Home Cinema Pushpa 2 : పుష్ప రాజ్ చిటికిన వెలుపై గోరు హైలెట్ చేయడం వెనుక ఇంట్రస్టింగ్...

Pushpa 2 : పుష్ప రాజ్ చిటికిన వెలుపై గోరు హైలెట్ చేయడం వెనుక ఇంట్రస్టింగ్ స్టోరీ రివీల్.

an-interesting-story-revealed-about-pushpa-fingernail-in-pushpa-2-movie

Pushpa 2 : సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, రష్మిక హీరోయిన్గా పుష్ప సినిమా ఎంత బ్లాక్ బస్టర్ హిట్ అయిందో మనందరికీ తెలిసిందే. ఈ సినిమాలో అల్లు అర్జున్ నటనకి నేషనల్ బెస్ట్ యాక్టర్ అవార్డు కూడా వచ్చింది. పుష్ప సినిమా అంత బ్లాక్ బస్టర్ హిట్ అవడంతో పుష్ప2 సినిమాని సుకుమారు తీస్తున్న సంగతి ( Pushpa fingernail in Pushpa 2 ) మనందరికీ తెలిసిందే. పుష్ప 2 సినిమాపై విపరీతమైన అంచనాలతో అల్లు అర్జున్ అభిమానులు మాత్రమే కాకుండా సినిమా తెలుగు సినిమా ఇండస్ట్రీ మొత్తం ఎదురుచూస్తుంది. ఎందుకంటే ఈ సినిమాని సుకుమార్ అంత ప్రతిష్టాత్మకంగా రూపొందించాలని ఎంతో కష్టపడుతున్న సంగతి ఎప్పటికప్పుడు తెలుస్తూనే ఉంటుంది.

Pushpa2-Allu-Arjun

ఈ సినిమాపై ఎప్పటి అప్డేట్ అప్పుడు ఎలా వస్తుందా అని అందరూ ఎదురు చూస్తున్నారు. ఏ ఒక్క చిన్న విషయం ఈ సినిమా గురించి తెలిసినా కూడా అభిమానులు ఎంతో ఆనందంతో పొంగిపోతున్నారు. అయితే ఇప్పుడు ఒక న్యూస్ సోషల్ మీడియాలో ఈ సినిమాపై వైరల్ అవుతుంది. అదేమిటంటే.. పుష్ప 2 పోస్టర్లో అల్లు అర్జున్ చిటికెన ( Pushpa fingernail in Pushpa 2 ) వేలిని ప్రత్యేకంగా చూపించడం జరిగింది. సుకుమార్ సినిమా తీసేటప్పుడు ఆయన చూపించే ప్రతి సీన్లో, ప్రతి దానిలో ఏదో ఒక పరమార్థం ఉంటుంది రంగస్థలం సినిమాలో కూడా ఆయన జగపతిబాబుని ఒక పాముతో పోల్చి చూపించాడు. అలాగే ఆ సినిమాలో జగపతిబాబుని.. ఒక పాముని తరిమి తరిమి ఎలా చంపుతారో అలాగే రామ్ చరణ్ కూడా చంపాడు.

See also  Prabhas Marriage : ప్రభాస్ పెళ్లి డేట్ మరియు వధువు గురించి ఇన్నాళ్ళకి క్లారిటీ ఇచ్చేసిన శ్యామలా దేవి..

Allu-Arjun-Pushpa2

సుకుమార్ అంటేనే ఒక లెక్కల మాస్టారు అన్న సంగతి మనందరికీ తెలిసిందే. లెక్కల మాస్టారు ఎప్పుడు ఒక ఫార్ములా ని బేస్ చేసుకుని ఆ లెక్కని మొత్తం పూర్తి చేస్తారు. అలాగే సుకుమార్ కూడా ప్రతి సినిమాలో ఏదో ఒక ఫార్ములానే పెట్టుకుంటాడు. ఆ ఫార్ములా ప్రకారం ఆ లెక్క అలా తీసుకెళ్లి చివరికి అదరగొడతాడు. అలాగే ఈ సినిమాలో కూడా పుష్ప 2 సినిమాలో కూడా అల్లు అర్జున్ చిటికెన వేలు అలా చూపించడం వెనుక ఉన్న ఫార్ములా ( Pushpa fingernail in Pushpa 2 ) ఏంటా అని అందరూ ఆరా తీస్తున్నారు. అయితే దీని మీద ఒక థియరీ ఉందని అందుకే అలా పెట్టాడని కొన్ని వార్తలు అయితే సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. ఇంతకీ ఆ చిటికెన వేలు పొడుగ్గా ఉండటం వెనుక ఉన్న కథేంటో తెలుసుకుందాం. కొన్ని చోట్ల తమ సంపదను, సమాజంలో స్థాయిని చూపించేందుకు చిటికెన వేలు గోరు పెంచుకుంటారట.

See also  Sreeja : శ్రీజ రెండవ భర్త రెండవ పెళ్లి చేసుకోబోయేది ఎవర్నో తెలిస్తే ఆశ్చర్యపోతారు.. అసలు ఇది నిజమేనా?

Allu-Arjun

అంతేకాకుండా తాను ఉన్నది రూల్ చేయడానికి మాత్రమే అనే సింబల్ ని చూపించేందుకు చిటికెన వేళని గోర్ని పెంచుకుంటారంట. అంటే దీన్నిబట్టి ఈ సినిమాలో అల్లు అర్జున్ తన చిటికెన వేలు పై ఎర్రచందనం బిజినెస్ ని నిలబెట్టి చూపిస్తాడన్నమాట. ఇలా పుష్ప 2 సినిమా పోస్టర్లో అల్లు అర్జున్ చిటికెన వేళలోనే ఇంత అర్ధం పరమార్థం ఉంటే.. ఇక సినిమా మొత్తాన్ని ఎంత జాగ్రత్తగా సుకుమారు తీస్తున్నాడు అర్థమవుతుంది. ఆయన ఆలోచన విధానం, ఆయన లెక్కలు, లాజిక్లు అన్నీ కూడా ఈ సినిమాపై ఖచ్చితంగా గట్టిగా ఉపయోగిస్తారని అర్థమవుతుంది. ఎందుకంటే పుష్పా సినిమాతో నేషనల్ బెస్ట్ యాక్టర్ అవార్డుని అల్లు అర్జున్కి ఆ సినిమాతో సంపాదించి పెట్టిన సుకుమార్.. ఇప్పుడు ఈ సినిమాతో ఎలాంటి విజయాన్ని సాధించాలని అనుకుంటున్నాడో.. ఎలాంటి లెక్కలు వేసుకుంటున్నాడు అనేది ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత చూస్తే గాని అర్థమవ్వదు.