Anushka Shetty Wants: అవును ప్రస్తుతం నెట్టింట ఫుల్ హల్చల్ చేస్తున్న వార్త ఇదే. అనుష్క పెళ్లి అవసరం లేకుండా తల్లి అవ్వాలనుకుంటుందట. ఒక్క క్షణం మీరు కూడా షాక్ లో ఉండి ఉంటారు కదూ.. ఇదెక్కడి గమ్మత్తు అసలు ఈమె ఇలా అనుకుంటుందేంటి.? ఇదేమి అలవాటు ఎవరైనా అసలు ఇలా ఆలోచిస్తారా అని రకరకాల ప్రశ్నలు మీ మదిలో తిరుగుతూ ఉండాలి ఈ పాటికి.. ఎవ్వరైనా సరే పెళ్లి కాకుండా తల్లి కావాలని ఎవరు అనుకోరు. కానీ అనుష్క ఎందుకు ఇలా ఆలోచిస్తుంది అనే మీరు కూడా ఆలోచనలో పడ్డారు కదూ. అయితే అనుష్క అసలు నిర్ణయం తీసుకుందా.? ఎందుకు తీసుకుంది ఇలాంటి నిర్ణయం అనే విషయాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం.. పెళ్లి కాకుండానే అనుష్క తల్లి కావాలనుకుంటుంది నిజ జీవితంలో కాదండి బాబు అవును మీరు విన్నది ముమ్మాటికి నిజమే..
అనుష్క శెట్టి నవీన్ పోలిశెట్టి వీళ్లిద్దరూ జంటగా కలిసి నటిస్తున్న చిత్రం మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి. ఇక ఈ చిత్రం సెప్టెంబర్ 7వ తారీఖున అంగరంగ వైభవంగా విడుదలకు సిద్ధమవుతున్నది. ఇక ఈ చిత్రానికి సంబంధించి ఇటీవల ట్రైలర్ కూడా విడుదల అయ్యి చాలా మంచి పాజిటివ్ టాక్ ను దక్కించుకుంది. ఇక ఇందులో భాగంగానే అనుష్క శెట్టికి అసలు పెళ్లి మీద నమ్మకం లేని లేదట. అలాగే అస్సలు ఇష్టం కూడా ఉండదట. కానీ పెళ్లి కాకుండా తల్లి అవ్వాలని కోరిక మాత్రం చాలా విపరీతంగా ఉంటుందట. దాంతో ఆ కోరిక తీర్చుకోవడానికి చూస్తూ ఉంటూ ఉంటుందట. ఇదే క్రమంలో నవీన్ పోలిశెట్టి తనకు పరిచయం అవుతాడట.
అయితే నవీన్ పోలిశెట్టి కచ్చితంగా అతని కోరిక తీర్చుతాడు అని భావిస్తుందట. కానీ ఆమెకు ప్రేమ పెళ్లి ఎమోషన్స్ ఇలాంటి అసలు ఏమీ లేవని. కేవలం తల్లి మాత్రమే కావాలి (Anushka Shetty Wants) అనే ఒక కోరిక బలంగా ఉంటుందట. మరి తనకు ఎదురైన ఈ సంఘటనలతో నవీన్ పోలిశెట్టి ఎలా ప్రవర్తిస్తాడు.? అనుష్కతో కలిసిపోయి మరి బిడ్డకు జన్మనిస్తాడా లేదా అసలు ఆ తర్వాత ఎన్ని రకాల ట్విస్టులు ఉంటాయి అన్నది ఈ చిత్రంలో మనం చూడాల్సి ఉంది.మరి ఇవన్నీ తెలియాలంటే ఈ చిత్రం విడుదల అయ్యాక థియేటర్ వద్దకు వెళ్లి మనకు చూస్తే కానీ అర్థమవుతుంది. అయితే ఇంత వరకు ఇలాంటి స్టోరీ విభిన్నమైన కథతో మన ముందుకు అనుష్క శెట్టి రాబోతుంది. కాగా ఇక ఈ చిత్రాన్ని దర్శకత్వం వహించింది మహేష్ బాబు గారు.
అయితే అనుష్క శెట్టి చాలా రోజుల తర్వాత సినిమాలో నటించింది. అందరూ అనుష్క సినిమాలకు పూర్తిగా దూరమైపోయిందనుకున్నారు. కానీ అలా జరగకుండా మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టితో మళ్ళీ అనుష్క శెట్టి మళ్లీ మన ముందుకు రాబోతుంది. అయితే అనుష్క శెట్టి నిశబ్దం సినిమా తర్వాత ఎన్నో రోజులకి మళ్ళీ చాలా గ్యాప్ తర్వాత ఈ సినిమాతో విడుదల అవుతున్నారు. దీంతో ఈ చిత్రం పై చాలామందికి భారీ అంచనాలే ఉన్నాయి. చాలా గ్యాప్ తర్వాత అనుష్క ఈ చిత్రంలో అనుష్క నటించడంతో పైగా చాలా మంచి క్రేజీ హీరోగా పేరు తెచ్చుకున్నటువంటి నవీన్ పోలిశెట్టి కూడా ఈ చిత్రం పై చాలా మంచి అంచనాలే పెంచుతున్నారు మరి విడుదల అయితే కానీ తెలుస్తుంది ఏదేమనేది.