Animal : సౌత్ నార్త్ అనే తేడా లేకుండా ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీని ఒక ఊపు ఊపుతున్న సినిమా అనిమల్. ఈ సినిమాపై అంచనాలైతే ఉన్నాయి కానీ రిలీజ్ కి ముందు.. ఇంత భారీ అంచనాలను ఎవరు కూడా ఊహించలేకపోయారు. స్టార్ హీరోగా ( Animal total budget and profit ) ఒక వెలుగు వెలుగుతున్న రన్బీర్ కపూర్, అర్జున్ రెడ్డి లాంటి సినిమాను తీసి.. అదే సినిమాని హిందీలో కూడా తీసిబ్లాక్ బస్టర్ హిట్స్ కొట్టి.. దర్శకుడుగా ప్రూవ్ అయ్యి.. సంచలనం క్రియేట్ చేసిన దర్శకుడు సందీప్ రెడ్డి వంగ కాంబినేషన్ అంటే.. కొంతవరకు భారీ అంచనాలే ఉన్నాయి గాని, మరి ఇంత పెద్ద సక్సెస్ ని సాధిస్తుందని ఊహించలేదని అనుకోవాలి.
అయితే ఒక హిందీ స్టార్ హీరో, ఒక తెలుగు స్టార్ డైరెక్టర్ గా ఇద్దరు కలిసి ఈ సినిమాని బ్లాక్ బస్టర్ చేశారు. ఈ సినిమాలో పాన్ ఇండియా హీరోయిన్గా ఒక వెలుగు వెలుగుతున్న రష్మిక మందన ఎదురులేని కెరీర్ ని బాలీవుడ్ లో కూడా తనకోసం జెండా ( Animal total budget and profit ) పాతేసిందనే అనుకోవాలి. ఇకపోతే ఈ సినిమా ఎంత బడ్జెట్లో తీశారు? ఎంత లాభం వచ్చిందో అని ఎందరో మాట్లాడుకుంటున్నారు. అసలు ఈ సినిమా తీయడానికి బడ్జెట్లో 200 కోట్లు అయ్యిందట. 200 కోట్ల రూపాయలతో ఈ సినిమాని భారీగా నిర్మించడం జరిగింది. అయితే ఈ సినిమాపై రిటర్న్స్ ఎలా వచ్చాయో తెలుసుకుందాం.
నాన్ థియేటర్ రైట్ సేల్ వలన 140 కోట్ల రూపాయలు ఈ సినిమాకి వచ్చింది. కానీ ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికీ 800 కోట్ల రూపాయలను వసూలు చేసింది. 400 కోట్ల రూపాయల ఫుల్ రన్ టైం లో రాబట్టింది. 350 కోట్ల వరకు షేర్ రాబట్టింది. ఇక ఈ సినిమా ప్రమోషన్ నిమిత్తం 40 కోట్ల వరకు ఖర్చు చేశారు. మొత్తం మీదగా ( Animal total budget and profit ) నిర్మాతలకు ఈ సినిమాపై 300 కోట్ల రూపాయలు మిగిలిందని అంచనా వేస్తున్నారు. ఈ సినిమాకి నిర్మాతలుగా భూషణ్ కుమార్, ప్రణయ్ రెడ్డి వంగ తదితరులు ఉన్నారు. ఈ సినిమాపై అనేక నెగిటివ్ కామెంట్స్ వచ్చినప్పటికీ కూడా యూత్ని ఆకట్టుకోవడంతో కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది.
అంతేకాకుండా ఎంత పెద్ద సినిమా మరొకటి వచ్చేవరకు ఈ సినిమా కలెక్షన్స్ ఆగేది లేదని అంటున్నారు. ఈ సినిమాతో సందీప్ రెడ్డి వంగ స్థాయి ఎక్కడికో వెళ్ళిపోయింది. మూడు సినిమాలు వరస హిట్స్ కొట్టి హ్యాట్రిక్ కొట్టాడు. సందీప్ రెడ్డి వంగ తన నెక్స్ట్ సినిమా ప్రభాస్ తో తీస్తాడని చెప్పడం జరిగింది.. ఇక వాళ్ళిద్దరి కాంబినేషన్ పై సినీ అభిమానవులకు భారీ అంచనాలు ఉన్నాయి. సందీప్ రెడ్డి వంగ సినిమాలో హీరో మేనరిజం మీద ఎక్కువగా ఫోకస్ పెడతాడు. మరి ఈసారి ప్రభాస్ తో ఎలాంటి మేనరిజాన్ని చూపించాలని సందీప్ రెడ్డి వంగ డిసైడ్ అయ్యాడో తెలీదు కానీ.. కొందరి కాంబినేషన్ అంటే ఎలా ఉంటుందో అని సినీ అభిమానులు చాలా ఆతృతగా ఎదురు చూస్తారు. అలాగే సందీప్ రెడ్డి వంగ, ప్రభాస్ కంబినేషన్ గురించి కూడా ఎదురు చూస్తున్నారు. ఇకపోతే అనిమల్ 2 లో రన్బీర్ ని హీరోగా మరియు విలన్ గా కూడా చూపిస్తాడని అర్ధమవుతుంది. మరి అది ఎలా ఉంటుందో చూడాలి.