Allu Arjun and his daughter pic became viral in social media: టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అంటే మెగా అభిమానులు అందరికీ చాలా ఇష్టం. ఎందుకంటే అల్లు అర్జున్ క్రమశిక్షణ, మంచి తనానికి మారు పేరులా ఉంటాడు. తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఇంతమంది మెగా హీరోలు ఒక వెలుగు వెలిగేలా చేసిన చిరంజీవి అంటే ఎంతో అభిమానాన్ని, కృతజ్ఞతని అల్లు అర్జున్ ఎప్పుడూ చూపిస్తాడు. అలాంటి గుణం ఉన్నవాడు కాబట్టే, అటు ప్రొఫిషనల్ గా, ఇటు పర్సనల్ గా కూడా అల్లు అర్జున్ మంచి స్థితిలో ఉన్నాడు. అల్లు అర్జున్ ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం మనందరికీ తెలిసినదే. అల్లు అర్జున్ స్నేహారెడ్డి ని కోరి పెళ్లి చేసుకున్నందుకు వారి జీవితం ఎంతో ఆనందంగా సాగుతుంది. బంగారం లాంటి పిల్లలు ఒక బాబు, పాప అల్లు అర్జున్ స్నేహ రెడ్డి లకు కలిగారు. అందులో పాప అర్హ గురించి చాలా మందికి తెలుసు.
ఎందుకంటే అర్హ సోషల్ మీడియాలో ఎక్కువగా అందరికీ కనిపిస్తాది. అదెలా అంటే.. అల్లు అర్జున్ తన కూతురితో కలసి చేసే అల్లరి ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో అల్లు అర్జున్ భార్య అల్లు స్నేహా రెడ్డి పోస్ట్ చేస్తూ ఉంటాది. ఇందు వలన ఈ తండ్రీ కూతుర్లు ఇద్దరూ అందరి కంట్లో ఉంటారు. అయితే అల్లు అర్జున్, అర్హ కి సంబంధిన ఒక ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అల్లు అర్హ (Allu Arha) యోగా చేస్తున్న పిక్ ఇది. తన అరికాళ్ళని తన తలకి టచ్ చేస్తున్న యోగా ముద్రను అర్హ వేయగా.. ఆమె యోగా భంగిమ చూస్తూ పక్కన ఉన్న బన్నీ షాకై తలపట్టుకున్నాడు. అల్లు అర్జున్ ఎంత ఉన్న కుటుంబంలో నుంచి వచ్చినా, తాను మాత్రం ఎప్పుడు తన వృత్తి పై శ్రద్ధ పెట్టి కష్టపడి ఉన్నతమైన స్థితికి వచ్చిన వ్యక్తి.
తన ప్రతీ సినిమా సినిమాకి తనని తాను ట్యాలంటేడ్ గా చూపించే ప్రయత్నం.. బన్నీ ఎంతో కష్టపడే గుణం ఉన్నవాడని అర్ధం అవుతాది. అలాంటి అల్లు అర్జున్ కి తన కూతురు ఆరేళ్ళ వయసులో అంత బాగా యోగాశనం వెయ్యడం చూసి షాక్ అయిపోయాడు. తన కూతురిలో ( Allu Arjun and his daughter pic became viral in social media ) ఆ ఏజ్ కి ఏదైనా నేర్చుకుంటే, అంత పట్టుదలగా నేర్చుకోవడం ఆనందాన్ని, ఆశ్చర్యాన్ని రెండిటిని కలిగించింది బన్నీకి. అంతేకాదు అర్ష ట్యాలంట్ చూసి, మెగా అభిమానులు అందరూ ప్రశంశల వర్షం కురిపిస్తున్నారు. అభిమానులే కాదు, ఎందరో నెటిజనులు అభినందిస్తున్నారు. అయితే తన కూతురిని అంత బాగా పెంచుతున్న తన భార్య స్నేహ రెడ్డి కి అల్లు అర్జున్ ఖచ్చితంగా మంచి గిఫ్ట్ ఇచ్చి, బాగా పొగడాలని నెటిజనులు కామెంట్ చేసుకుంటున్నారు.
ఇప్పటికే అల్లు అర్హ సినిమా రంగంలో అడుగు పెట్టేసింది. ఇక రిలీజ్ కి కూడా సిద్ధంగా ఉంది. సమంత, మలయాళ నటుడు దేవ్ మోహన్ జంటగా తెరకెక్కిన ‘శాకుంతలం’ సినిమాలో లిటిల్ ప్రిన్సెస్ భరత క్యారెక్టర్ ను అర్హ పోషించింది. పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ అవుతున్న ఈ సినిమా తో అల్లు అర్హ కి ఎలాంటి పేరు వస్తాదో చూడాలి. అల్లు అర్హ ట్యాలంట్ చూస్తుంటే నెక్స్ట్ జనరేషన్ లో ఎలాంటి అద్భుతాలు సృష్టిస్తాదో అని అందరూ అనుకుంటున్నారు. ఏప్రిల్ 14 న శాకుంతలం సినిమా రిలీజ్ కు సిద్ధం అయ్యింది. అల్లు అర్హ తొలి సినిమా తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లోనూ విడుదల కాబోతోంది.