
Ram Charan – Sreeleela : ప్రజెంట్ ఎక్కడ చూసినాశ్రీలీల గురించే వార్తలు వస్తున్నాయి. ఈమె వరుసగా పది సినిమాలకు సంతకాలు పెట్టి మరి.. తన ఖాతాలో ఆఫర్స్ వేసుకుంది. 10 సినిమాలు వరుసగా ఆమె చేతిలో ఆఫర్స్ ( Ram Charan and Sreeleela ) ఉన్నాయంటే అది మామూలు మాట కాదు. అంటే ఆల్రెడీ ఆమె పెద్ద స్టార్ హీరోయిన్ అయిపోయినట్టే ఫిక్స్ అయిపోవచ్చు. ఎందుకంటే ఇంచుమించుగా అందరు పెద్ద స్టార్ హీరోలు సరసన ఆమెకు అవకాశాలు వచ్చేస్తున్నాయి. ఇప్పటికే ఆమె సక్సెస్ఫుల్ హీరోయిన్ గా, లక్కీ హీరోయిన్గా పేరు సంపాదించుకోవడమే కాకుండా.. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మహేష్ బాబు నటిస్తున్న గుంటూరు కారం లాంటి ప్రతిష్టాత్మమైన సినిమాలో కూడా నటిస్తుంది.
ఇప్పుడు అందరూ షాక్ అయ్యే విధంగా మరో వార్త ఏమిటంటే.. గ్లోబల్ స్టార్ హీరోగా పేరు తెచ్చుకున్న రామ్ చరణ్ సరసన కూడా శ్రీలీల నటించబోతుందని అంటున్నారు. శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా గేమ్ చెంజర్ సినిమా రూపొందుతున్న విషయం మనందరికీ తెలిసిందే. రామ్ చరణ్ తన కూతురు పుట్టిన తర్వాత కొన్ని రోజులు ఆ ( Ram Charan and Sreeleela ) చిన్నారితో ఉండి.. ఆ తర్వాత శరవేగంతో ఈ షూటింగ్లో పాల్గొంటున్న సంగతి మనందరికీ తెలిసిందే. ఈ సినిమాపై రామ్ చరణ్ అభిమానులకు, మెగా అభిమానులకు భారీ అంచనాలైతే ఉన్నాయి. దీనికోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ సినిమా తర్వాత రామ్ చరణ్ బుచ్చిబాబు సన దర్శకత్వంలో సినిమా చేయడానికి కమిట్ అయ్యాడు.
ఆ సినిమాలో హీరోయిన్ ఇప్పుడు శ్రీ లీల అని వార్తలు వస్తున్నాయి. ముందు ఆ సినిమాలో హీరోయిన్గా జాహ్నవి కపూర్ ని అనుకున్నారు. జూనియర్ ఎన్టీఆర్, కొరటాల శివ దర్శకత్వంలో.. దేవరా సినిమాకి జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే. తెలుగు సినిమా ఇండస్ట్రీలో మొదటిసారి హీరోయిన్గా ఆ సినిమాతో ( Ram Charan and Sreeleela ) జాహ్నవి కపూర్ ఎంట్రీ ఇస్తుంది. ఇక ఆమె సెకండ్ సినిమా రామ్ చరణ్ తోనే అనే వార్తలైతే వినిపించాయి. అయితే ఇప్పుడు రామ్ చరణ్ సినిమాలో జాహ్నవి కపూర్ ని కాదని శ్రీలీల ని తీసుకుంటున్నారట. కారణమేమిటో తెలీదు గానీ.. జాన్వీక కపూర్ ని కాదని మరీ..శ్రీలీలని తీసుకోవడం అంటే అది మామూలు మాట కాదు.
జాన్వి కపూర్ కంటే శ్రీలీలని పెట్టుకోమని, శ్రీలీలే హీరోయిన్గా డేట్స్ తీసుకోమని స్వయంగా రామ్ చరణ్ చెప్పాడని సినిమా ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తుంది. దీనితో అందరికీ ఆశ్చర్యంగా ఉంది. రామ్ చరణ్ ఎందుకు జాన్విక కపూర్ ని కాదని.. శ్రీలీలని ఎన్నుకున్నాడు? అనేది అర్థం కావడం లేదు. జాన్వీ కపూర్ తెలుగులో హీరోయిన్ గా నటించడం వలన శ్రీదేవి అభిమానులందరికీ కూడా ఆకట్టుకున్నట్టు ఉంటుంది. సినీ అభిమానులు అందరూ కూడా సినిమాపై కొంత కన్ను వేస్తారు.అది కూడా ఒక ప్లస్ అవుతుంది కదా అని కొందరు అనుకుంటుంటే.. మరికొందరు రామ్ చరణ్ కావాలనే వద్దని ఉంటాడు. ఎందుకంటే తన ఇప్పటికే తనకి మంచి క్రేజ్ అనేది వచ్చేసింది.. ఆర్ఆర్ఆర్ సినిమాతో తన స్థాయి ఎక్కడికో వెళ్ళింది. ఆ తర్వాత వచ్చే సినిమాల్లో ఒకవేళ సక్సెస్ అయిన ఫెయిల్యూర్ అయిన తనకే క్రెడిట్ పడాలి గాని.. ఆ ఖాతాని హీరోయిన్ కి వేసే ప్రసక్తే లేదని అనుకుంటున్నాడేమో అని మరికొందరు అనుకుంటున్నారు.