
Anasuya : బ్రతుకుతెరువుకోసం ఏ రంగంలో నైనా అడుగుపెట్టే ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క రకంగా ఎదుగుతూ ఉంటారు. కానీ సినిమా రంగంలో స్టార్టింగ్ లో అవకాశం దొరకకపోయినా కూడా దానికి సంబంధించిన ఏదో ఒక రంగంలో అడుగు పెట్టి అక్కడ సక్సెస్ సాధించి.. ఆ తరవాత సినిమా రంగంలోకి వచ్చిన వాళ్ళు ఉన్నారు. అలాగే అనసూయ ( Anchor Anasuya about her casting couch ) మొదట యాంకర్ గా తన కెరియర్ ని మొదలుపెట్టి ఆ తర్వాత సినిమా రంగంలో అడుగు పెట్టింది. నిజానికి చెప్పుకోవాలంటే.. హీరోయిన్ కంటే కూడా ఒక యాంకర్ కే ఎక్కువ క్వాలిఫికేషన్ ఉండాలి. ఎందుకంటే ఒక నటి నటించేటప్పుడు హావభావాలు చూపిస్తే సరిపోతుంది. డబ్బింగ్ వేరే వాళ్ళతో చెప్పించొచ్చు. వాళ్ళ హావభావాలు ఎదుటివారికి ఇంకా బాగా నచ్చేలా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఉంటాది.
కానీ ఒక యాంకర్ ప్రొఫెషన్ అలా కాదు.. వాళ్లకి అందం ఉండాలి అట్రాక్ట్ చేసుకునే ఫిగర్ ఉండాలి.. దాంతో పాటు మాట చాతుర్యం కూడా చాలా ముఖ్యంగా ఉండాలి. మాట్లాడుతుంటే వినాలి అనిపించేలా ఒక యాంకర్ కి గ్లామర్ తో పాటు ఈ వరం ముఖ్యంగా ఉండాలి. అవన్నీ ఉన్న హాట్ గ్లామర్ యాంకర్ గా అనసూయ ఆ రంగంలో ( Anchor Anasuya about her casting couch ) అడుగుపెట్టి, అక్కడ సక్సెస్ అయ్యి, అక్కడ నుంచి టాలీవుడ్ సినిమా లో అడుగుపెట్టి అక్కడ కూడా మంచి మంచి పాత్రలను పోషించింది. ఎక్కువ నటించక పోయిన నటించిన కొన్నిట్లో కూడా మంచి పాత్ర లు చేసి.. ఈరోజు పాన్ ఇండియా సినిమాల్లో నటిస్తుందంటే.. నిజంగా అనసూయను మనం అభినందించాల్సిందే. అనసూయ ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో అభిమానులకు దగ్గరగా ఉంటాది.
ఆమె పోస్ట్ చేస్తున్న హాట్ హాట్ ఫోటోలు చూస్తే కుర్రాళ్ళు మంచి మంచి కామెంట్స్ కూడా చేస్తూ ఉంటారు. ఇవన్నీ ఇలా ఉంటే ఏ రంగంలోనైనా ఒక మనిషి ఒక చిన్న స్థానం నుంచి పెద్ద స్థాయికి వెళ్ళేటప్పుడు వెళ్ళిన తర్వాత తన జర్నీలో ఎలాంటివి మంచి, చెడు చూసారో.. ఎలాంటి అనుభవాలాను ఎదుర్కొన్నారో చెప్పుకుంటూ ఉంటారు. అలాగే ( Anchor Anasuya about her casting couch )ఇటీవల అనసూయ కూడా ఒక ఇంటర్వ్యూలో ఆమె కెరియర్ ఎలా మొదలైందని, అనుభవాలేమిటని అడగగా.. అనసూయ ఆసక్తికరమైన విషయాలు చెప్పింది. అందులో కాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడుతూ.. అనసూయ జీవితంలో కూడా తన కెరీర్ మొదల్లో కాస్టింగ్ కౌచ్ సమస్య ఎదుర్కొన్నానని , ఈ సమస్య మన టాలీవుడ్ లో కూడా ఎక్కువగానే ఉందని చెప్పింది.
అలాగే బుల్లితెర నుంచి వెండి తెరలోకి వచ్చి.. ఈ రోజు స్టార్ డమ్ సంపాదించుకున్న అనసూయ.. అవకాశాల కోసం వచ్చినప్పుడు ఆమెని వాళ్ళ కోరిక తీర్చమంటూ వేధించారంట. అయితే దానికి ఒప్పుకోకవడంతో రెండు సంవత్సరాలు పాటు అనసూయ కి ఎటువంటి అవకాశాలు రాకుండా ఆపారంట. అలాంటి పరిస్థితుల్లో కూడా అనసూయ లొంగిపోకుండా కృంగిపోకుండా తన పట్టుదల వదలకుండా కష్టపడి వచ్చిన చిన్న చిన్న అవకాశాలను వినియోగించుకున్నాక.. తన టాలెంట్ ని చూసి, అవకాశాలు దానంతటవె వచ్చాయంట. ఈరోజు స్టార్ డమ్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఆమెని ఎవరు కూడా అలాంటి వేధింపులు వేధించట్లేదని అనసూయ చెప్పింది. అనసూయ చెప్పిన ఈ సంచలనమైన వ్యాఖ్యలు సోషల్ మీడియా లో వైరల్ అవుతున్నాయి.