Baby Movie Review: చిత్రం: బేబీ (Baby )
తారాగణం: ఆనంద్ దేవరకొండ, విరాజ్ అశ్విన్, వైష్ణవి చైతన్య, నాగబాబు మొదలగువారు
కెమెరా: వంశీ పచ్చిపులుసు, దివాకర్ మణి
సంగీతం: విజయ్ బుల్గానిన్
నిర్మాత: ఎస్.కె.ఎన్
దర్శకత్వం : సాయి రాజేష్ నీలం
విడుదల తేదీ:14 జులై 2023 ( Baby Movie Review and Rating )
ఆనంద్ దేవరకొండ హీరోగా, వైష్ణవి చైతన్య హీరోయిన్ గా సాయి రాజేష్ నీలం బేబీ సినిమా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కలర్ ఫోటో లాంటి సూపర్ హిట్ మరియు జాతీయ పురష్కారం అందుకున్న సినిమాకి రచయితగా చేసిన సాయి రాజేష్ నీలం ఈ సినిమాని దర్శకత్వం వహించడంతో ఈ సినిమా పై మంచి అంచానాలు ఉన్నాయి. అలాగే ఈ సినిమా ట్రైలర్, టీజర్ చూస్తే.. యూత్ ని ఖచ్చితంగా అట్రాక్ట్ చేసుకునే సినిమా అని అర్ధం అవుతుంది. మరి ఈ సినిమా ఎవరిని ఎంతవరకు సంతృప్తి పరిచిందో తెలియాలంటే కథలోకి వెళదాం.. ( Baby Movie Review and Rating )
కథ.
ఆనంద్ (ఆనంద్ దేవరకొండ) , వైష్ణవి ( వైష్ణవి చైతన్య )వీళ్ళిద్దరూ చిన్నప్పుడు నుంచి ఎదురుగా ఇళ్లల్లో ఉంటార. పదవ తరగతి నుంచి వీళ్ళిద్దరూ ప్రేమించుకుంటారు. మొదట వైష్ణవి ఆనంద్ ని ప్రేమిస్తుంది. ఆ విషయం తెలిసిన ఆనంద్ కూడా వైష్ణవిని ప్రేమించడం మొదలుపెడతాడు. ఆ తర్వాత టెన్త్ క్లాస్ ఆనంద్ ఫెయిల్ అయిపోతాడు. దానితో వైష్ణవి ఇంటర్ కి వెళ్తుంది.టెన్త్ ఫెయిల్ అయిన ఆనందం ఆటో నడుపుకోవడం మొదలుపెడతాడు. వైష్ణవి ఇంటర్ అయ్యి ఇంజనీరింగ్ కాలేజీకి కూడా వెళ్తుంది. ఆనంద్ వైష్ణవికి తన ప్రేమ కానుకగా అనేక చిన్న చిన్న గిఫ్ట్ ఇస్తూ ఉంటాడు.. అలా హాయిగా నడుస్తున్న వాళ్ళ ప్రేమ కథలోకి కొన్ని మార్పులు వస్తాయి. వైష్ణవి ఇంజనీరింగ్ కాలేజ్ కి వెళ్ళిన తర్వాత అక్కడ పరిచయాలు అలాగే ఒక డబ్బున్న వ్యక్తి విరాజ్ ( విరాజ్ అశ్విన్ ) అనే వ్యక్తితో ఆమెకు పరిచయం ఏర్పడి ఆ పరిచయం కాస్త ఫ్రెండ్ గా మారి.. ఆ తర్వాత కొన్ని కారణాల వలన అతనితో డేటింగ్ చేయాల్సిన పని పడుతుంది. అసలు వైష్ణవి ఎవరిని ప్రేమించింది? విరాజ్ వైష్ణవుని ప్రేమించాడా? ఒకవేళ వైష్ణవి విరాజ్ ప్రేమించుకుంటే ఆనంద పరిస్థితి ఏమిటి? వైష్ణవి ఆనంద్ కి ఏం చెప్తుంది? అసలు చివరికి ఎవరెవరికి ఏమవుతారు? అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే..
సినిమా ఎలా ఉందంటే..
సినిమా మొదలు హీరో ఆనంద్ దేవరకొండ తాగుబోతుగా వాంతులు చేసుకుంటూ.. బాధలో ఉన్నట్టు చూపించిన సీన్ చూస్తే అర్జున్ రెడ్డి సినిమా మొదలైనట్టు అనిపించింది. అప్పటికే అమ్మాయిలు అబ్బాయిలను మోసం చేస్తారు అన్నట్టు కొంచెం సూచన ఇచ్చినట్టు ఉన్న ఈ సినిమా ట్రైలర్ మరియు టీజర్ చూసి హీరో అలా బాధగా ఉండడంతో ఆ.. లవ్ ఫెయిల్యూర్ అయి ఉంటదని చాలా ఈజీగా అనుకున్నట్టు ఉంది. అయితే ఇక ఫ్లాష్ బ్యాక్ ( Baby Movie Review and Rating ) సినిమా మొదలైన తర్వాత స్కూల్ ఏజ్ నుంచి హీరోయిన్ హీరోని ప్రేమించడం.. చూసిన చాలా సినిమాలు మళ్లీ చూసినట్టే అనిపించింది. అయితే మధ్య మధ్యలో వచ్చే మ్యూజిక్ పాటలు కొంచెం రిలాక్స్ గా ఉన్నాయి. దర్శకుడు సినిమా మొత్తాన్ని హీరోయిన్ ని బేస్ చేసుకుని కథ రాసుకున్నట్టు అర్థమవుతుంది. ఈ సినిమాకి హీరోయిన్ సెలక్షన్ మాత్రం చాలా బాగుంది. హీరోయిన్ ఎంట్రన్స్ ఆమె డాన్స్ సూపర్ గా ఉంది.
ఒక అమ్మయిలో ఉండే అన్ని హావభావాలను, అన్ని కోణాలను దర్శకుడు చూపించాలని అనుకున్నాడు. హీరోయిన్ చామంచాయగా ఉండేలా.. సాదాసీదా అమ్మాయిల చూపించి ఆమె ఫస్ట్ లవ్ చేసిన ఆనంద్ అంటే చాలా ఇష్టం అన్నట్టు చూపిస్తూ.. మరో పక్క ఆమెకు గిఫ్ట్స్ అంటే చాలా ఇష్టం అని.. అంటే ఆమె ఆశ పరురాలని చూపించాడు. ఆ తరవాత ఆమె కాలేజీకి వెళ్లిన తరవాత.. ఆమె లుక్ మార్చడంతో అబ్బాయిల్లో కొంత జోష్ వచ్చింది. హీరోయిన్ లుక్ మార్చిన తరవాత హీరో ఆనంద్ ఆమెను వ్యతిరేకించిన విధానం.. అక్కడ డైలాగ్స్ బాగున్నాయి. అందరూ ( Baby Movie Review and Rating ) ఒకటి, నేను వేరు కాదు.. అందరూ ఒకటే అని డైలాగ్ బాగుంది. ఇక సినిమాలో హీరోయిన్ లో వచ్చే మార్పులు అన్నిటిని ప్రేక్షకుడు ముందుగా అంచనా వేస్తాడు. కాబట్టి ఏమి కొత్తగా అనిపించదు. దానికి హీరో ఆనంద్ ఆమెకు ఇచ్చిన అటాక్ లో డైలాగ్స్ లో కొంచెం బూతులు ఎక్కువగా వాడాడు దర్శకుడు.
ఒక బూతు మాటని 10 సార్లు రిపీట్ గా హీరోయిన్ తో అనిపించడం కొంచెం ఆశ్చర్యాన్ని కలిగించింది. ఇది కేవలం ఇప్పటి జనరేషన్ ఇలాంటి డైలాగ్స్ ని, ఎమోషన్ ని ఇష్టపడతారని.. ఇష్టపడి వాళ్ళు మాట్లాడుకునే మాటలనే ఈ సినిమాలో పదే పదే చూపిస్తే వాళ్ళు సినిమాకి బాగా కనెక్టు అవుతారని దర్శకుడు అనుకున్నాడని మాత్రం తెలుస్తుంది. ఆ తరవాత సినిమాలో హీరోయిన్ హీరోకి తిరిగి అటాక్ ఇచ్చే ఫోన్ లో డైలాగ్స్ ఆడవాళ్ళని బాగా ఆకట్టుకునే విధంగా ఉన్నాయి. ఇక్కడ దర్శకుడు చాలా తెలివిగా ఆలోచించానని అనుకున్నాడు. హీరో వర్కింగ్ తో అబ్బాయిల మనసు దోచుకుంటే..ఇక్కడ అమ్మాయిలు మొత్తం హ్యాపీ అయిపోతారని ఫిక్స్ అయ్యాడు. ఇక ఇంటర్వెల్ బ్యాంగ్ మాత్రం అదరగొట్టాడు. ఎవ్వరిని ఊహించని విధంగా హీరోయిన్ బిహేవ్ చేసింది.
ఇక సినిమా ఇంటర్వెల్ వరకు చాలా రొటీన్ గా సినిమా చూస్తున్నట్టు ఫీల్ అవుతున్న ఆడియన్స్.. ఇక్కడ నుంచి ఎదో అదురుతాదని.. ఆశక్తి పెరిగింది. అప్పటివరకు హీరో నటన యావరేజ్ గా ఉంది. అలాగే సెకండ్ హీరో విరాజ్ నటన కూడా తన పరిధిలో బాగానే చేసాడు. హీరోయిన్ పాత్రకు మాత్రం మంచి స్కోప్ దొరికింది. ఆమెకు దొరికిన అవకాశాన్ని ఆమె బాగానే వాడుకుంది. చాలా బాగా నటించింది. ఇంటర్వెల్ వరకు సినిమా చూసిన ( Baby Movie Review and Rating ) సినిమాలెన్నో చూసినట్టు ఉండేలా సినిమా తీస్తే.. ఇంటర్వెల్ తరవాత సినిమా చాలా స్లో గా, సాగడం మొదలవుతుంది. ఇంటర్వెల్ వరకు హీరోయిన్ లో ఒకటే కోణం చూపించిన దర్శకుడు అక్కడి నుంచి అనేక కోణాలు చూపించాలని ఫిక్స్ అయ్యాడు. ఈ జనరేషన్ కి నచ్చాలని.. సీన్స్ మాత్రం బాగా రాసుకున్నాడు గాని.. అసలు అతను ఎలాంటి మోరల్ ని గాని.. మెసేజ్ ని గాని.. సినిమాలో ఏ పాత్ర ఎలాంటిది అని గాని సరిగ్గా జడ్జిమెంట్ అతనికి అతనే ఇవ్వలేనట్టు అనిపించింది.
హీరోయిన్ తాను చేసిన ఒక తప్పుకి చాలా ఫీల్ అయ్యి.. అందులోనుంచి బయటపడాలని విరాజ్ దగ్గరకు వెళ్లి అటాక్ ఇచ్చేటప్పుడు హీరోయిన్ లో ఒక మంచి క్యరెక్టర్ చూపించాడు. అప్పుడు విరాజ్ ఆమెకు ఒక రకమైన వార్ణింగ్ ఇచ్చిన విధానం బాగుంది. అక్కడ విరాజ్ బాగానే నటించాడు. వెంటనే హీరోయిన్ నార్మల్ అవ్వడం ఎం చెయ్యాలో తోచక అక్కడ నుంచి వెళ్లిపోవడంతో.. మళ్ళీ హీరోయిన్ క్యారక్టర్ తో కన్ఫ్యూజన్ మొదలయ్యింది ప్రేక్షకుడికి. ఇక హీరోతో ఆమె 30 రోజులు డేటింగ్ కి ఒప్పుకోవడం, ఆ టైం ఆనంద్ మరియు విరాజ్ ఇద్దరితో క్లోజ్ గా ఒకరికి తెలియకుండా ఇంకోరితో ఎంజాయ్ చేయడం చూపిస్తూ.. ఈరోజుల్లో కొంతమంది అమ్మాయిలు.. ఆలా ఒకరికి తెలియకుండా ఒక బాయ్ ఫ్రెండ్ తో ఎంజాయ్ చేసే కల్చర్ ని చూపించాడు. సినిమాని నిజ జీవితానికి దగ్గరగా చాలా న్యాచురల్ గా సినిమా తియ్యాలని దర్శకుడు అనుకున్నట్టు కనిపిస్తుంది.
ఈ సినిమా ప్రేమ కథ చిత్రం మాత్రం కాదని కొన్ని చోట్ల అనిపించింది. ఎందుకంటే 10 వ తరగతి నుంచి ప్రేమించుకున్న ఇద్దరి ప్రేమికుల మధ్య వాళ్ళ బాధలను, సమస్యలను చెప్పుకునేంత చనువు లేకుండా.. దాపరికాలు చూపించడం.. ఒక తప్పు నుంచి కాపాడుకోవడానికి.. అంత పెద్ద తప్పు చేయవచ్చా లేదా అని ఆలోచించకుండా.. హీరోయిన్ నెక్స్ట్ డే నుంచి రిలాక్స్ గా బతకాలంటే అలంటి తప్పుకి ఒప్పేసుకోవడం లాంటి క్యారక్టర్ ( Baby Movie Review and Rating ) దర్శకుడు రాసుకుని.. పైగా క్యారక్టర్ మీద అందరికి జాలి కలిగించాలి అనుకోవడమే కాకుండా.. ఆమె తన ప్రేమని చాలా ప్రేమిస్తుందని చూపించాలి అనుకోవడం చాలా అమాయకత్వంగా అనిపించింది. నలుగురిలో తన జీవితం గురించి తెలిసిపోగానే.. చచ్చిపోవాలన్నంత పని చేసిన హీరోయిన్.. తన ప్రేమ దూరం అయితే మాత్రం చావకుండా.. క్లైమాక్స్ లో ఆమె గురించి దర్శకుడు ఎం చెప్పాడో అతనికైనా అర్ధమయ్యిందా అనిపించింది.
ఈ సినిమాలో హీరోయిన్ తప్ప మిగిలిన అందరూ శంకనాకిపోయారని అనుకోవచ్చు. దానికి కారణం హీరోయిన్ అమాయకత్వం, తొందరపాటు కాదు.. చిన్నప్పటి నుంచి ఉన్న ప్రేమ కంటే కూడా అంతకంటే చిన్నప్పటి నుంచి ఆమెకు ఉన్న ఆశ, గ్రీడీ అంటే ఎక్కువ ఇష్టం అని అవ్వడం. అర్జున్ రెడ్డి లాంటి సినిమాలో ఎంత వోల్గారిటీ చూపించినా.. సినిమాలో హీరోయిన్ కి, హీరోకి ఒక మోరల్ ఉందని చూపించాడు. అలాగే.. RX 100 లాంటి సినిమాలో హీరోయిన్ ని ఒకరకమైన కోణంలో చూపించాడు. మంచిగా అయినా, చెడుగా అయినా ఎలాంటి కన్ఫ్యూషన్ లేకుండా ఒక లైన్ నమ్ముకుని సినిమా తీసి సూపర్ హిట్ కొట్టారు. కానీ ఈ సినిమాలో మాత్రం దర్శకుడు యూత్ మొత్తాన్ని అన్ని వైపుల నుంచి కవర్ చెయ్యాలనే తాపత్రయంలో చాలా కన్ఫ్యూజ్ అయ్యాడని అనిపిస్తుంది.
అలాగే ఈ సినిమాలో విరాజ్ తో హీరోయిన్ పడుకున్న సీన్ అంతలా చూపించడానికి.. సినిమా కథకి గాని, సెంటిమెంట్స్ గాని దేనికి ఆధారం అవ్వాలని కాదు.. కేవలం యూత్ రిపీట్ గా రావడం కోసం వాడినట్టు అనిపించింది. కథలో, సినిమాలో విషయం ఉంటె రిపీట్ ఆడియన్స్ కచ్చితంగా వస్తారు. ఇలాంటి ట్రిక్స్ అవసరం లేదు. హీరో తల్లి చనిపోయినప్పుడు.. లవర్ నాకేసిన చాక్లెట్ రేకులు దాచుకున్నాడు గాని.. తల్లి ఫోటో ఒకటి దాచుకోలేదు అనే డైలాగ్ మాత్రం చాలా బాగుంది. సెకండ్ హాఫ్ లో మనం ఊహించని టర్నింగ్ లు అయితే తిరిగాడు కానీ.. ఏది పెద్దగా నప్పించే టర్నింగ్ అవ్వలేదు. ఇక క్లైమాక్స్ అయితే అస్సలు నచ్చలేదు.
ప్రేమిస్తే లాంటి సినిమా ( Baby Movie Review and Rating ) క్లైమాక్స్ ని చూపించాలి అనుకున్నాడో ఏమో తెలీదు కానీ.. ఆ సినిమాలో ఆ కథకి అలంటి క్లైమాక్స్ ఓకే. కానీ ఇందులో అసలు నప్పలేదు. పైగా ఇలాంటి క్లైమాక్స్ లు మన తెలుగు వారికీ అస్సలు నచ్చదు. సినిమాలో మిగిలిన పత్రలు అన్నీ వారి పరిధిలో వాళ్ళు బాగానే నటించారు. హీరో ఆనంద దేవరకొండ తనదైన శైలిలో తనకు దక్కిన పాత్ర ప్రకారం అన్ని సీన్స్ బాగానే నటించాడు. ఏది ఏమైనా సినిమా యావరేజ్ గా ఉంది. యువత ఈ సినిమాని బాగానే ఎంజాయ్ చేయవచ్చు తప్ప సూపర్ హిట్ ఖాతాలోకి అయితే వెళ్ళదు. ఈ సినిమాతో అమ్మాయిలు ఎలాగైనా మారిపోయి.. కన్వీనెంట్, కంఫర్ట్ ప్రకారం బ్రతుకుతారని చెప్పాడు. దానికి తోడు కొంచెం ఒక అడుగుముందుకు వేసి.. అబ్బాయిలు కూడా వాళ్లకు తగ్గట్టు ఎంత స్ట్రాంగ్ అవ్వాలో చూపిస్తే బాగుణ్ణు అనిపించింది.
రేటింగ్ : 2.75/ 5
ఈ రివ్యూ మరియు రేటింగ్ కేవలం ఒక ప్రేక్షకుడు కోణం మాత్రమే.. అసలైన రివ్యూ మీకు మీరే ఇవ్వాలి..