Samantha: స్టార్ హీరోల సరసన వరుస సినిమాలో నటిస్తూ తెలుగులో మంచి స్టార్డమ్ సంపాదించుకొని స్టార్ హీరోయిన్ గా ఎదుగుతూ చాలా మంచి పేరు సంపాదించుకున్న సమంత గురించి తెలియని సినీ ప్రేమికులు ఉండరు. ఇక ప్రస్తుతం సమంత క్రేజ్ ఎంత హై రేంజ్ లో ఉందో మనందరికీ తెలిసిన విషయమే.. కానీ సమంత దగ్గర ఒక విషయాన్ని మాత్రం ఖచ్చితంగా మెచ్చుకో దగ్గ విషయం. చాలా మంది హీరోయిన్లు టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా పేరు సంపాదించుకున్న తర్వాత పూర్తిగా టాలీవుడ్ ని వదిలి బాలీవుడ్ కి పరిమితమైపోతారు. (Samantha Tollywood To Bollywood)
కానీ.. సమంత మాత్రం ఓ వైపు టాలీవుడ్ ని లీడ్ చేస్తూనే మరో వైపు బాలీవుడ్ ని కూడా సమానంగా బ్యాలెన్స్ చేస్తూ వరుస ప్రాజెక్టులను ఓకే చెప్తూ మంచి దూకుడు మీద ఉంది. ఇక ఇటీవల కాలంలో మయోసైటీస్ అనే వ్యాధి బారిన పడి చాలా బాదని అనుభవించి ఇక కోలుకుంటుందో లేదో సినిమాలో నటిస్తుందో లేదో సినిమాలకి పూర్తి గుడ్ బై చెప్పేస్తుందని అందరూ భావించారు. కానీ.. వాటన్నిటినీ తిప్పికొడుతూ పూర్తి ఆరోగ్యంతో మళ్ళీ మన ముందుకి రెట్టింపు ఎనర్జీతో వచ్చింది. ఇక ప్రస్తుతం సమంత చేతిలో వరుస చిత్రాలతో చాలా బిజీ షెడ్యూల్ ని ఆమె మెయిన్టైన్ చేస్తుంది.
తన అంద చందాలతో ఇండస్ట్రీని ఊపేస్తూ నెంబర్ వన్ హీరోయిన్ గా కొనసాగుతుంది. కాగా ప్రస్తుతం దర్శక నిర్మాతలకి ఈ అమ్మడు పెద్ద తల నొప్పి తెచ్చి పెట్టిందట. ఎందుకంటే నిన్నగాక మొన్నటి వరకు మూడు నుండి నాలుగు కోట్లు డిమాండ్ చేస్తూ రెమ్యూనరేషన్ పుచ్చుకున్న సమంత. ప్రస్తుతం ఏకంగా తన రెమ్యునరేషన్ ను ఆకాశానికి ఎత్తి పడేసిందట.. ఒక్కో సినిమాకి ఈ అమ్మడు పది కోట్ల వరకు డిమాండ్ చేస్తుంది అంట.. కేవలం బాలీవుడ్ స్టార్ట్స్ డిమాండ్ చేసే తరహాలో ఈ అమ్మడు సిటాడల్ వెబ్ సిరీస్ కి ఏకంగా పది కోట్లు డిమాండ్ చేసిందట.. (Samantha Tollywood To Bollywood)
ఒకప్పుడు భారీ బడ్జెట్ చిత్రాలకు సైతం కేవలం మూడు నుండి నాలుగు కోట్లు తీసుకున్న సమంత ప్రస్తుతం ఏకంగా పది నుంచి పన్నెండు కోట్ల వరకు డిమాండ్ చేస్తుందట. దీంతో ఇటు బాలీవుడ్ మేకర్స్ అటు టాలీవుడ్ మేకర్స్ కూడా తలలు పట్టుకుంటున్నారు. సమంతకి అంత రెమ్యునరేషన్ ఇవ్వడం మా వల్ల కాదంటూ చేతులెత్తేస్తున్నారు. ప్రస్తుతం సమంత శివ నిర్మాణ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ దర్శనం కుషి అనే చిత్రంలో నటిస్తుంది. ఇదే కాకుండా బాలీవుడ్ లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకు ఎక్క బోతున్న వెబ్ సిరీస్ సిటాడెల్ లో కూడా సమంత నటిస్తుంది. ఇదే కాకుండా ఇంకా సమంత చేతిలో నాలుగైదు ప్రాజెక్టులు ఉన్నాయని వార్తలు వినిపిస్తున్నాయి.