Home Cinema Kannappa: కన్నప్ప సినిమాలో శివుడి పాత్రలో ఆ స్టార్ హీరో.. ఫస్ట్ లుక్ విడుదల..

Kannappa: కన్నప్ప సినిమాలో శివుడి పాత్రలో ఆ స్టార్ హీరో.. ఫస్ట్ లుక్ విడుదల..

akshay-kumar-to-play-shiva-role-in-manchu-vishnu-movie-kannappa

Kannappa: తెలుగు సినిమా ఇండస్ట్రీ లో లెజెండ్స్ గా పిలవబడే నటులలో ఒకరు మంచు మోహన్ బాబు. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ ఇమేజి లేకుండా ఇండస్ట్రీ లోకి వచ్చిన ఆయన, విలన్ గా, క్యారక్టర్ ఆర్టిస్టుగా, హీరో గా, నిర్మాతగా ఇలా ఎన్నో రకాల పాత్రలు పోషించి శబాష్ అనిపించుకున్నాడు. అయితే ఆయన కొడుకులు ఇద్దరూ కూడా ఆయన స్థానానికి చేరుకోలేకపోయారు. మంచు విష్ణు అయితే కనీస స్థాయి స్థిరమైన మార్కెట్ ని కూడా ఏర్పాటు చేసుకోలేకపోయాడు.

అయితే మోహన్ బాబు ఇప్పటి వరకు తాను సంపాదించిన ఆస్తులన్నీ పెట్టి, మంచు విష్ణు డ్రీం ప్రాజెక్ట్ అయిన కన్నప్ప(Kannappa) చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాకి దాదాపుగా 200 కోట్ల రూపాయిల భారీ బడ్జెట్ ని ఖర్చు చేస్తున్నారు. ఇదంతా పక్కన పెడితే ప్రతీ ఇండస్ట్రీ నుండి ఒక స్టార్ హీరోని ఈ సినిమాలో నటింప చేస్తున్నారు. మన టాలీవుడ్ నుండి రెబల్ స్టార్ ప్రభాస్ కూడా ఈ సినిమాలో నటించాడు. అయితే ఈ సినిమాలో ఆయన క్యారక్టర్ శివుడు అని అందరూ అనుకున్నారు. కానీ నిన్న మేకర్స్ విడుదల చేసిన ఒక పోస్టర్ ని చూసి ప్రభాస్ అభిమానులు కంగు తిన్నారు.

See also  Star Hero Wife: నాకేం తక్కువ హీరోయిన్లను ఏ మాత్రం తీసిపోనంటున్న స్టార్ హీరో భార్య. హాట్ గా స్లిమ్ గా ఉన్న ఫోటోలు నెట్టింట వైరల్..

విషయం ఏమిటంటే బాలీవుడ్ సూపర్ స్టార్స్ లో ఒకరైన అక్షయ్ కుమార్ కూడా ఈ చిత్రం లో నటిస్తున్నాడు. ఆయన పుట్టిన రోజు సందర్భంగా చిన్న ప్రీ లుక్ ని విడుదల చేసారు. ఈ ప్రీ లుక్ లో అక్షయ్ కుమార్ చేతికి రుద్రాక్ష మాల తగిలించి ఉంది. చూస్తుంటే ఆయన మహాశివుడి క్యారక్టర్ ని చేసినట్టుగా అనిపిస్తుంది. మరి ఇన్ని రోజులు ఆ క్యారక్టర్ ప్రభాస్ చేస్తాడు అన్నారు కదా, ఇప్పుడు సడన్ గా ఈ ట్విస్ట్ ఏంటి?, అసలు ఇంతకీ ఇందులో ప్రభాస్ ఏ పాత్ర చేస్తున్నాడు అంటూ సోషల్ మీడియా లో మంచు విష్ణు ని ట్యాగ్ చేసి అభిమానులు ప్రశ్నిస్తున్నారు.

See also  Kalyan Ram - NTR: కళ్యాణ్ రామ్ పరిస్థితి వేరేలా ఉండేది.?? ఆ రోజు ఎన్టీఆర్ సాయం చేయకుంటే..

అయితే అందుతున్న విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమాలో ప్రభాస్ నంది పాత్ర పోషిస్తున్నాడట. అంతే కాదు ఇది చిన్న రోల్ కాదని, సినిమాలో దాదాపుగా 40 నిమిషాల పాటు ఈ పాత్ర ఉంటుందని, ప్రభాస్ అభిమానులు అసలు నిరాశ చెందారు అని అంటున్నారు. ఇందులో ఎంతమాత్రం నిజం ఉందో చూడాలి. శివుడి క్యారక్టర్ కాకుండా, నంది క్యారక్టర్ అని తెలిసినపుడే ప్రభాస్ ఫ్యాన్స్ లో జోష్ పోయింది, ఇక వాళ్ళు ఈ సినిమాకి ఎంత వరకు సపోర్ట్ చేస్తారో చూడాలి.