Home Cinema Amitabh Bachchan : క్రికెట్ పై అమితాబ్ అలాంటి ట్వీట్ చేయడానికి అసలు కారణం అదేనట..

Amitabh Bachchan : క్రికెట్ పై అమితాబ్ అలాంటి ట్వీట్ చేయడానికి అసలు కారణం అదేనట..

all-indians-request-amitabh-bachchan-does-not-attend-for-world-cup-2023-india-vs-australia-game

Amitabh Bachchan : భారతదేశంలో క్రికెట్ టీమ్ అంటే ఇష్టం లేని వాళ్ళు అంటూ ఉండరు. ఈ ఆటను చూసేందుకు ఉద్యోగులు సెలవులు పెట్టుకొని, వ్యాపారాలు పనులు మానుకుని, కాలేజీకి వెళ్లాల్సిన కుర్రాళ్ళు కాలేజీ డుమ్మా కొట్టి మరి కూర్చొని చూడడం జరుగుతుంది. ఇప్పటికీ మన భారతదేశంలో బాగా క్రేజ్ ( Amitabh for World Cup 2023 ) ఉన్న ఆట ఏది అంటే అది క్రికెట్ అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు అందరి దృష్టి భారతదేశ వరల్డ్ కప్ మీదే ఉంది. ఈసారి వరల్డ్ కప్ను సాధించాలని ప్రతి ఒక్కరూ ఆశగా ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే ఒక్కొక్క ఆట గెలుచుకుంటూ చివరి ఫైనల్ స్టేజికి చేరుకుంది భారతదేశం.

Amithab-Bachan-request-world-cup-Indians

అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో ఆదివారం జరిగే టైటిల్ పోరులో ఐదు సార్లు ఇప్పటికే విశ్వవిజేతగా గెలిచిన ఆస్ట్రేలియా టీం తో భారతదేశం ఆడబోతుంది. ఆస్ట్రేలియా మీద భారతదేశం కచ్చితంగా గెలవాలని, వరల్డ్ కప్ సాధించాలని భారతదేశం మొత్తం ఎంతో ఆశగా ఎదురుచూస్తుంది. క్రికెట్ టీం లో తమ సత్తాల్ని ( Amitabh for World Cup 2023 ) చూపిస్తున్న ప్రతి ప్లేయర్ మీద.. సామాన్య మనుషులు మాత్రమే కాకుండా, సెలబ్రిటీస్ కూడా ఎంతో పొగుడుతూ వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు. వాళ్ళు ఆడే ఆటకి ఫిదా అయిపోతున్నారు. ఇదిలా ఉంటే బిగ్ బి అమితాబ్ బచ్చన్ కూడా ఇప్పుడు ఒక సెన్సేషనల్ ట్వీట్ ని పోస్ట్ చేశారు.

See also  Samantha : ఉన్న భార్యకి విడాకులిచ్చి మరీ సమంత తో పెళ్ళికి రెడీ అవుతున్న ఆ హీరో!

Amithab-Bachan-request-world-cup-2023

అమితాబ్ బచ్చన్ పోస్ట్ చేసిన ఆ ట్విట్ సెన్సేషనల్ గా మారింది. భారతదేశంలో ఉన్న ప్రతి సామాన్యుడితో పాటు, ఆయన్ని అత్యంతగా ప్రేమించే ఆయన అభిమానులు కూడా వెంటనే రియాక్ట్ అయ్యారు. ఆయన పై విపరీతంగా కామెంట్స్ చేస్తున్నారు. ఇంతకీ అసలు సంగతి ఏమిటంటే.. నేను ఎప్పుడైతే ఆట చూడలేదో ( Amitabh for World Cup 2023 ) అప్పుడు గెలిచింది అంటూ ఆయన ట్రీట్ చేశారు. రెండు రోజుల క్రితం జరిగిన సెమీఫైనల్స్ లో న్యూజిలాండ్ తో జరిగిన మ్యాచ్లో భారతదేశం గెలిచింది. అయితే దాని గురించి.. ట్వీట్లో నేను చూడకపోతే మ్యాచ్ గెలిచారు అని అమితాబ్ రాసుకొచ్చారు. అంతే ఇంక అక్కడ నుంచి అలజడి మొదలైంది. అందరూ ఒక్కసారిగా రియాక్ట్ అవ్వడం మొదలుపెట్టారు.

See also  Chiranjeevi: ఆ ఒక్క కారణం చెప్పి వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠిల పెళ్లి ఆపేసిన చిరంజీవి.. ఆ కారణం ఏంటంటే..

Amithab-Bachan-Australia-vs-Indian

అసలే సెంటిమెంట్స్ ఎక్కువగా ఉన్న మన ప్రజలు.. అమితాబ్ బచ్చన్ మ్యాచ్ చూడకపోతే మ్యాచ్ గెలవడం ఖాయమని ఆలోచనలో పడి.. ఈ ఒక్కసారి మా కోసం త్యాగం చేయండి, ఆదివారం జరిగే ఫైనల్స్ మాత్రం దూరంగా ఉండండి.. లేదంటే మేము మిమ్మల్ని ఎక్కడికైనా తీసుకెళ్లి దాచేస్తాం అంటూ సరదాగా అమితాబ్ పై కామెంట్లు చేయడం మొదలు పెట్టారు. ఇది చూసిన అమితాబ్ మళ్లీ మరో ట్వీట్ పెట్టాడు. ఇప్పుడు వెళ్లాలా వద్దా అని ఆలోచిస్తున్నా అని ట్వీట్ చేయడంతో.. అభిమానులు మరింత కంగారు పడుతున్నారు. వద్దు సామి మా కోసం ఈ ఒక్కసారి మానేయండి అని అంటూ ప్రాధేయ పడుతున్నారు. అయితే అందరూ అమితాబ్ ఇలాంటి ట్వీట్ ఎందుకు చేశారు? చేసి మరి అందరితో ఇలా ఎందుకు అనిపించుకుంటున్నారు? అని కొందరు నెటిజనులు అంటే.. దానికి అభిమానులు ఇలా.. కేవలం అందరి దృష్టి ఆదివారం వచ్చే వరల్డ్ కప్ మీద పడాలని, భారతీయులకు వాళ్ళ క్రికెట్ టీం మీద ఉన్న ప్రేమని ఒక్కసారి చాటి చూపించాలని, వాళ్ళ ఐకమత్యాన్ని, ఇష్టాన్ని చూసి క్రికెట్ టీం గెలిచి వరల్డ్ కప్ తీసుకురావాలని.. భారతీయులందరూ ఎంత కోరుకుంటున్నారో చూపించాలని అమితాబ్ ఇలా ట్రీట్ చేసి.. అందర్నీ యాక్టివ్ చేస్తున్నారని అంటున్నారు.