Anushka shetty: మనందరికీ తెలిసిన విషయమే ప్రత్యేకించి మళ్లీ తెలియజేయవలసిన అవసరం లేదు. కానీ ప్రస్తుతం చెప్పాల్సిన పరిస్థితి కనుక చెబుతున్నది ఏంటంటే.. ప్రభాస్-అనుష్కల మధ్య ఉన్న బంధం గురించి చిన్న పిల్ల గాన్ని అడిగిన చెప్తాడు. అలాంటి జోడి వీళ్ళది. ఇక వీళ్ల గురించి రోజుకి ఏదో ఒక రకమైన వార్త రాకుండా అయితే ఉండదు. ఎందుకంటే ఈ జంట చూడ్డానికి అలా ఉంటుంది మరి. ప్రభాస్ అభిమానులే కాక నెటిజెన్స్ కూడా వీళ్ళిద్దరి మధ్య ఏదో కచ్చితంగా ఉంది కానీ వీళ్లు దాస్తున్నారని భావిస్తుంటే ప్రభాస్ అనుష్క మాత్రం మీము ఇద్దరం జస్ట్ ఫ్రెండ్స్ అని చెబుతున్నారు. అయితే వీరిద్దరి మధ్య ఉన్న ఫ్రెండ్షిప్ ఇప్పటిది కాదు అది మొదలైంది మాత్రం బిల్లా చిత్రం నుండి వీళ్ళిద్దరి మధ్య ఈ స్నేహం కొనసాగింది.(Anushka shetty Lovingly Calls)
అయితే చాలా రోజులుగా వీళ్ళు ప్రేమించుకుంటున్నారు అంటూ ఎన్నో కామెంట్స్ వినిపించినప్పటికీ వీళ్ళు మాత్రం ఇలాంటిదేమీ లేదని కొట్టిపడేస్తూ.. మేము మంచి స్నేహితులమని క్లారిటీ తెలిపారు. కానీ చాలామంది వీళ్ళ అభిమానులు మాత్రం ప్రభాస్-అనుష్క పెళ్లి చేసుకుంటే చూడాలని ఉంది. వీళ్లిద్దరు పెళ్లి చేసుకుంటే బాగుండని ఇప్పటికీ అనుకుంటూనే ఉంటారు. అయితే ప్రభాస్ అనుష్క మధ్య చాలా మంచి రిలేషన్ ఉంది. తెలుగు ఇండస్ట్రీలో ఒక మంచి జంటగా గుర్తింపు కూడా పొందారు. ఇక వీళ్లిద్దరు కలిసి తీసిన చిత్రాలన్నీ సూపర్ హిట్గా నిలిచాయి. ఇంకా ఇప్పటికే బిల్లా, మిర్చి, బాహుబలి 1, బాహుబలి 2 చిత్రాల్లో కలిసిన నటించారు.
అయితే క్రిష్ దర్శకత్వంలో రాబోతున్న ఓ చిత్రంలో కూడా ప్రభాస్-అనుష్కని తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇక ఈ విషయాన్ని పక్కన పెడితే ప్రస్తుతం మాత్రం అనుష్క నవీన్ పోలిశెట్టి సరసన మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి అనే చిత్రం మన ముందుకు రానున్నది. ఇక ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం యొక్క టీజర్ అందరిని ఆకట్టుకుంది. ఇక ఈ చిత్రం యొక్క టీజర్ ప్రభాస్ యొక్క సోషల్ మీడియాలో సైతం షేర్ చేశారు. ఇక ఆ పోస్ట్ చూసిన అనుష్క తన సోషల్ మీడియాలో ప్రభాస్ కి కృతజ్ఞతగా థాంక్యూ పప్స్ అంటూ పోస్ట్ చేసింది.
దాంతో ఒక్కసారిగా నెట్టింట ట్రోల్ చేసే రాయుళ్ళకు మొట్టమొదటిసారి అంతుపట్టని మిస్టరీగా ఏంటి ఈ పప్స్ (Anushka shetty Lovingly Calls) ఇది ఏమన్నా ప్రభాస్ నిక్ నేమ్ అంటూ ఆరా తీస్తున్నారు. ఇక ఇది కచ్చితంగా ప్రభాస్ నిక్ నేమ్ అయ్యుంటుంది. అనుష్క ప్రభాస్ ని ముద్దుగా అలా పిలుచుకుంటుందేమో అని అనుకుంటున్నారు. దాంతో అనుష్క ప్రభాస్ నిక్ నేమ్ బయటపెట్టిందంటూ చర్చించుకుంటున్నారు. దీంతో ప్రేమగా ప్రభాస్ ని పిలవడం మరదే విధంగా అనుష్క-ప్రభాస్ పోస్ట్ చేయడం మొదలైన అంశాలను చూస్తే మళ్లీ వీరిద్దరి మధ్యల ఏదో మొదలైంది అని అనుకుంటు మళ్లీ వీళ్ళిద్దరి మధ్య ప్రేమ, పెళ్లి అని వార్తలు వ్యాపిస్తున్నాయి.