది అది. అంతేకాకుండా ఎప్పటిదో సినిమా ఇప్పుడు రీమేక్ చేయడం అది ఏ మాత్రం ఆలోచించినా కూడా ఈ రోజుల్లో కరెక్ట్ కాదని అనిపిస్తుంది. పైగా ఇప్పుడు ఓటిటి అనేది వచ్చిన తర్వాత.. అన్ని భాషల సినిమాలు బాగున్న సినిమాలును అందరూ కూడా చూసేయడం జరుగుతుంది.
అలాంటప్పుడు ఈ రీమేక్ లను మళ్లీమళ్లీ సినిమాలు తీసినప్పటికీ.. ఆ సినిమాను చూసిన వాళ్ళందరూ ఈ భాషలో ఈ సినిమాని ఆ సినిమాతో పోల్చడం మొదలుపెడతారు. అలా పోల్చే క్రమంలో.. ఆడియన్స్ ని సంతృప్తి పరచడం చాలా కష్టమైన విషయమని.. దర్శకుడికి తెలియాలి. అందులో ఈ రోజుల్లో.. సినిమా కథలో ఒక విభిన్నత్వం.. సినిమా నడుస్తుండగా సర్ప్రైజ్లు.. ఇంటర్వెల్ బ్యాంగ్ ఇలా ఇవన్నీ లేకపోతే సినిమా ఎంత బడ్జెట్ పెట్టి తీసినా కూడా ప్రేక్షకుడుని నప్పించుకోవడం లేదు. అలాగే సినిమాలో పాటలు, ప్రతి సీను కూడా ఎంత జాగ్రత్తగా తీస్తే తప్ప దేన్నైనా కూడా సక్సెస్ చేసుకోవడం చాలా కష్టంగా ఉంటుంది. అలాగే ఆచార్య సినిమా ఎంత ఫ్లాప్ అయిందనేది మనందరికీ తెలుసు. ఆ సినిమా మెగా అభిమానులకి ఓ బాధను మాత్రమే మిగిల్చింది. ఇప్పుడు ఈ సినిమా కూడా అలా జరగకూడదని.. ఈ సినిమా కచ్చితంగా సూపర్ డూపర్ హిట్ అవ్వాలని మెగా అభిమానులు అందరూ కోరుకుంటున్నారు.